శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామీ పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు మంగళవారం నాడు హైకోర్టు తీర్పు వెలువరింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.
పరిపూర్ణానంద స్వామి మెదక్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో గతంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే కారణంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు గత నెల 11 నాడు నగర బహిష్కరణ ఉత్తర్వుల జారిచేశారు. ఈ ఉత్తర్వులును సవాలు చేస్తూ స్వామి జి హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు
నగర బహిష్కరణ కారణంగా నెల రోజులకు పైగా తెలంగాణకు దూరంగా వున్నారు స్వామి పరిపూర్ణానంద. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలు, వివిధ హిందూ సంస్తలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున వివిధ రూపాలలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.