Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

పుశ్యమిత్రుడు

వారి దేశమునకు పారిరి గ్రీకులు
పుశ్యమిత్ర ఖడ్గపు రుచి జూసి
శుంగ వంశమందు శృంగ సముడితడు
వినుర భారతీయ వీర చరిత

భావము

గ్రీకు దురాక్రమణదారుడు డెమిట్రియస్ నేతృత్వంలో గ్రీకు సేనలు భారతదేశంలో అయోధ్య వరకు చొచ్చుకొని వచ్చాయి. అయినా కానీ పట్టించుకోని మౌర్య చక్రవర్తి బృహద్రథుని దేశ రక్షణ కోసం అతడి మంత్రి పుశ్యమిత్రుడు అంతమొందించారు. డెమిట్రియస్‌కు ఎదురొడ్డి నిలిచారు. పుశ్యమిత్రుని ఖడ్గ ధాటికి తాళలేక గ్రీకు సేన వారి దేశానికి పారిపోయింది. శుంగ వంశములో శృంగ(శిఖర) సమానుడైన పుశ్యమిత్రుని వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా!

-రాంనరేష్