ఫతేసింగ్, జొరావర్ సింగ్
ఇటుకలన్ని పేర్చ ఇంచుకన్ కదలక
నిల్చినారిరువురు నిబ్బరముగ
పరమధీరులేను ఫతెజొరావరసింహ
వినుర భారతీయ వీరచరిత
భావము
సిక్కుల పదవ గురువు గురుగోవిందసింహుని పుత్రులు ఫతేసింహ, జొరావర్ సింహ. వీరిని ఇస్లాం మతం స్వీకరించండి అని ఔరంగజేబు చెబితే తిరస్కరించిన కారణంగా, వీరిని సజీవ సమాధి చేయమని ఆదేశిస్తాడు కరకు ఔరంగజేబు. ఈ పసిబాలురిని ఇద్దరినీ నిలబెట్టి చుట్టూ ఇటుకలు పేర్చి బతికుండగానే సమాధి కడుతుంటే కొంచెం కూడా చలించకుండా నిలబడ్డారే గాని తమ ధర్మాన్ని వీడలేదు. ధర్మ రక్ష కోసం బలియైన వీర పుత్రుల చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్