
ఖుదీరాం బోస్
మాతృ స్వేచ్చ కొరకు మరి మరి సిద్దమై
ఉరిని ముద్దిడుచును యువకు నిల్చె
హృదినిగెల్చినట్టి ఖుదిరాము డితడేను
వినుర భారతీయ వీర చరిత
బాలుడైనగాని బాంబువేసెను జూడు
ఉరినివేయ తాను మురిసిపోయె
హృదిని గెల్చినట్టి ఖుదిరాము డితడేను
వినుర భారతీయ వీరచరిత
భావము
తల్లి భారతి స్వేచ్చ కోసం మళ్ళీ మళ్ళీ ఉరికి సిద్ధమే అంటూ ముందుకు వచ్చి ఉరిని ముద్దాడి మన హృదయాలను గెలుచుకున్న యువ కిశోరం ఖుదీరాం బోస్ ఇతడే. ఈ వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా!
-రాంనరేష్