Home News అమర్‌నాథ్‌ గుహ నిశ్శబ్ద ప్రాంతం అంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనిక్కి తీసుకున్న ఎన్‌జీటీ

అమర్‌నాథ్‌ గుహ నిశ్శబ్ద ప్రాంతం అంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనిక్కి తీసుకున్న ఎన్‌జీటీ

0
SHARE

అమర్‌నాథ్‌ గుహను నిశ్శబ్ద ప్రాంతంగా ప్రకటించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)పై విమర్శలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఎన్‌జీటీ ఛైర్మ‌న్‌ జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ నేతృత్వంలోనే ధర్మాసనం ఈ మేరకు గురువారం స్పష్టం చేసింది. మంచు శివలింగాన్ని దర్శించుకునే సమయంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలని పేర్కొంది. కేవలం భక్తులకు షరతులు మాత్రమే పెట్టినట్లు తెలిపింది. ఒకే వరసలో మాత్రమే భక్తులు వెళ్లాలని ఎన్‌జీటీ సూచించింది. హారతి ఇచ్చే సమయంలో, ఇతర పూజా కార్యక్రమాల సమయంలో నిశ్శబ్దంగా ఉండాలనే షరతు వర్తించదని ఎన్‌జీటీ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక రావాల్సి ఉంది.

జమ్ముకశ్మీర్‌లోని మంచుకొండల్లో ఉన్న ఈ గుహలో ఏటా జూన్‌, జులై, ఆగస్టు నెలలో సహజసిద్ధంగా ఏర్పడే మంచులింగాన్ని దర్శించడం కోసం ఐదారు లక్షల మంది భక్తులు వస్తుంటారు. గుహను సందర్శించినపుడు భక్తులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుంటారు. దీంతో అక్కడ శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని, ఏటా ఇన్ని లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుడటంతో సున్నిత ప్రాంతాలైన హిమాలయాల్లో పర్యావరణానికి హాని జరుగుతోందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. అమర్‌నాథ్‌ గుహలో మతరపరమైన అంశాలపై ఎన్‌జీటీ విధించిన నిషేధంపై విశ్వహిందూ పరిషత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎన్‌జీటీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది.

(ఈనాడు సౌజన్యం తో)