VIDEO: దేశం కోసమే జీవించిన వీరసావర్కర్

వీరసావర్కర్, గాంధీల సాన్నిహిత్యంపైనా, సావర్కర్ వ్యక్తిత్వంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారికి సావర్కర్ క్షమాపణ లేఖపై సంతకం చేశారని కొందరు విమర్శలను గుప్పిస్తున్నారు. అయితే వీరసావర్కర్ పై వస్తున్న విమర్శలలో నిజానిజాలేంటన్నది తెలుసుకుందాం..  

చరిత్రకారుడు, పండితుడు, పాత్రికేయులు, ఉద్యమకారుడు – శ్రీ సురవరం ప్రతాపరెడ్డి

-ప్రదక్షిణ  అత్యుత్తమ తెలుగు పండితులు, రచయిత, చరిత్రకారులు, బహుముఖ ప్రజ్ఞావంతులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు     (1896-1953). నేటి తెలంగాణ ప్రాంతంలో, మహబూబనగర్ ఇటికలపాడు గ్రామంలో 28th మే 1896 తేదిన ఆయన జన్మించారు. వెల్లాల శంకరశాస్త్రి పండితుల వద్ద ఆయన సంస్కృత వ్యాకరణం, సాహిత్యం నేర్చుకున్నారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో FAచదువుకుని, మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో `బియే’ మరియు `న్యాయశాస్త్రం’లో పట్టభద్రులైయారు. కొంతకాలం మద్రాసులో వకీలుగా పనిచేసారు. మద్రాసులో ఉన్న సమయంలో బ్రిటిష్ పలకులకి వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయోద్యమంతో అత్యంత స్ఫూర్తి చెంది,...

సావర్కర్… సాంఘిక విప్లవ యోధుడు

వీర్ సావర్కర్ అసలు ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు. గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి. భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు చేసింది. విదేశీ వస్త్రాలను బహిరంగంగా మంటల్లో కాల్చేసిన జాతీయవాది. దేశ సమగ్ర అభివృద్ధికై, అంటరానితనం, కులతత్వం నిర్మూలనకై పాటుపడ్డ సాంఘిక విప్లవయోధుడు. దేశంలో బ్రిటిష్ న్యాయవ్యవస్థకి ఎటువంటి స్థానం లేదని ఎదిరించిన విప్లవకారుడు. 50సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయబడ్డ వ్యక్తి,...

అగ్నికణం వీర సావర్కర్‌

మే 28 సావర్కర్‌ జయంతి... – క్రాంతి దేవ్‌ మిత్ర వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు.. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్‌ బ్రిటిష్‌...

భవ్యంగా ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్

"భారత్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి విశ్వగురువుగా అవతరించడం ప్రపంచానికి కూడా అవసరం. ఈ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తోంది. నేడు ఉన్న సూపర్ పవర్ హోదాకు, విశ్వగురు భావనకు ఎంతో తేడా ఉంది. సూపర్ పవర్ స్థానంలో ఉన్న దేశాలు పాల్పడే వివక్ష, శోషణలకు విశ్వగురు భావనలో చోటులేదు’’ అని దక్షిణ మధ్య క్షేత్ర సహ ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ అన్నారు. ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్ (ముగింపు) కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు....

VIDEO: హిందూసమాజ రక్షణకై బజరంగ్ దళ్

అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కోసం పోరాటం ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్, 1984లో ''రామ్-జానకి రథయాత్ర'' అనే కార్యక్రమాన్ని అయోధ్య నుండి లక్నో వరకు చేపట్టింది. ఆ రథయాత్రకు రక్షణ కోసం, దేశ‌ వ్యాప్తంగా ఉన్న హిందు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్న యువతతో 1984 అక్టోబరు 8న బజరంగ్ దళ్ ఆవిర్భవించింది. అప్పటి నుండి హిందూ సమాజానికి రక్షణ కవచంగా నిలుస్తున్నది.

VIDEO: హైందవ వీరుడు మహారాణా ప్రతాప్

సుమారు క్రీ.శ 1540 మే 9న సూర్య వంశానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్. రాణి జవంతీ బాయి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు మహారాణాప్రతాప్. ఉదయ్ సింగ్ మరణానంతరం మేవాడ్ రాజ్యంలోని మంత్రులంతా కలిసి పరాక్రమవంతుడైన రాణా ప్రతాప్ సింగ్ ను రాజుగా ఎన్నుకున్నారు.

ప్ర‌తి యువ‌తి ఉత్త‌మ పౌరురాలు కావాలి – సునీలా సోవ‌నీ జీ

ప్ర‌తి యువ‌తి ఉత్త‌మ పౌరురాలు కావాల‌ని, స్వ‌శ‌క్తి, ఆత్మ‌నిర్భురాలు కావాల‌నేదే సేవికా స‌మితి ఆకాంక్ష అని రాష్ట్ర సేవికా స‌మితి అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌సార ప్ర‌ముఖ్ మాన‌నీయ సునీలా సోవ‌నీ గారు అన్నారు. రాష్ట్రసేవికా స‌మితి ప్ర‌వేశ శిక్షావ‌ర్గ స‌మారోప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సేవిక స‌మితి ప్ర‌వేశ శిక్షావ‌ర్గ బాలిక‌ల‌కు స్వ‌ర‌క్ష‌ణ, క్ష‌మ‌త‌తో పాటు స‌మాజ‌సేవ జాగ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌లో ప‌నిచేసే ప్ర‌శిక్ష‌ణ ఇస్తుంద‌న్నారు. ప్ర‌తి క్షేత్రంలో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఉండాల‌ని వారు వ్య‌వ‌స్థితంగా నిర్వ‌హ‌ణ‌ చేయాల‌నేది...

‘జ‌లికట్టు’ సాంస్కృతిక వారసత్వంలో భాగం – సుప్రీంకోర్టు

జలికట్టు, కంబళ, ఇతర ఎద్దుల బండి పందాల‌ను అనుమతించేందుకు తమిళనాడు, కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టానికి చేసిన రాష్ట్ర సవరణలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ల సమూహాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2014లో జల్లికట్టు లాంటి కార్యకలాపాలను సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సవరణలు చేశాయి. ఈ రాష్ట్ర సవరణలను "రంగు శాసనాలు"గా భావించలేమని అయితే ఏడవ షెడ్యూల్ లోని రాష్ట్ర జాబితాలో 17వ నియ‌మం ప్రకారం ఈ సవరణలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉందని రాజ్యాంగ...

VIDEO: మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం

భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని సాధించింది. ‌తర్వాత నుంచి మన ‌దేశాన్ని అణు దేశంగా ప్ర‌క‌టించ‌డ‌మేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్ర‌క‌టించి అధికారికంగా సంతకం చేశారు. ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్‌ క్షిపణులు, ఆపరేషన్లు కూడా విజయవంతంగా పరీక్షించబడ్డాయి. అప్పటి నుంచి భారత్ సాంకేతిక పురోగతికి గుర్తుగా ప్రతి సంవత్సరం...