–డా. శ్రీరంగ గోడ్బోలే
నాయకుల పాత్ర
నిజాంకు సంబంధించి ముగ్గురు ప్రముఖ నాయకుల పాత్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర వీర సావరక్కర్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ లే ఆ ముగ్గురు నాయకులు. గాంధీజీతో సైద్ధాంతిక బేధాభిప్రాయం కలిగి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరని, ఇస్లాంను సూక్ష్మంగా, మౌలికంగా అధ్యయనం చేసిన 21వ శతబ్ధానికి ఇరువురు హిందూ నాయకులుగా సావర్కర్ గారు, అంబేద్కర్ లను పేర్కొనడం సందర్భోచితం.
నిజాం విషయంలో గాంధీజీ పాత్ర
నిజాం విషయంలో మాత్రమేకాదు అన్ని సంస్థానాలోని ప్రజా ఉద్యమాల విషయంలోనూ గాంధీజీ పాత్ర మొట్టమొదట ఒక ప్రేక్షకుడిలాంటిది. 1925 జనవరి 8న భాగానగర్‌లో ఏర్పాటుచేసిన 3వ రాజనైతిక పరిషత్ అధ్యక్ష పదవి హోదాలో గాంధీజీ మాట్లాడుతూ … ” హిందుస్థాన్‌లోని సంస్థానాలకు సంబంధించిన ప్రశ్నల విషయంలో కాంగ్రెస్ సాధారణంగా కలుగజేసుకోరాదనే పద్ధతిని స్వీకరించింది. బ్రిటిష్ హిందుస్థాన్ ప్రజలు నేడు తమ స్వతంత్రం కోసం పారాడుతున్నారు. కాబట్టి హిందుస్థాన్‌లోని సంస్థానాలలో జరుగుతున్న సంఘటనలలో కలగచేసుకోవడం తమ అసహాయకతను చూపించడమే అవుతుంది” అని అన్నారు.(ది కలెక్టర్ వర్స్క్ ఆఫ్ మహాత్మాగాంధీ, భాగం 25, పబ్లికేషన్స్ డివిజన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 1967 పేజీ 551)
అయితే నిజాం విషయంలో గాంధీజీ పాత్ర ముందు ఆయన “దేశం”, “జాతీయత” అనే విషయంలో నిష్పలమైపోయింది. ఆయన దృష్టిలో నిజాం పరాయివాడు కాదు. 1940 అక్టోబర్ 13 నాటి హరిజన్‌లోని వ్యాసంలో విదేశీ క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వంతో పోల్చి నేను అరాజకత్వానికి ప్రాధాన్యత నివ్వాలా ? అలాగని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను అరాజకత్వాన్ని ఎత్తి చూపగలను, ఉదాహరణకు స్థానిక సర్ధారులు లేదా సరిహద్దులోని ముస్లిం సముహాన్ని, సమర్థించడానికి నిజాం సంస్థానం సిద్ధంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం అది (ప్రభుత్వం) నూటికి నూరు శాతం దేశీయమవుతుంది. స్వరాజ్యంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నా సరే అది దేశీయ ప్రభుత్వమే అవుతుంది” అన్నారు. గాంధీజీ (కలెక్టర్ వర్క్స్ భాగం 73, 1938, పుట 89)
ఆంగ్లేయుల నుంచి పూర్తి అధికారాన్ని ముస్లిం ప్రజలకు లేదా ముస్లింలీగ్ కు అప్పగించడంలో గాంధీజీకి ఎలాంటి సంకోచమూ లేదు. ముస్లిం లీగ్ ద్వారా స్థాపించబడిని ప్రభుత్వానికి కాంగ్రెస్ తన సమర్థతను అందిస్తుంది. అంతేకాదు అందులో పాలు పంచుకుంఉటంది కూడా అనే హామీని గాంధీజీ ఇచ్చారు. ( పట్టాబి సీతారామయ్య, ది హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్, భాగం 2 , ఎస్.చాంద్ అండ్ కంపెనీ, న్యూఢిల్లీ 1969 పుటలు 349 -350)
1938 డిసంబర్ 14-16 మధ్య గాంధీజీ కనుసన్నల్లో కాంగ్రెస్ కార్యకారిణి సమావేశం వార్ధాలో జరిగింది. అందులో కాంగ్రెస్ తన రాజ్యాంగపు అయిదు(అ) అధికరణం ప్రకారం జాతీయతకు సంబంధించి తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. అందులో జాతీయ సంస్థను వర్ణిస్తూ, ఏ సంస్థ ఉద్యమమైనా జాతీయ, కాంగ్రెస్ తో అసంబద్ధమైనదే స్వదేశీయవుతుంది. దాని ఆధారంగా హిందూ మహాసభ, ముస్లిలీగ్‌లను స్వదేశీయం అని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో మౌలానా ఆజాద్, హైదరాబాద్ రాజ్పు దివాన్ సర్ అక్బర్ హైదరి ల మధ్య హైదరాబాదు విషయమై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ద్వారా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆపేయాలని నిర్ణయం జరిగింది. స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ఆర్యన్ డిఫెన్స్ లీగ్ హిందూ నాగరిక్ సంఘ్ వగైరా జాతీయ సంస్థల ఉద్యమంతో కలిసిపోయే కాసింత అవకాశం ఉన్న ఆ ఉద్యమాన్ని ఆపేయాలని 1938 డిసంబర్ 22న గాంధీజీ పిలుపునిచ్చారు. (కేసరి, 1938 డిసెంబర్ 23)
1938 డిసెంబర్ 26న హైదరాబాదు దివాన్ సర్ అక్బర్ హైదరికి రాసిన ఉత్తరంలో “హైదరాబాద్ సంఘటనల పట్ల మిమ్మల్ని విసిగించడంలో నేను మనస్ఫూర్తిగా సాకులు చెప్పాను. అయితే హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ నిర్ణయంలో నాది ప్రధానమైన పాత్ర ఉన్నందున మీకు రాయాలనిపించింది. ఈ ఆపుదల వెనుక గల ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారని, దానికి సరైన ఉదా. ప్రతిస్ఫందన తెలపుతారని ఆశగా ఉంది” అని గాంధీజీ అన్నారు. (కలెక్టర్ వర్క్స్ భాగం 68, 1977 పేజీ 248)
స్టేట్ కాంగ్రెస్ కు 17వ సర్వాధికారి కాశీనాథరావు వైద్యను నిజాంకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన కారణంగా 1938 డిసెంబర్ 23న బంధించారు. అంతకముందు ఇచ్చిన తమ ఉపన్యాసంలో స్టేట్ కాంగ్రెస్ ద్వారా సత్యాగ్రహం బంధనానికి గురైందని ప్రకటించారు. 1938 నవంబర్‌లో వార్ధాలో స్టేట్ కాంగ్రెస్, కాంగ్రెస్ అగ్రనాయకులు మధ్య చర్చలు జరిగాయి. దానిముందు వంగిపోవడమన్నది హైదరాబాద్ రాజ్యపు అధికారులతో ఏడు గంటలపాటు చర్చించడంలోనే ఉన్నది. రాజ్యానికి బయటి ప్రజలు సత్యాగ్రహంలో పాల్గొనరాదనే ఆశయంతో వార్ధా నుంచి ప్రకటన వెలువడింది. దాని ఉద్దేశమంతా నిజాంను సంతృప్తి పరచడం మాత్రమే (కేసరి 1938 డిసెంబర్ 27) అధికారం ముస్లిం చేతిలో ఉందా లేక హిందువు చేతిలో ఉందా అనే దానిపై గాంధీజీ విధానం నిర్ణయమయ్యేది. 25 ఏప్రిల్ 1938న మైసూర్ రాజ్యంలోని కోలార్ జిల్లా విదురాశ్వర్థ గ్రామంలో ఏకత్రితం కారాదనే నిషేధాజ్ఞలను ఎదుర్కోవడానికి (ఉల్లంఘించడానికి) 10,000 మంది రాగా, వారిపై కాల్పులు జరిగాయి. అందులో 32 మంది చనిపోగా 48మంది గాయాల పాలయ్యారు. మైసూర్ ప్రజలలో చైతన్యం రగులుతోందనే లక్షణం గుర్తించి మైసూరు ప్రభుత్వం ఏకపక్ష వ్యాపారాన్ని ఆపేయాలని సమాచార పత్రాల ద్వారా గాంధీజీ అభ్యర్థించారు. పరిస్థితిని చూడడం అర్థం చేసుకోవడం, మైసూరు ప్రభుత్వం, మైసూరు కాంగ్రెస్ మధ్య సంధి చేకూర్చడానికి గాంధీజీ జాతీయ కాంగ్రెస్ కార్యకారిణి లోని ఇద్దరు సభ్యులైన సర్ధార్ పటేల్, ఆచార్య జె.బి. కృపలానీలను వెంటనే మైసూరుకు పంపించాడు. గాంధీజీ మాటలన్నింటినీ మైసూరు ప్రభుత్వం వెంటనే ఆమోదించింది అని చెప్పవచ్చు. (పట్టాభి సతీతారామయ్య పుట 98) అయితే అదే మహోన్నత నిజాం సాహెబ్‌తో గాంధీజీ పాత్ర ఎకాఎకి వేర్వేరుగా ఉంది.
హిందువుల్లో భేదభావం కలిగించే విధానం
స్టేట్ కాంగ్రెస్‌ను తమ అదుపులోకి తెచ్చుకున్నాక కాంగ్రెస్ పెద్దలు ఆర్య సమాజం మీద ఒత్తిడి తీసుకు రావడం ప్రారంభించారు. ఆర్య సమాజం పోరాడం నుంచి వైదొలగగానే హిందూ మహాసభ ఏకాకిగా మారి కష్టాలలో పడుతుందనేది కాంగ్రెస్ పెద్దల ఆట అయింది. ఇవన్నీ గాంధీజీ అనుమతిలేకుండా జరిగాయని చెప్పడం కష్టం. జమునాలాల్ బజాజ్ కుడి భుజంగా భావించే దామోదరదాసు ది ఇందులో ప్రధాన పాత్రగా ఉంది. 12 నవంబర్ 1938న సర్ అక్బర్ హైదరి ముంబైకి వెళ్లి జమునాలాల్ బజాజ్‌తో కలిశాడు. (కేసరి 18, నవంబర్ 1938). దామోదర దాసు ను స్టేట్ కాంగ్రెస్ కార్యకారిణిలో చేర్చారు. ఆయన కాంగ్రెస్ పెద్దలకు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులకు మధ్య వారధిగా మారారు.
స్టేట్ కాంగ్రెస్ ఆలోచనలు కలిగి హైదరాబాదు రాజ్య విషయాల పట్ల సమర్పితమైన “సంజీవని” పేరుతో పుణె నుంచి ఒక వార్త పత్రిక వెలువడేది. అందులో 1939 మార్చి 6న దామోదరదాసు “వార్ధా సమ్మేళనం” అనే శీర్షికతో రాసిన వ్యాసంలో “త్వరలోనే ఆర్య సమాజం ఉద్యమం ఆపి వేస్తుందని మేమే ఆశిస్తున్నాము స్టేట్ కాంగ్రెస్ ద్వారా సత్యాగ్రహం ఆపివేయడానికి ఏఏ విషయాలు కారణమో, అవే విషయాలు ఆర్య సమాజం సత్యాగ్రహం ఆపివేయడానికి కారణం అని ఆర్య సమాజ నాయకులు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కాంగ్రెస్ లాంటి ఏకైక జాతీయ సంస్థను వ్యతిరేకించే కేవలం మతోద్యమాన్ని సమర్థించే హిందూ సభ ఈ ఆర్యసమాజ ఉద్యమానికి తన సమర్థననిస్తోంది. ఆ సమర్థనను ఆర్య సమాజం వద్ధనడం లేదు, దాంతో కాంగ్రెస్ వాదులందరి మనసుల్లో ఆర్య సమాజం పట్ల సందేహం కలగడం స్వాభావికం. ఆర్య సమాజపు ఉద్యమంలోని శుద్ధ ధార్మికతను నిలిపి ఉంచడానికి ఒక సారి దాన్ని స్థగితం చేయడం అనివార్యం అని పంజాబుకు చెందిన ఆర్య సమాజ నాయకులు అర్థం చేసుకోవడంలో ఆలస్యమేమీ జరగదు. వాళ్లతో మేము జరిపిన సంభాషణ వల్ల ఈ విషయంపై త్వరితంగా ఆలోచించుతారని మేమందరూ ఆశిస్తున్నాము. ఆర్య సమాజ ఉద్యమంలో తన ఉద్యమాన్ని కలగలిపి తన బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న హిందూ సభకు ఆర్య సమాజ ఉద్యమం ఆగిపోతేనే గొప్పలు చేప్పుకోవడం తప్ప మరింకేమీ మిగలదు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మళ్లీ తనదైన జాతీయ ఉద్యమం ప్రారంభించే అవకాశం లభిస్తుందనే కోరిక మన మనస్సుల్లో సజీవంగా ఉంది. భవిష్యత్తు పోరాట కల్పనతో మేం వార్ధా చేరుకున్నాము.”
”ఆర్య సమాజం ఉద్యమం కాంగ్రెస్ ఉద్యమం ఆగిపోవాలనే కోరిక ఈ వ్యాస ప్రారంభంలోనే ప్రసావించాం. కాసింత సమయం తర్వాత ఇది అర్థమవుతుంది. ఈ రకమైన బాధ్యత మా తలకెత్తుకోవడానికి అవసరమైన మనోబలం, ఆర్య సమాజీయులలో లేదు. హిందూ సభతో సంబంధాన్ని తెలచుకునే ధైర్యమూ వారికి లేదు. అంటే ఇందులోని మరో అర్థం ఏమిటంటే హిందూ సభకు వ్యతిరేకంగా, ఆర్య సమాజానికి మరో అస్తిత్వమే లేదు. మా ఉద్యమం విశుద్ధమైన ధార్మికమైనదనే గొప్పలు చెప్పుకుంటూ ప్రజల కళ్లలో దుమ్ముకొట్టలేరు. మొత్తం మీద హైదరాబాదు రాజ్యంలో జరుగుతున్న ఉద్యమం పైపైకి ఆకర్షణీయంగా ప్రజల మనసులను చూరగొన్నట్టుగా కన్పదినా బృహన్మహరాష్ట్రలోని ఒక వివక్షతో కూడిన సమాజంగానే భావింపబడుతోంది. ఫలితంగా హైదరాబాదు ప్రజల కోసం లేదా సంపూర్ణ మహారాష్ట్ర కోసం ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదని మా స్పష్టమైన అభిప్రాయం. ఈ ఉద్యమంతో ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంతగా నిర్ధిష్టంగా ఉండి పోవాలన్నది మా సద్వివేకంతో కూడిన బుద్ధి స్పష్టం చేస్తోంది. కాబట్టి మా ఆలోచనలను మన ప్రజల ముందుచడం మా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాం” అని అన్నారు.
సేనాపతి బాపట్ లాంటి సాత్విక వ్యక్తి, దామోదర దాసు రాసిన ఈ వ్యాసానికి 17 మార్చి రోజున “త్రికాల్” పత్రికలో సరైన జవాబిచ్చారు. “నాకున్న సద్వివేక బుద్ధికి , దామోదరదాసు కున్న సద్వివేక బుద్ధి స్పష్టంగా దుర్భిద్ధిలాగా కనబడుతోంది.. పక్షాంధత్వం (పార్టీ అందత్వం) కారణంగా మానవత్వం నుంచి వేరుగా ఉంచడం అన్నది దిగజారుడుతనానికి పరాకాష్ఠ. హిందువుల కోరికలనే హిందూసభ అడగడంలో ఎలాంటి అన్యాయమూ లేదు. ఆర్య సమాజీయుల కోరికలలోనూ ఎలాంటి అన్యాయమూ లేదు. రెండింటి పట్ల అన్యాయం, అణిచివేత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోందనడంలో ఎలాంటి అబద్ధమూ లేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ వాళ్లు పక్షాందులై ఆర్య, హిందువులు లోతైన గుంతలో పడటాన్ని ఎదురుచూస్తూ వారి పతనం ఎలా జరుగుతుంది, మనం ఎప్పుడు జాతీయ ఉద్యమం ప్రారంభిస్తామా అని భావించడం రాక్షసత్వమవుతుంది. ఏ జాతీయవాదుల్లో మానవత్వం ఉండదో అలాంటి వారి జాతీయత శుభప్రదంగా మారడంతో బాటు హైదరాబాదు, సంపూర్ణ మహారాష్ట్రలో ఈ మానవత్వ రహిత జాతీయవాదుల దేశద్రోహ పక్షాంధత్వం వీలైనంత త్వరాగా ప్రజల కళ్లముందుకు రావాలని, వారిని నిరసించాలని భావిస్తున్నాను అని బాపట్ గారు రాశారు. ( కేసరి, 1939, మార్చి 21)
నిజాం విషయంలో స్వాతంత్య్రవీర్ సావర్కర్ పాత్ర
నిజాంకు వ్యతిరేకంగా సాగిన నిరాయుధ పోరాటంలో హిందూ మహాసభ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ పాత్ర దార్శనికుడిగా, పరామర్శకుడిగా, సేనాపతిగా ఉండింది. సేనాపతి బాపట్ పూర్తిస్థాయిలో సత్యాగ్రహాన్ని ప్రకటించినపుడు ఆయనను సమర్థించిన వారిలో సావర్కర్ ప్రథముడు. నిరాయుధ పోరాట స్వభావం నిర్ణయించి దాని ప్రణాళిక సిద్ధం చేయడం, ఆర్య సమాజంతో సమన్వయం సాధించడం, వీర యశ్వంతరావు జోషి లాంటి హైదరాబాదు రాజ్యానికి చెందిన కార్యకర్తలకు ప్రేరణనివ్వడం, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ప్రయత్నాలను చావుదెబ్బతీయడం లాంటివన్నీ ఏక కాలంలో నిర్వహించడం లాంటి పనులు వీర సావర్కర్ చేసేవారు. నిరాయుధ పోరాటం నిమిత్తం సావర్కర్ ద్వారా సమయానుకూల, విజయశీలి అయిన సైద్ధాంతిక వివేకం క్రింది విధంగా ఉండింది.
ఈ పోరాటం హిందుత్వం మీద ఎందుకు ఆధారపడింది అనేదాన్ని సావర్కర్ ప్రతిపాదించాడు. 1938 నవంబర్ 1న దీని కొరకు పరేట్ (ముంబై)లో పరేట్ శివాజీ వ్యాయామ మందిరంలో తీవ్ర జ్వరంతో బాధపడుతూనే ఒక గంటసేపు ఉపన్యసించాడు. “పౌర అధికారుల మీద గ్రహణం ఏర్పడిందని, దాని కొరకు స్టేట్ కాంగ్రెస్ ద్వారా పోరాటం జరగాలని కొంతమంది చెబుతున్నది పూర్తిగా అసత్యం. భాగానగర్‌లో ముస్లింల పౌర హక్కులు సంరక్షించబడుతున్నాయి. అంతేకాదు వారికి ఇతరుల హక్కులను లాక్కోవడానికి, భంగం కల్గించడానికి ప్రోత్సాహం లభిస్తోంది. భాగానగర్‌లో 85శాతం హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్నా, కనీసం పదిశాతం కూడా నిజాం ప్రభుత్వం ఏ విభాగంలోనూ వారికి అవకాశాలు లభించడం లేదు. ఈ ప్రకారంగా హిందువులకు హిందువు అయి కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ కూలీ విసిరేయబడుతోంది. వాస్తవంగా పరిస్థితి ఇలా ఉంటే ఈ సత్యాగ్రహంలో ముస్లింలు ఎప్పటికీ భాగస్వాములు కాలేరు. (కేసరి, 8 నవంబర్ 1938)
ఆర్య సమాజం మీద జాతీయత ముద్రవేసి దానిని అపకీర్తి పాలు చేసి, హిందూ మహాసభ నుంచి దూరం చేసే కాంగ్రెస్ ఉద్దేశ్యం గురించి స్వాతంత్య్ర వీర సావర్కర్ కు సరైన సమాచారం ఉంది. 1938 డిసెంబర్ 25న షోలాపూర్‌లో జరిగిన అ.భా.పరిషత్ సమావేశంలో సావర్కర్ “హిందువుల ప్రతి ఒక్క ఉద్యమం మీద జాతీయత ముడివేయడుతోంది. ఇది తప్పు. సంస్కృతి లేదా భాషను సంరక్షించడంలో ఏ జాతీయత లేదు. ఈ దేశం, తన రాళ్లు మట్టి కారణంగా మనకు ప్రియమైనది కాదు, ఈ దేశం హిందూ రాష్ట్రం అయినందువల్ల, మనకు ప్రియమైనది. మహర్షి దయానందులు నిజమైన జాతీయతకు జన్మనిచ్చారు. జాతీయత అనే పదంతో మీరు మూతి ముడుచుకోవడం లేదు. హిందువు ద్వారా హిందుత్వం హిందువు అయిన కారణంగా సంరక్షణ అన్నది ఏ మాత్రం జాతీయత కాదు. జాతీయత పేరుమీద మరొక మతం మీద దాడి చేయడం ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎవరూ సమర్థించరు. అయితే హిందుత్వం మీద జరిగే దాడి నుంచి కాపాడటంలో ఎలాంటి జాతీయత లేదు కానీ అదే సరైన నిజమైన జాతీయత (దేశీయత). దేశీయత, జాతీయత అనే రెండు పదాలు లేదా వాటి ప్రవృత్తి మన మన ఆలోచన మేరకు మంచిది లేదా చెడువి కూడా. జాతీయత పేరుమీద ఇతరుకలకు కష్టం కలిగించడం సరైంది కాదు. అయితే దేశీయత పేరుమీద ఇతరకులకు అపరాధాన్ని సహించడం కూడా సరైంది కాదు. సరైన దేశాభిమానాన్ని మనం తప్పనిసరిగా కలిగి ఉందాం.. అల్ప సంఖ్యాకుల స్థితి ఎలా ఉంటుందో, జర్మనీకి వెళ్లి చూద్దాం. అయితే మనం జర్మన్‌లా ఉండు.. ఎవరైనా మిమ్మల్ని మతవాది అని పిలిస్తే దైన్యస్థితికి వెళ్లడానికి బదులు జాతీయత (మతభిమానం) దేశాభిమానంతో వివేకపూరితంగా మతాభిమాని కావడంలో గర్వంగా భావించండి. ( కేసరి 30 డిసంబర్ 1938)
నిజాం లేదా జిన్నా పరిపాలన ను స్వదేశీ అని భావించే గాంధీజీ భ్రాంతిని సావర్కర్ అపహేళనకు యోగ్యమైనద అంటూ పదాల వలలో మనిషి ఎలా చిక్కుకుంటాడనే దానికి ఉత్తమ ఉదాహరణ గాంధీజీ మాటలలో దొరుకుతుంది. ఆయన ఇలా అంటారు. ” నేను జిన్నా రాజ్యంలో సుఖంగా ఉండగలను ఎందుకంటే అధికారం ఆయనదే అయినా ఇది హింది రాజ్యమే (ఇక్కడ హింది అనే దానికి అర్థం భారతీయ అని రచయిత ఉద్దేశం). ఇక్కడ పరిపాలించిన ఔరంగజేబు కూడా హింది అయినపుడు ఆయనకు వ్యతిరేకంగా శివాజీ మహారాజు ఎందుకు నిలబడ్డాడు.? హిందుస్థాన్‌లో నివసించేవారంతా హిందువులైతే ఇక్కడ ఉండే పాము, తేలు, పులి కూడ హింది కావాలి. మని మనం వాటిని అలా గుర్తిస్తామా? (సమగ్ర సావర్కర్ వాజ్ఞయం, సంపాదకుడు శం.రా.దాతే, మహారాష్ట్ర ప్రాంతీయ హిందూసభ, పుణె, భాగం 4 పుట 493)
నిజాం విషయంలో అంబేద్కర్ పాత్ర
నిజాం వ్యతిరేక నిరాయుధ ఉద్యమ సమయంలో డా. అంబేద్కర్ వ్యాఖ్యలేవీ లభించడం లేదు. అయితే హిందు, ముస్లిం రాజ్యాల విషయంలో ముస్లిం నాయకుల పాత్ర ముస్లింల హితం కోసమే దోహదపడుతోందనే విషయంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అంటే 1947 ఓ నిజాం విషయంలో ఆయన సందిగ్ధత ఏ మాత్రంలేని విస్తృత వివరణ ఇచ్చారు.
భారతీయ రాజ్యాలలో రాజనైతిక ఎంతటి వికృతంగా మారిపోయింది అనేది అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఆయన రాస్తూ “ముస్లిం, వాళ్ల నాయకులు కాశ్మీర్‌లోని హిందూ రాజ్యంలో ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని స్థాపించడానికి తీవ్రమైన ఉద్యమం నిర్వహించారు. అదే ముస్లింలు, అదే నాయకులు ఇతర ముస్లిం రాజ్యాలలో ప్రాతినిధ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విచిత్రమైన పద్ధతికి కారణం చాలా లక్ష్యం ఉంది. ప్రతి విషయంలో ముస్లింల కోసం నిర్ణాయక ప్రశ్న ఏమిటంటే హిందువులతో పోల్చుకుంటే ముస్లింల మీద ఏమి ప్రభావం చూపుతుందనేదే. ఒక వేళ ప్రాతినిధ్య ప్రభుత్వంతో ముస్లింలకు సహాయం లభించేట్లయితే వాళ్లు దాని కావాలని కోరుకుంటారు. దాని కొరకు పోరాటం కూడా చేస్తారు. కాశ్మీర్ రాజ్యంలో రాజు హిందువు అయితే పాలితులలో అధిక సంఖ్యాకులు ముస్లింలు.
ముస్లింలు కాశ్మీర్‌లో ప్రాతినిధ్య ప్రభుత్వం కొరకు పోరాటం ఎందుకు చేశారంటే కాశ్మీర్ ప్రాతినిధ్య ప్రభుత్వం అంటే అర్థం హిందూ రాజ్యం నుంచి ముస్లిం ప్రజలకు అధికార మార్పిడే. ఇతర ముస్లిం రాజ్యాలలో పాలకులు ముస్లిం కాగా అధిక సంఖ్యాక పాలితులు హిందువులు. ఇలాంటి రాజ్యాలలో ప్రాతనిధ్య ప్రభుత్వం అంటే అర్థం ముస్లిం పాలకుడి నుంచి హిందూ ప్రజలకు అధికార మార్పిడి. ఈ కారణంగా ముస్లింలు ఒక సందర్భంలో ప్రాతినిధ్య ప్రభుత్వ వ్యవస్థను సమర్థిస్తారు. మరో సందర్భంలో వ్యతిరేకిస్తారు. ముస్లింల ఆలోచన లో ప్రజాస్వామ్యం ప్రాముఖ్యం లేనిది. వారి ఆలోచనను ప్రభావితం చేసే తత్త్వం ఏమిటంటే ప్రజాస్వామ్యం అన్నది ప్రముఖమైనది కాదు. వారి ఆలోచనను ప్రభావితం చేసే తత్త్వం ఏమిటంటే ప్రజాస్వామ్యం అంటే ఎక్కువ మంది కోరుకునే ప్రభుత్వం. హిందువులకు వ్యతిరేకంగా పోరాటంలో ముస్లింలపై ప్రభావం చూపేదేమిటి. దాంతో వాళ్లు బలవంతులవుతారా లేక బలహీనులవుతారా ఒక వేళ ప్రజాస్వామ్యంతో వారు బలహీనపడేట్లయితే వారికి ప్రజాస్వామ్యం అక్కర్లేదు. వాళ్లు ఏ ముస్లిం రాజ్యంలోనైనా హిందువులపై ముస్లిం పాలకుడు తప్పులెన్నటం, బలహీనం చేయడం జరిగితే తమ పనికిరాని రాజ్యానికి ప్రాధాన్యతనిస్తారు. (బాబాసాహెబ్ అంబేద్కర్ సంపూర్ణ వాజ్ఞయం భాగం 15, పాకిస్తాన్ యా భారత్ కా విభజన్ డా. అంబేద్కర్ ప్రతిష్ఠాన్, న్యూఢిల్లీ, 2013, పుట 230)
1947 నవంబర్ 27న దేశ న్యాయశాఖ మంత్రి పదవి ద్వారా జారీ చేయబడిన స్వీయ ప్రకటనలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ తన అనుయాయులతో పాకిస్తాన్, హైదరాబాదు నుంచి పారిపోయి భారత్‌కు వచ్చిన వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికించారు. ఆయన తన ప్రకటనలో హైదరాబాదు రాజ్యంలో కూడా ముస్లిం జనాభా పెంచే దృష్టితో వారిని (అనుసూచిత జాతి ప్రజలకు ) బలవంతంగా మతమార్పిడి చేస్తారు. అంతేకగాక హైదరాబాదులో ఇత్తెహాద్ – ఉల్ – ముస్లిమీన్ ద్వారా అస్పృశ్యుల ఇళ్లకు నిప్పంటించే ప్రయత్నమూ జరుగుతోంది. తద్వారా వారి మనసుల్లో భయం కలిగేలా చేయడం, వాళ్లు హైదరాబాదులో ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్మించడంలోను, హైదరాబాదును భారతీయ యూనియన్‌లో కలిసిపోయేలా చేసే ఉద్యమంలో పాల్గొనకుండా చేయడం జరిగింది.
ముస్లిం, స్నేహితుడు కాదు అని దీన్ని స్పష్టం చేస్తూ డా. బాబాసాహెబ్, పాకిస్తాన్ లేదా హైదరాబాదులోని అనుసూచిత కులాలు ముస్లింలు లేదా ముస్లింలీగ్‌పై విశ్వాసం ఉంచడం ప్రమాదకరమవుతుంది. ముస్లిం హిందువుల మీద కోపాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి వారిని స్నేహితులు అని భావించే పరిస్థితి అనుసూచి కులాల్లో ఉంది. ఈ దృష్టి కోణం తప్పు ముస్లింలకు అనుసూచిత కులాల సమర్థన అవసరం. అందువల్ల వాళ్లు అనుసూచిత కులాలకు తమ సమర్థనను ఎప్పటికీ ఇవ్వలేదు. మతమార్పిడి గురించి చెప్పాలంటే వాళ్లు అనుసూచిత కులాలపై అంతిమ వైరుధ్యంగా మనల్ని మోస్తున్నారని అర్థం చేసుకోవాలి. అయినా బలం లేదా హింస ద్వారా మతమార్పిడి జరిగితే, వారికి నేను చెప్పేదేమంటే వాళ్లు తమ పాత స్థితిని కోల్పోయారని ఏమాత్రం అర్థం చేసుకోలేదని భావించాలి. నేను వారికి శపథం ద్వారా వాగ్ధానం చేస్తున్నదేమిటంటే, వారు ఒక వేళ తిరిగి వెనక్కు రావాలనే కోరిక ఉంటే, వారిని వారి పాత స్థానంలోకి మళ్లీ స్వీకరించడం జరుగుతుంది. మతమార్పిడి కి ముందు వాళ్లతో ఎలాంటి బంధుత్వ భావనతో వ్యవహరించడం జరిగిందో అదే వ్యవహారం వారికి లభించేలా నేను చూడగలను.
నిజాంను భారతదేశపు శత్రువు అని ప్రకటిస్తూ బాబాసాహెబ్ హైదరాబాదులోని అనుసూచిత కులాల ప్రజలు ఎలాంటి పరిస్థితిలోనూ నిజాం లేదా ఇత్తెహాద్ – ఉల్ ముస్లిమీన్ అను సమర్థించరాదు. వారి వెంట నడవరాదు. హిందువులు మనమీద ఎన్ని, అన్యాయాలు, అత్యచారాలు చేసినా మనలను అణచివేసినా మనం మన దృష్టికోణాన్ని మార్చుకోరాదు లేదా మనం మన (భారతీయత్వం) కర్తవ్యం నుంచి ముఖం తిప్పుకోరాదు. భారత్ ఏకాత్మతను అంగీకరించని కారణంగా నిజాం, సానుభూతికి అర్హుడు కాదు. అతడు అలా చెప్పి స్వీయహితంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. భారత్‌లోని 90 శాతం హిందువుల అంగీకారం పొంది యూనియన్ రాజ్యంగా ఓదార్పు పొందుతున్నారు. అయితే ఇత్తెహాద్ – ఉల్ – ముస్లిమీన్ మీద ఆధారపడకపోతే నిజాం పితృత్వం అధికారం మరింత సురక్షితంగా ఉంటుందనే అవగాహన లేకపోయింది. అనుసూచిత కులాలకు చెందిన ఏ వ్యక్తి కూడా భారత్ శతృపక్షం వహించి తన సముదాయానికి కళంకం తీసుకురానందుకు నాకు ఆనందంగా ఉంది. (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సమగ్ర ఉపన్యాసం భాగం 7 మరాఠీ, సంపాదకుడు ప్రదీప్ గైక్వాడ్ ప్రకాశకులు సరితా గైక్వాడ్, నాగపూర్, 2007 పుటలు 15, 16)
నాయకులకు గుడ్డిగా దైవత్వాన్ని అంటగట్టకుండా దేశకాల పరిస్థితులను ధ్యాసలో ఉంచుకుని వారి ఆలోచనలను, వారి చేతలను విశ్లేషించే సమాజం పరిపక్వత చెందిందని అర్థమవుతుంది. తన గొప్ప నాయకుల ఆలోచనను పరిశీలన చేసిన ఎవరు మనవారు, ఎవరు పరాయివారు, ఏ విషయం మతానికి సంబంధించింది, ఏది జాతీయ అనే నిర్ణయాలు పాఠకులే చేయాలి.
Read Also : హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: మొదటి భాగం