— చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి
కర్నూలు జిల్లా ఆత్మకూర్‌లో పోలీసు స్టేషన్‌పై దాడి జరిగింది. ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ స్థాయిలో దాడి చేసేంత అన్యాయం ఏమి జరిగింది అనేది ఇక్కడ ముఖ్య విషయం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక అనుమతి లేని నిర్మాణాన్ని అడ్డుకోవడం.
సరే వాదోపవాదాలు జరపటం ప్రతీ గొడవలోనూ ఉంటాయి. అంత మాత్రాన చట్టాన్ని అమలు జరిపే రక్షక భటుల మీద మూక దాడి జరపటం ఏమిటి?
మనం భారత రాజ్యాంగం రాసుకున్నపుడు చట్ట పరంగా అన్ని జరుపుకోవాలి అన్న సమైక్యతతోనే రాసుకున్నాం. మరి ఈ వర్గాలు రాజ్యంగేతర శక్తులా? ఇంత ఉన్మాదంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి. ఈ ఉన్మాద వర్గాలపై ఒక నిర్ణయాత్మక చర్య తీసుకోవడం ఆలోచన గల సమాజానికి అవసరం.
ఇది ఏదో ఒక అనుకొని సంఘటన అని కొట్టిపారేయ్యటానికి లేదు.ఇలాంటి సంఘటనలు అనేకం. 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణంలో కొంత మంది ఇస్లాం మతోన్మాదులు పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. ఈ విషయంపై హైకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత వారిపై చర్య తీసుకోవడం జరిగింది.
2020లో బెంగుళూర్‌లోని కేజీ హళ్లీ పోలీసు స్టేషన్‌పై కూడా ముస్లింలు దాడి చేశారు.
ఇటీవల ఎంఐఎం నేత అసదుద్దిన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సన్నాహక సభలో పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. ఈ ముస్లిం వర్గాలు భారతీయరాజ్యాంగం పట్ల గౌరవం ఉందీ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పినా, సుస్పష్టం గా వారికి చట్టం అంటే గౌరవం లేదని తేటతెల్లం. మతం ముసుగు వేసుకొని నిరసనల పేరుతో ఉన్మాదంగా ప్రవర్తించడం, రాళ్లతో దాడి చెయ్యడం, ఆస్తులను తగలబెట్టడం, ప్రతీ చిన్న విషయాన్ని పేద్ద బూచీలా చూపటం, ఇతర మతాల పై దాడి చెయ్యడం. దొంగలను గుర్తించి పట్టుకోగానే కాళ్ళ బేరానికి రావడం. ఇది నిత్యకృత్యంగా నిత్య వ్యూహంగా ఈ ఉన్మాదులు అమలు పరుస్తున్నారు.
ఇలాంటి ఆరాచక వాదాన్ని సమర్థించడం ఎంతవరకు సమంజసం. ఈ మతోన్మాదానికి అంతెక్కడ. మూక బలంతో రాళ్లతో దాడి చేయడం. పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇవన్నీ ఈ ఉన్మాద వర్గాల ముద్రగా స్థిరపడిపోయినా ఈ కుహానా మేధావులు మాత్రం అదొక శాంతికపోతం అన్నట్టు కిమ్మనకుండా కూర్చోవడం చూస్తే వారికి సమాజం పట్ల అస్సలు బాధ్యత లేదు అని అర్థం అవుతోంది.
చేతనాత్మక సమాజం ఇటువంటి ఘటనలను అడ్డుకొని ఈ ముష్కర మూకల ప్రణాళికలను చిన్నాభిన్నం చేసి సంఘటిత సమాజ నిర్మాణం వైపు సాగాలి. లేని పక్షంలో మనకు మన పోరుగు దేశాలకు తేడా లేకుండా పోతుంది.
కొసమెరపు ఏమిటంటే ఈ ఆత్మకూరు ఘటన లో కూడా SDPI అనే సంస్థ కు సంబంధం ఉన్నదీ అని పోలీసు వారి కి కీలక ఆధారాలు దొరికాయి. ఈ SDPI సంస్థ దేశ వ్యాప్తంగా ఇలాంటి నేరపూరిత కార్యకలాపాలు జరుపుతున్న PFI అనే విద్రోహ సంస్థ కు అనుబంధ సంస్థ అనీ, ఆ SDPI సంస్థ నంద్యాల లో, వెలుగోడు అనే ప్రాంతాలలో ఈ అల్లర్లు సృష్టించే విషయం పై తర్ఫీదు కూడా పొందినట్లు పోలీసులు అనుమానపడుతున్నారు.
#SDPI Involvement in recent violence took place in Atmakur, Kurnool, AP.
"7 among the 9 persons who got arrested in connection with recent incident are SDPI members and they underwent SDPI Training recently" – District Superintendent of Police, Kurnool. pic.twitter.com/2SPxZGDuJ7
— Legal Rights Protection Forum (@lawinforce) January 11, 2022
ఇటీవల ఈ PFI కు టర్కీ లోని ఉగ్రవాద సంస్థ లతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర నిఘావర్గాలు పేర్కొన్నారు. భారతీయ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.!
(వ్యాసకర్త ప్రముఖ సినీ కళాకారులు, రచయిత)
Courtesy : NIJAM TODAY