– సిరియా వెళ్లేందుకు సిద్ధమైన 9 మంది ; ఒకరు కరీంనగర్‌కు చెందిన యువకుడు
హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన జేకేహెచ్, జేకేబీహెచ్ మాడ్యూల్స్ గుట్టురట్టు కావడంతో ఐసిస్ చెన్నైపై కన్నేసింది. చెన్నై కేంద్రంగా యువతను ఆకర్షించి ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటుకు కుట్ర పన్నింది. ప్రాథమికంగా 9 మందితో ఏర్పడిన మాడ్యూ ల్‌లో రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన యువ కుడు ఉన్నాడు. భారత ఏజెన్సీలు గతేడాది అబుదాబి నుంచి డిపోర్టేషన్ ద్వారా తీసుకు వచ్చిన ముగ్గురి విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతో ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ గత నెల 26న తొమ్మిది మందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
అబుదాబి నుంచి మాడ్యూల్: హైదరాబాద్‌లో ఐసిస్ గతేడాది 2 మాడ్యూల్స్‌ను తయా రుచేసింది. ఎన్‌ఐఏ అధికారులు ఈ గుట్టు రట్టు చేయడంతో ఐసిస్ చెన్నై కేంద్రంగా మాడ్యూల్‌ను ఏర్పాటుచేసుకుంది. అబుదాబి లో ఉంటూ ఐసిస్ కోసం పనిచేస్తున్న షేక్ అజర్ అల్ ఇస్లాం అబ్దుల్ సత్తార్ షేక్, మహ్మద్ ఫర్హాన్ మహ్మద్ ఇర్ఫాన్ షేక్, అద్నాన్ హుస్సేన్ మహ్మద్ హుస్సేన్‌లు ఆన్‌లైన్ ద్వారా ఈ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఐసిస్‌పై ఆసక్తి ఉన్నవారిని గుర్తించడం, వీరిలో ఉన్మాద భావాలు ప్రేరేపించడం, విధ్వంసాలు సృష్టిం చడానికి తగు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆర్థిక వనరులూ సమకూర్చుకునే బాధ్యతల్ని ఈ మాడ్యుల్‌కు అప్పగించాలని ఈ త్రయం భావించింది. వీరిలో 8 మంది తమిళనాడుకు చెందిన వారు. వీరంతా 30 ఏళ్ల లోపు వయ స్కులే. వీరంతా సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు.
డిపోర్టేషన్‌లో భారత్‌కు: ఈ లోపే కేంద్ర నిఘా వర్గాలు వీరి ఆచూకీ, వ్యవహారాలను కనిపెట్టాయి. భారత్‌లో ఐసిస్ విస్తరణకు కుట్రపన్ని, ప్రయత్నాలు చేస్తున్న వారి వివ రాలు అబుదాబి అధికారులకు ఇచ్చారు. అక్క డి అధికారుల సాయంతో గత నెలలో వీరిని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పిపంపడం) ద్వారా భారత్‌కు తీసుకువచ్చారు.
(సాక్షి సౌజన్యంతో )