Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

రాజగురు

బాంబులేసినాడు భగత సింగునుగూడి
పూణె నగరమందు పుట్టినట్టి
రగరగరగిలేటి రాజగురువితడు
వినుర భారతీయ వీర చరిత

భావము

పూణె నగరంలో జన్మించినవారు, నైపుణ్యం కలిగిన వస్తాదు. సంస్కృతంలో పండితులు, వీటన్నింటికీ మించి అపర దేశభక్తులు, చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి హిందూస్తాన్ సోషల్ రిపబ్లిక్ఆర్మీ అనే విప్లవసంస్థను స్థాపించినవారు, భగత్‌ సింగ్‌తో కలిసి అనేక విప్లవ పోరాటాల్లో పాల్గొన్నవారు, చివరికి అసెంబ్లీలోభగత్ సింగ్‌తో కలిసి బాంబులు విసిరిన కేసులో అరెస్టయినవారు, భగత్ సింగ్, సుఖదేవ్‌లతో కలిసి ఒకేసారి ఉరిని ముద్దాడినవారు, తల్లి భారతి స్వేచ్ఛ కోసం నిప్పుకణిక వలె రగరగ రగిలిన శివరాం రాజగురు వీరచరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్