రామ్‌ప్రసాద్ బిస్మిల్
విప్లవానుజులకు విషయమును తెలిపి
కలిసి దాడి చేసె కాకొరి నను
రగ రగ రగిలేటిరాంప్రసాదు గనుము
వినుర భారతీయ వీరచరిత
భావము
ఆంగ్ల పాలకుల ఆయుధాలు, డబ్బుతో వెళుతున్న రైలును స్వరాజ్య సమరయోధుడు రామ్‌ప్రసాద్ బిస్మిల్ కనిపెట్టారు. అదే విషయాన్ని తోటి విప్లవకారులకు తెలియజేశారు. రైలులో తరలిపోతున్న ఆయుధాలు, డబ్బును స్వతంత్ర సమరానికి సహాయకారిగా చేసుకోవాలని భావించారు. కాకోరి అనే ప్రదేశంలో రైలు నుంచి ఆయుధాలను, డబ్బును దోపిడీ చేసి, బ్రిటీషువారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించి, రగడ నిప్పు కనిక లాగ రగిలినట్టి రామ్‌ప్రసాద్ బిస్మిల్ వీర చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్