భగత్ సింగ్
విప్లవమును పంచి వీరుడుగవెలిగి
బాంబు వేసి చూపె భగతుసింగు
ఉరిని ముద్దిడెగద మురిపెముతోడను
వినుర భారతీయ వీర చరిత
భావము
తండ్రి భుజాలపై ఉన్న పసి ప్రాయంలోనే ఆంగ్లేయులను పారద్రోలడానికి పొలంలో తుపాకి మొక్కలు నాటుతానన్న పోరాట యోధులు. యవ్వనంలో చంద్రశేఖర ఆజాద్‌తో కలిసి విప్లవ సంస్థను స్థాపించినవారు. ఎందరెందరో విప్లవ వీరులకు మార్గదర్శనం చేసినవారు. చివరికి అసెంబ్లీలో బాంబులు విసిరి, సుఖదేవ్, రాజగురులతో కలిసి నూనూగుమీసాల వయస్సులో నవ్వుతూ ఉరి కంబం ఎక్కినవారు. ఎవరి పేరు వింటే నరనరాల్లో చైతన్యం పొంగుతుందో అటువంటి వీరుడు భగత్ సింగ్ చరిత విను ఓ భారతీయుడా!
రాంనరేష్