Home Telugu Articles దశాబ్దాలుగా దేశంలో యథేచ్ఛగా వీసా ఉల్లంఘనలు 

దశాబ్దాలుగా దేశంలో యథేచ్ఛగా వీసా ఉల్లంఘనలు 

0
SHARE

–A.S.SANTHOSH

ఇతరుల మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, వారిని బలవంతపెట్టి, ప్రలోభపెట్టి లేదా ఒక మతం కన్నా మరో మతం గొప్పది అని భ్రమింపజేస్తూ వారిని మతం మార్చడం అనేది ఏవిధంగానూ సమర్ధించదగినది కాదు అనడంలో మరో మాటకు తావులేదు

..అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన గ్రాహం స్టెయిన్స్ హత్య కేసు తీర్పు సందర్భంగా 2011లో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. గ్రాహం స్టేయిన్స్ హత్యకేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారించిన జస్టిస్ పి. సదాశివం, బీఎస్ చౌహాన్లతో కూడుకున్న సుప్రీం కోర్ట్ ధర్మాసనం.. దేశంలో జరుగుతున్న బలవంతపు మతమార్పిళ్లపై తీవ్ర విచారం వ్యక్తంచేసింది. అంతేకాకుండా మరణించిన గ్రాహం స్టెయిన్స్ విషయంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒడిశాలో మతమార్పిళ్లకు పాల్పడుతున్న గ్రాహం స్టైన్స్ విషయంలో నిందితుడు దారా సింగ్ అతడికి బుద్ధి చెప్పేందుకు చేసిన ప్రయత్నంలో జరిగిన హత్యగా దీన్ని అభివర్ణించింది. ఈ క్రమంలోనే దారాసింగ్ కు మరణ శిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్ధనను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. జీవిత కాల జైలుశిక్ష విధించింది.

కాగా సుప్రీం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. దీనిపై తథాకథిత ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాలు సృష్టించిన కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా సుప్రీం తన వ్యాఖలను తానే సమీక్షించింది. అది వేరే విషయం.

అసలు సుప్రీంకోర్టు అంతటి తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ముందుగా గ్రాహం స్టేయిన్స్ గురించి కూడా తెలుసుకోవాలి.

నేడు తబ్లిగ్ జమాత్ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇస్లామిక్ మతమార్పిళ్లే ఎజెండాగా ఉన్న సంస్థ ఢిల్లీ సమీపంలోని నిజాముద్దీన్ వద్దగల మర్కజ్ మసీదులో ఏర్పాటు చేసిన భారీ సమావేశాలకు విదేశాల నుండి వచ్చిన వేలాది ఇస్లామిక్ ప్రచారకుల కారణంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందటం చూస్తూనే ఉన్నాం. టూరిస్ట్ వీసాల మీద మతపరమైన కార్యకలాపాలలో పాల్గొని, భారతీయ వీసా నిబంధనలను ఉల్లంఘించిన విషయం ప్రముఖంగా చర్చకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ‘ఫారినర్స్ యాక్ట్ 1946’లోని నిబంధనలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. ఐటీ వీసా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి  భారతదేశంలో ఇది తాజా ఘటన కానే కాదు. అనేక దశాబ్దాలుగా విదేశీ క్రైస్తవ మతప్రచారకులు యథేచ్ఛగా వీసా ఉల్లంఘనలకు పాల్పడుతూ మతమార్పిళ్లు వంటి నేరాలు చేస్తూనే ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది గ్రాహం స్టెయిన్స్ గురించి.

గ్రాహం స్టెయిన్స్.. ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మతప్రచారకుడు. మతమార్పిళ్లే ధ్యేయంగా 1969లో భారతదేశంలోకి  అడుగుపెట్టిన స్టేయిన్స్, ఓడిశాలోని గిరిజన గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నాడు. సేవ ముసుగులో, కుష్టువ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం పేరిట అనేక మందిని క్రైస్తవ మతంలోకి మార్చివేసాడు. అనేక మంది గిరిజనుల్ని తమ సంస్కృతీ సాంప్రదాయాలకు దూరం చేశాడు. మతమార్పిడి చేయడానికి అనేక మార్గాలు ఎంచుకున్నాడు.

బలవంతంగా, ప్రలోభపెట్టి, “దేవుడి ఆగ్రహానికి గురవుతావ్” అని భయపెట్టి ఎంతోమందిని క్రైస్తవంలోకి మార్చివేసిన గ్రాహం స్టేయిన్స్ పట్ల స్వాభిమాన గిరిజనుల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. దురదృష్టవశాత్తు గ్రాహం స్టేయిన్స్ 1999లో ఇదే కారణంగా హత్య గావించబడ్డాడు.

అయితే ఒక విదేశీయుడు దాదాపు 4 దశాబ్దాల పాటు వీసా నిబంధనలు తుంగలో తొక్కుతూ, ‘ఒడిశా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 1967’ (మతమార్పిడి నిరోధక చట్టం 1967) చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా మతమార్పిళ్లకు పాల్పడుతున్నా ప్రభుత్వ సంస్థలు కనీసం స్పందించక పోవడం అత్యంత ఆశ్చర్యకరమైన అంశం.

గ్రాహం స్టెయిన్స్ యథేచ్ఛగా ఉల్లంఘించిన చట్టాలు ఏమిటి?:

వివిధ కార్యకలాపాల నిమిత్తం భారతదేశం వచ్చే విదేశీయులకు భారత ప్రభుత్వం మొత్తం 18 రకాల వీసాలు మంజూరు చేస్తుంది. అందులో టూరిస్ట్, మెడికల్, స్టూడెంట్, కాన్ఫరెన్స్, మిషనరీ, డిప్లొమాటిక్, ట్రాన్సిట్ వీసాలు ప్రముఖమైనవి. అయితే విదేశీయులు వీటిలో ఏ వీసా మీద వచ్చినప్పటికీ భారత దేశంలో మతప్రచారం, మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడం నిషేధం. దేశంలో మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి వీసాలు జారీ చేయదు.

మిషనరీ వీసా ఉన్న విదేశీయులు మాత్రమే మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే దీనిపై 2011లో కేంద్ర హోంశాఖ సమాచార హక్కు చట్టం కింద స్పష్టమైన వివరణ ఇచ్చింది.

“మిషనరీ వీసా అనేది మతపరమైన కార్యకలాపాల కోసం కాదు, మతప్రమేయం లేని సేవా కార్యకలాపాల కోసం మాత్రమే”. అంతే కాకుండా మిషనరీ వీసా ఉన్న విదేశీయులకు వర్తించే నిబంధనలు, మిషనరీ వీసా పరిమితులు కూడా స్పష్టంగా తమ సమాధానంలో పేర్కొంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

– మిషనరీ వీసా మీద భారతదేశం వచ్చిన విదేశీయులు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనరాదు.
– సేవ పేరిట మతమార్పిళ్లు చేయరాదు
– ఏజెన్సీ/గిరిజన ప్రాంతాలు, ప్రభుత్వం ప్రకటించిన రక్షిత ప్రదేశాలు (ప్రొటెక్టెడ్ జోన్స్), తీవ్రవాదం మరియు వామపక్ష అతివాదం అధికంగా ఉండే ప్రదేశాలు, జమ్మూ కాశ్మీర్ వంటి సమస్యాత్మక అంతర్జాతీయ సరిహద్దులతో పాటు మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో మిషనరీ వీసా కలిగివున్న విదేశీయులు పని చేయరాదు.

వీసా జారీకి చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్న విషయాలు కాకుండా మరేవైనా కార్యకలాపాలలో పాల్గొన్నా అది ‘ఫారినర్స్ యాక్ట్ 1947’లోని సెక్షన్ 14(బి) కింద వీసా ఉల్లంఘనగా పరిగణింపబడుతుంది. ఉదాహరణకు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన విదేశీయుడు కేవలం చదువు ముగించుకుని వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఉద్యోగం, వ్యాపారం వంటివి చేయరాదు. అంతేకాకుండా విదేశీయులు రాజకీయ కార్యకలాపాలు, ప్రచారాలలో కూడా పాల్గొనరాదు. ఇవన్నీ కూడా పైన పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 14(సి) ప్రకారం శిక్షార్హమైనవి.

వీటి ప్రకారం చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం స్టెయిన్స్ మతమార్పిడి నిరోధక చట్టం ఉన్న ఒడిశాలోని గిరిజన గ్రామాల్లో చేసిన మతమార్పిళ్లు ఎంత తీవ్రమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో అర్ధం చేసుకోవచ్చు. హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పనితీరులోని లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ కేసు మనకు తెలియజేస్తుంది.

Source: Organiser