Home Telugu Articles ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?

ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?

0
SHARE
Farmers sit on a road as they block a national highway during a protest against farm bills passed by the parliament, in Shambhu, Punjab, September 25, 2020. REUTERS/Adnan Abidi
* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు
* రైతులే పాల్గొనని ధర్నాలు
* కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు
భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు నూతన వ్యవసాయ చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఈ మూడు చట్టాలు భారతీయ వ్యవసాయ రంగాన్ని నిర్మాణాత్మకంగా మార్చడంలో మంచి ప్రభావాలు చూపుతాయి. ఈ చట్టాల పట్ల దేశంలో ని చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల సంక్షేమం కోసం ఆమోదించిన బిల్లులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలిగించే సమస్యలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధత,  అంకితభావంతో చేసిన ఈ ప్రయత్నానికి ప్రతిపక్షాలు వ్యతిరేకించడం గమనార్హం.
దీంతో దేశ వ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు నిరసనలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలతో రైతులు సంతోషంగా లేరని ఆయా పార్టీల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జలంధర్ లోని ఫిలార్ సమీపంలోని అమృత్ సర్ – ఢిల్లీ జాతీయ రహదారిలో రాస్తా రోకో చేపట్టారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం (ఎన్ ఎస్ యు ఐ) ఆధ్వర్యంలో అమృత సర్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎటువంటి రైతులు పాల్గొనక పోవడం విశేషం.
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా లో మమత బెనర్జీ  తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే మొదటి నుంచి టి ఎం సి  వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో గందరగోళం సృష్టించినందుకు గాను  టి ఎం సి రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్ ను సస్పెండ్ చేశారు.
మరోవైపు బీహార్ లో లాలూ ప్రసాద్ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.
కర్ణాటకలోని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జెడిఎస్, ఎస్ డి పి ఐ  వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏమిటంటే ఎస్ డి పి ఐ అనేది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ముస్లిం ఉగ్రవాద సంస్థకు సంబంధించిన రాజకీయ పార్టీ. ఇది దేశవ్యాప్తంగా ఇస్లామిస్ట్ భీభత్సాలను  వ్యాపిస్తోందని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎస్ డి పి ఐ, పి ఎఫ్ ఐ   ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి హింసకు పాల్పడటానికి అనేక అల్లర్లను సృష్టించారని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనా మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి విపక్ష పార్టీలు ఎప్పటి నుంచో అనేక కుట్రలు చేస్తున్నాయి. బిల్లు పట్ల ఎటువంటి అవగాహన లేకపోయినా రైతులను గందరగోళంలోకి పడేసి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల జే ఈ ఈ, నీట్ పరీక్షలను వాయిదా వెయ్యాలని ఎక్కడ లేని హంగామా ను సృష్టించాయి. మళ్లీ ఇప్పుడు రైతులకు మేలు చేసే చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడితే రైతులు పాల్గొనని  నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ముఖ్యంగా ఎస్ డి పి ఐ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చెందిన రాజకీయ పార్టీలు ఇటువంటి ధర్నాలు చేపట్టి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరో వైపు దేశంలో మోడీ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేని విపక్షాలు తీవ్ర అసహనంతో అనవసరపు నిరసనలు చేస్తున్నారు.
అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్న వివక్ష పార్టీల గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Source. : OPINDIA