
భరతుడు
బాలునిగను తానుయాడె సింహములతొ
పాలనయును జేసె భారతమును
తనదు నామమదియె మనభువికినొసగె
వినుర భారతీయ వీర చరిత
భావము
బాలుడిగా ఉన్నప్పుడే సింహం పిల్లలతో ఆడుకున్న ధీరుడు. దేశాన్ని అంతటినీ ఏకతాటిపైకి తెచ్చి పాలించిన వీరుడు. తన పేరిటనే దేశం భారతదేశంగా పిలువబడేట్టు చేసిన భరతుని వీర చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్