
కొన్ని విషయాలతో ఏకీభవించనంతమాత్రాన బౌద్ధం హైందవ నాగరకతలో భాగం కాకపోదు. బౌద్ధం హిందూ ధర్మంలో విడదీయలేని భాగమనే విషయాన్ని నిరూపించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ నేడు కొందరు పనిగట్టుకుని రెండు మతాల మధ్య ఉన్న తేడాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. హిందూమతాన్ని బలహీనపరచడానికి వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు. బౌద్ధానికి ఆధారం హైందవమే.