శ్రీరాముడు
తండ్రి మాటనొగ్గి తానడవులకేగె
ఒకటె మాట బాణమొకటెయనుచు
రావణుని వధించి రాముడు నిలచె
వినుర భారతీయ వీర చరిత
భావము
తండ్రి మాటకు కట్టుబడిన పితృవాక్యపరిపాలకుడు, సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్లిన త్యాగధనుడు, ధర్మ రక్షణకు కంకణధారి అయినవాడు, ఒకటే మాట ఒకటే బాణం అని ఆచరించిన సర్వోత్తముడు, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అన్న ఆర్యోక్తిని అనుసరించి రాక్షసాధముడైన రావణుని వధించిన శ్రీ రాముని చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్