Home News వావర్ మసీదులోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన స్త్రీలు అరెస్ట్.. కేరళ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి

వావర్ మసీదులోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన స్త్రీలు అరెస్ట్.. కేరళ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి

0
SHARE
కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది. శబరిమల తీర్థయాత్రలో భాగంగా దేవస్థానం మార్గమధ్యలో ఉన్న వావర్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు.
తమిళనాడులోని హిందూ మక్కల్ కచ్చి సంస్థ మహిళా విభాగానికి చెందిన రేవతి, సుశీలా దేవి, గాంధీమతి, ఈమధ్య ఇద్దరు మహిళలు తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా శబరిమల ఆలయప్రవేశం చేసిన నేపథ్యంలో తాము కూడా శబరిమల యాత్ర సంప్రదాయం భాగంగా వస్తున్న అక్కడి వావర్ మసీదుని అందరి సమక్షంలో సందర్శిస్తామని కొద్దిరోజుల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఈ క్రమంలో శబరిమల యాత్రలో భాగంగా ఆనవాయితీ ప్రకారం ముందుగా దర్శించేందుకు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా  ముగ్గురు మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు.  ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఐపీసీ సెక్షన్ 153 ఏ కింద కేసు నమోదు చేశారు.
Source: Organiser