Home Hyderabad Mukti Sangram హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – నాలుగవ భాగం

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – నాలుగవ భాగం

0
SHARE

– డా. శ్రీరంగ్ గోడ్బోలే

పోరాటం, బలిదానం

హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ పోరాట ఉద్యమం హిందూ మహాసభ, ఆర్యసమాజ్, స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది.  ఇది పోరాటం, బలిదానాల గాథగా నిలిచింది. నిజాం ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. కేంద్ర కాంగ్రెస్ హైదరాబాద్ రాష్ట్రంలోని పీడిత హిందువులకు ద్రోహం చేసి  రాష్ట్ర కాంగ్రెస్ ను అభాసు పాలు చేసింది.

ఉద్యమ స్వభావం

హిందూ మహాసభ నిరాయుధ పోరాట ఉద్యమం 1938 అక్టోబర్  చివరలో ప్రారంభమైంది. మార్చి 1939

ముంబై-మహారాష్ట్ర నుండి 200 మంది, బేరార్-నాగ్‌పూర్ నుండి 200 మంది మొత్తం దాదాపు 400 మంది నిరాయుధ సత్యాగ్రహులు నిజాం సంస్థానానికి వచ్చారు. 1938 నవంబర్ 17న నాగ్‌పూర్ నుండి సత్యాగ్రహుల బృందం బయలుదేరింది. ఈ ఉద్యమం కోసం, మహారాష్ట్రేతర రాష్ట్రాల  నుండి మాత్రమే నిధులు పంపాలని హిందూ మహాసభ నిర్ణయించింది. ఖర్చును నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1939 నాటికి సత్యాగ్రహులందరూ చిన్న చిన్న గుంపులుగా వెళ్లారు. నాగ్‌పూర్‌లోని సమూహాలలో 25 – 25 మంది  ఉంటే దక్షిణ మహారాష్ట్ర గుంపులో ఎనిమిది- పది మంది ఉన్నారు.  పెద్ద సమూహాలను పంపడంలో ఒక సమస్య ఏమిటంటే, సత్యాగ్రహులందరూ స్టేషన్‌లోనే పట్టుబడేవారు. హిందూ మహాసభలోని చాలా మంది సత్యాగ్రహులు నిజాం రాష్ట్రంలోకి ప్రవేశించి, సమావేశాలు నిర్వహించి, నినాదాలు చేస్తూ, కరపత్రాలు పంచి ప్రతిఘటన చేశారు. ఫలితాలు, అవగాహనపరంగా చిన్న సమూహాలు మరింత ప్రభావవంతంగా కనిపించాయి. పైగా అది సముచితంగా ఉంది. ఈ విధానాన్ని ప్రారంభంలో అమలు పరిచారు.

హిందూ మహాసభ  ఉద్యమం నవంబర్ 1938 నుండి మూడు నెలల పాటు కొనసాగింది. ఫిబ్రవరి 1939లో ఆర్యసమాజ్ కూడా మెరుపు వేగంతో ఈ ఉద్యమంలో దూకి ఉద్యమానికి విస్తృత రూపునిచ్చింది.  ముంబై, కరాచీ, లాహోర్, రావల్పిండి, న్యూఢిల్లీ, డెహ్రాడూన్, ఫతేపూర్, బరేలీ మొదలైన నగరాల నుండి ఆర్యసమాజ్ సత్యాగ్రహులు వచ్చారు (కేసరి, 18నవంబర్,1938).

 1939 ఫిబ్రవరి మొదటి వారంలో ఆర్యసమాజ్ మొదటి నాయకుడు పండిత్ నారాయణ స్వామి 20 మందిని నిరాయుధ సత్యాగ్రహులతో కలిసి గుల్బర్గా వెళ్లి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆర్య సమాజ్ రెండవ ప్రధాననాయకుడు చంద్ కరణ్ శారదా (అజ్మీర్) పూణేకు వచ్చినప్పుడు, హిందూ మహాసభ కార్యకర్తలకు `ఇప్పుడు ఆర్యసమాజ్  పెద్ద సమూహాల వలెనే హిందూ మహాసభ సమూహాలు కూడా బయలుదేరాలి, దీనివల్ల ఉమ్మడి ఫలితాలు పొందవచ్చు’ అని సూచించాడు. ఇతర ఆర్యసమాజ్ కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని సూచించారు.  పెద్ద సమూహాలలో నెలకొన్న అంతర్గత అవగాహన లోపాన్ని సవరించడం కోసం మార్చి 1939 సత్యాగ్రహులు యాభై యాభై మంది కలిసి బయలుదేరెందుకు కొత్త యోజన సిద్ధమయింది. మహారాష్ట్ర సత్యాగ్రహులందరినీ చిన్న సమూహాలుగా అన్ని కేంద్రాలకు పంపే బదులు పూణేకే పంపాలని అనుకున్నారు. (కేసరి, 4 మార్చి 1939).

నిరాయుధ పోరాట ఉద్యమానికి హిందువులలోని వివిధ కుల-వర్గాల మద్దతు లభించింది. విదేశాల్లో నివసిస్తున్న హిందువులు కూడా తమకు తోచిన విధంగా సహకరించారు. నాగపూర్ హిందూ మహాసభ నిరాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చిన వెంటనే  సత్యాగ్రహ మొదటి సమూహంలో చేరడానికి అనుమతించాలని నాగపూర్ కు చెందిన ఒక హారిజన జాతి యువకుడైన శంకర్ జంగ్లాజీ ఖడ్సే , వీర్ సావర్కర్ కు లేఖ వ్రాశాడు (కేసరి, 6 జనవరి 1939).  1939 ఫిబ్రవరి 26న జోషి మఠానికి చెందిన శంకరాచార్య ఈ ఉద్యమ ప్రచారాన్ని ప్రారంభించారు. “మా న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుంది” అని హైదరాబాద్‌ లోని హరిజనుల  యూనియన్ అధ్యక్షుడు వి. వెంకట్రావు 1939 ఏప్రిల్ 23న ప్రకటించారు. పూణేలోని హరిజన్ అధికార్ సురక్ష మండల్ సత్యాగ్రహంలో మంత్రి, పూణె హిందూ సభ కార్యకర్త కృష్ణారావు గంగారాం గంగుర్డే పాల్గొన్నారు.  1939 ఫిబ్రవరి 22న సియామ్, ఫిజీ నుండి సత్యాగ్రహుల బృందం షోలాపూర్ చేరుకుంది (కేసరి, ఆగష్టు 1, 1939). ‘కేసరి’ పత్రిక లండన్ స్టేటస్ డిపార్ట్‌మెంట్ D.V. తమ్‌హంకర్, హిందూ అసోసియేషన్ ఆఫ్ యూరప్ మంత్రి బెంగేరి  హైదరాబాద్‌ పై విదేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు (కేసరి, 21 జూలై 1939). అనేక మంది సిక్కులు ఈ నిరాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సర్దార్ జై సింగ్ నేతృత్వంలోనీ దాదర్ హిందూ సభ పదకొండు మంది సత్యాగ్రహుల బృందం 1939 మే 31న నాందేడ్‌లో అరెస్టయింది. ఇరవై ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. సిక్కు విప్లవకారుడు బాబా మదన్ సింగ్ గాగా పంజాబీ నారాయణ్ సేనలో పద్దెనిమిది మంది సత్యాగ్రహి బృందంలో కలిసి పాల్గొన్నారు. జూన్ 2న పూణెలో జరిగిన స్వాగత సభలో బాబా మదన్‌సింగ్ మాట్లాడుతూ, “ఈ సత్యాగ్రహం విజయవంతం అవుతుంది. ఎందుకంటే దీనికి నేతృత్వం వహిస్తున్నది వీర్ సావర్కర్ జీ ” అని ఉద్ఘాటించారు. అలాగే సావర్కర్ జీ నాయకత్వంలో హిందుస్థాన్ కూడా స్వాతంత్ర్యం పొందుతుంది అనే నమ్మకం నాకుంది.” 1939 జూన్ 3న బాబా మదన్ సింగ్ నాయకత్వంలో తొమ్మిది మంది సిక్కుల బృందం సకర్ (సింధ్) పూణే చేరుకుంది (కేసరి, 6 జూన్ 1939). దేశవ్యాప్తంగా ఆర్యసమాజ్‌కు చెందిన 18,000 మందికి పైగా సత్యాగ్రహులు ఉద్యమంలో పాల్గొన్నారు. హిందూ మహాసభ చాలా మంది సత్యాగ్రహులు బృహత్ మహారాష్ట్రకు చెందినవారు.  వారు ఏడు నుండి ఎనిమిది వేల మంది వరకు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో దాదాపు 400 మంది నిరసనకారులు జైల్లో ఉండగానే వారి సత్యాగ్రహం నిలిచిపోయింది . పన్నెండు, పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిలు కూడా పోరాటంలో చేరి జైలుకెళ్లారు.  ఈ పోరాటంలో పద్దెనిమిది మంది సత్యాగ్రహులు తమ ప్రాణాలను అర్పించారు. స్త్రీలు ప్రత్యక్ష సత్యాగ్రహంలో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా నిషేధించారు. అయినప్పటికీ వారు నిధుల సేకరణ, జనజాగరణ, సత్యాగ్రహులను ప్రోత్సహించే కార్యం చేశారు. ఈ ఉద్యమంలో హిందూ మహాసభ సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేసింది. ఈ ఆర్థిక భారాన్ని మహారాష్ట్ర, అందులోనూ ప్రముఖంగా ముంబై నగరం భరించింది. ఈ ఉద్యమం వల్ల నిజాం ప్రభుత్వానికి సుమారు కోటి రూపాయలు ఖర్చయినట్లు అంచనా. (దాతే. పేజీ 194,195).

హిందువులపై నిజాం దమన కాండ, విద్వేషం

 హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగే ముందు కూడా అనుమానాస్పద ప్రయాణికులపై వికారాబాద్‌ నుంచే నిఘా పెట్టారు. హైదరాబాద్‌కు ఎవరెవరు వెళ్తున్నారనే దానిపై రహస్య పోలీసుల కన్ను పడింది. స్టేషన్‌లో దిగిన వెంటనే కస్టమ్ చెక్‌పాయింట్ వద్ద ప్రయాణికులు సామాన్లు మొత్తం సోదాలు చేశారు. దీని కారణంగా చాలా మంది సనాతనీయులు తమ మత గ్రంథాలైన, గురుచరిత్ర, శివలీలామృతం మొదలైన నిత్య పారాయణ గ్రంథాలను విధర్మీయులైన ఆ ముస్లిం అధికారులకు అప్పగించాల్సి వచ్చేది. ఎవరి ట్రంక్‌లోనైనా ఏదైనా అనుమానాస్పద సాహిత్య వస్తువు కనిపిస్తే, ఆ ట్రంక్‌ను పోలీసులు తీసుకెళ్లి తనిఖీ చేసేవారు, ఆ ప్రయాణికుడు ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రయాణికులు నాలుగు –  నాలుగు గంటల పాటు అక్కడే కూర్చోవాల్సి వచ్చేది. ఎవరైనా అథితులు వస్తె ఆ సమాచారం ఇంటి యజమాని లేదా హోటల్ యజమాని పోలీసులకు ఇవ్వకపోతే, ఆ ఇంటి యజమాని కూడా  పదిసార్లు పోలీసు స్టేషన్ కు తిరగాల్సివచ్చేది. దీనికి విరుద్ధంగా, మావలీ గడ్డం ఉన్న పఠాన్ ముస్లిం నిర్భయంగా గ్రామంలో సంచరించేవాడు.

సత్యాగ్రహం ప్రారంభమైన వెంటనే, రహస్య పోలీసుల్లో అనేక రిక్రూట్‌మెంట్‌లు జరిగాయి. గోడలకు కూడా చెవులు ఉన్నాయేమో అనే భయం వల్ల ఇళ్లలో కూడా ఎవరూ రాజకీయాలను  బహిరంగంగా చర్చించలేకపోయారు. అటువంటి పరిస్థితిలో హిందూ ప్రజల బాధలను వినడం కూడా కష్టంగా మారింది. హిందువుల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ విషయమై ఎవరితోనూ బహిరంగంగా మాట్లాడలేకపోయారు. హిందువుల ప్రతి కదలికను డిటెక్టివ్‌లు నిశితంగా పరిశీలించేవారు. ఒకరకంగా హిందూ నేతలు గూఢచారుల దృష్టిలో బందీ అయ్యారు. ముస్లింలలో జాతి సెంటిమెంట్ తారాస్థాయికి చేరుకుంది. ప్రతి వీధిలో హిందూ దుకాణాల ముందు వారి దుకాణాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ లొకేషన్‌లో ఉన్న ఒక బ్యాంకు నుంచి ఆరు లక్షల రూపాయల మూలధనం తీసుకుని ముస్లిం దుకాణాలు తెరిచారు. ఈ దుకాణాల నుండి మాత్రమే ముస్లిం వస్తువులను కొనాలని  దారి పొడవునా ముస్లింలు వాలంటీర్లు హిందూ దుకాణాల ముందు సాధారణ దుస్తుల్లో ఉండి ప్యాకింగ్ చేయడం ప్రారంభించారు. హిందూ వ్యాపారులను నిర్మూలించాలి అని చాలా మంది సంపన్న ముస్లిం వ్యాపారులు ప్రమాణం చేశారు. నిజాం షాహీ ఉద్యోగులు లోలోపల ఈ ప్రచారానికి ఆజ్యం పోశారు. కూరగాయల మార్కెట్, పూల వ్యాపారి , గాజుల వ్యాపారులు, పింజారి అందరూ ముస్లింలే. ఇప్పుడు ఇస్లాం ‘షాపు’ పేరుతో గ్రామాల్లో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇతర ప్రభుత్వ శాఖలు పూర్తిగా ఇస్లామిక్‌గా మారాయి.  బహిష్కరణ  చర్య వల్ల మిగిలిన మొత్తం వ్యాపార క్షేత్రాన్ని ముస్లిములు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. మరోవైపు నిషేధ జాబితాలో వచ్చే వార్తాపత్రికల సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉంది. ఆంక్షల భారీ గోడను నిజాం ప్రభుత్వం  రాష్ట్రమంతటా నెలకొల్పింది (కేసరి, 18 నవంబర్ 1938).  స్థానిక సత్యాగ్రహులు తమ సత్యాగ్రహం గురించి ఒక గంట ముందుగానే పోలీసుకు తెలియజేసేవారు. కానీ స్థలం చెప్పకపోయేవారు. సత్యాగ్రహ వార్త తెలియగానే నగరంలో పోలీసుల పరుగు మొదలయ్యేది.

తరచుగా అనేక అమాయకుల ఇళ్లలోకి ప్రవేశించి వారి తలలను కర్రలతో కొట్టేవారు. ఈ కారణంగా గ్రామాలలోని హిందూ ప్రాంతాలు శ్మశానాన్ని తలపించేవి . అదే సమయంలో రంజాన్ మాసం కారణంగా మసీదులు రాత్రి కూడా కళకళలాడేవి. ప్రభుత్వ ఖర్చుతో అద్భుతమైన విందులు ఇవ్వబడేవి (కేసరి, 22 నవంబర్ 1938).

వందేమాతరం ఉద్యమం

1938 నవంబర్ 16న ఔరంగాబాద్ (మహారాష్ట్ర)లోని ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ వందేమాతరం నినాదాన్ని నిషేధం విధించడంతో  హాస్టల్ విద్యార్థులు నిరాహారదీక్ష ప్రకటించారు (కేసరి, 18 నవంబర్ 1938).  ఆ తర్వాత అధికారులు నిషేధాన్ని ఎత్తివేశారు (కేసరి, 22 నవంబర్ 1938).  హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సాయంత్రం ప్రార్థన సమయంలో హాస్టల్‌లోని హిందూ విద్యార్థులు వందేమాతరం అంటూ నినాదాలు చేయడంపై ముస్లిం విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయగా 1938 డిసెంబర్ 12న దాదాపు 850 మంది హిందూ విద్యార్థులను అధికారులు కళాశాల నుండి బహిష్కరించారు. ఈ విద్యార్థులు తమ చదువులు మానుకున్నారుగానీ వందేమాతర నినాదాన్ని పలకడం మానుకోలేదు. ఈ విద్యార్థులు నాగ్ పూర్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయినా శ్రీ  కేదార్ గారి దగ్గర ఆశ్రయం పొందారు. ఛాన్సలర్ కేదార్ గారు నాగ్‌పూర్ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఈ విద్యార్థులందరికీ ప్రవేశం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు (కేసరి, 27 డిసెంబర్ 1938, 13, 17 జనవరి 1939).  ఇన్‌స్పెక్టర్ జనరల్ హోలిన్స్ 1939  ఫిబ్రవరి 4న హైదరాబాద్ జైలును తనిఖీ చేసేందుకు వచ్చారు.  ఇక్కడ వందేమాతర నినాదం చేసేవారు ఎవరని వాకబు చేశాడు. ఈ చర్యను ఖండిస్తూ, రామచంద్రా రెడ్డి అనే ఒక వీర యువకుడు ముందుకు వచ్చి హాలిన్స్‌తో ‘నేను ఈ చేస్తాను’ అన్నాడు. దీంతో హోలిన్స్ అతడిని రెండు చెంపదెబ్బ కొట్టాడు. మరుసటి రోజు ఆ యువకునితో పాటు మరొక ఖైదీకి ఒక్కొక్కరికి 24-24 సార్లు కొరడా దెబ్బల శిక్ష వేశారు. ఆమర్నాడు రాంలాల్ అనే సత్యాగ్రహికి 36 కొరడా దెబ్బలు విధించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం వందేమాతర నినాదం నిషేధమని హోలిన్స్ స్పష్టం చేశాడు (కేసరి, 7 మార్చి 1939).

నిజాం జైలులో యాత‌న‌లు

ఖైదు చేసిన స‌త్యాగ్ర‌హ‌లంద‌రికీ ర‌క‌ర‌కాలుగా యాత‌న‌లు పెట్టేవారు. ఆక‌లితో అల‌మ‌టింప‌జేయ‌డం, నిత్య క‌ర్మ‌ల‌కు నీరు నివ్వ‌క‌పోవ‌డం, రోగుల‌కు చికిత్స అందించ‌క‌పోవ‌డం, పైగా వారిని హింసించ‌డం, మ‌త స్వాంతంత్య్రాన్ని హ‌రించ‌డం ఇవ‌న్నీ జైలులో ప‌రిపాటి. 5 జూన్ 1939 జూన్ 5 నుండి 15 వరకు  ఔరంగ‌బాద్ కారాగారంలో జ‌రిగిన సంఘ‌ట‌నలను ఉదాహ‌ర‌ణ‌గా ఇక్క‌డ ప్ర‌స్తావించ‌వ‌చ్చు.

1939, జూన్ 5 న ఆర్య‌స‌మాజ్ నాయ‌కులు శ్రీ‌కృష్ణ తోపాటు  782 అనుచ‌రుల‌ను అరెస్ట్ చేసి  ఔరంగ‌బాద్ జైలుకు త‌ర‌లించారు. వారికి స‌రిగ్గా 13గంట‌ల త‌రువాత తిన‌డానికి కేవ‌లం స‌గం జొన్న‌రొట్టె ఇచ్చారు. కొత్త ఖైదీలతోపాటు అంత‌కు ముందున్న 200 మంది ప్ర‌భుత్వ ఖైదీలు కార‌ణంగా జైలు పాల‌నా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్త‌మ‌యింది. 6,7 జూన్ నాడు కూడా ఆదే ప‌రిస్థితి కొనసాగింది. కారాగారంలోని ఒక వార్డులోని శౌచాల‌యంలో మురికి నీరు బ‌య‌ట‌వెళ్ల‌డానికి ఒక పైపు ఉండేది. 7 జూన్ మ‌ధ్యాహ్నం నాటికి భారీ వాన కార‌ణంగా మూడ‌వ వంతు కారాగారం మురికి నీటితో నిండిపోయింది. జైలులో కొత్త‌గా వ‌చ్చిన అధికారికి అంద‌రూ ఫిర్యాదు చేశారు. ఆ అధికారి ఎలాంటి భ‌రోసా ఇవ్వ‌లేదు స‌రిక‌దా.. 7వ తేది రాత్రి 7.30ని.ల‌కు సైరన్ మోగించి బ‌య‌ట నుంచి పోలీసులు, ముస్లిం గుండాల‌ను పిలిపించారు. బందీల‌ను చిత‌క‌బాదారు. ఇందులో 75 నుంచి 100 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 8వ తేది మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు వారిని ఆ గ‌దుల్లోనే బంధించి ఉంచారు. 8 న వారి క్రూర‌త్వం ప‌రాకాష్ట కు చేరింది. భోప‌ట్‌క‌ర్ ను, అనంత్ హ‌రి గ‌ద్రే, విశ్వ‌నాథ్ కేల్క‌ర్ మొద‌లైనవారిని జైలు వ‌రండాలో కూర్చోబెట్టారు. త‌రువాత 24 మంది పోలీసులు 2 వ‌రుస‌ల‌లో నిల‌బ‌డ్డారు. ప్ర‌తి వార్డు నుంచి ఇద్ద‌రు ఖైదీల‌ను 2 వ‌రుస‌ల మ‌ధ్య నుంచి న‌డ‌వ‌మ‌న్నారు. వారిని త‌న్న‌డం, పిడిగుద్దులు గుద్ద‌డం, వారిమీద ఉమ్మ‌డం, క‌ర్ర‌ల‌తో విప‌రీతంగా కొట్ట‌డం లాంటి కిరాత‌క ప‌నుల‌కు పాల్ప‌డ్డారు.

త‌మ తోటి అనుచ‌రుల‌పై ఇలాంటి కిరాత‌క చ‌ర్య జ‌రుగుతూ ఉంటే పాపం నాయ‌కులు నిస్స‌హాయ స్థితిలో చూస్తూ ఉండి పోయారు. పోలీసులు కొట్టికొట్టి అల‌సి సొల‌సిపోయేవరకు ఈ రాక్ష‌స చ‌ర్య ఆగ‌లేదు. ఈ వికృత చ‌ర్య‌ల కార‌ణంగా ఒక ఆర్యస‌మాజ కార్య‌క‌ర్త చ‌నిపోయారు. త‌రువాతి 3 రోజులు ఖైదీల‌ను పగలు, రాత్రి తేడా లేకుండా  గ‌దుల్లోనే ఉంచారు. సుమారుగా 25మంది కార్య‌క‌ర్త‌ల‌ కాళ్ల‌కు లావుపాటి బేడీలు వేసి ఉంచారు. (ఈ సంఘ‌ట‌న గురించి కేస‌రి ప‌త్రిక‌లో 13, 20 జూన్ 1939 న ప్రచురించింది. ఆనాటి బందీల‌లో ఒక‌రైన శ్రీ‌దాతే గారు రాసిన పుస్త‌కంలోని 159 నుంచి 173 పేజీల‌లోనిది )

ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుతామ‌ని నిజాం ప్ర‌క‌ట‌న

నిజాంరాజ్యంలో జ‌రుగుతున్న అకృత్యాలు గురించి కేంద్ర‌ న్యాయ‌మండ‌లిలో ప్ర‌శ్నించారు. స‌ర్ వేజ్‌వుడ్ బేన్‌, డేవిడ్ రీస్ గ్రేన్‌ఫెల్ అనే పేరుగ‌ల ఇద్ద‌రు బ్రిటిష్ పార్ల‌మెంట్ సభ్యులు నిజాంరాజ్య ప‌రిస్థితుల‌ను అక్క‌డి పార్ల‌మెంట్ లో, స‌మాచార ప‌త్రిక‌ల‌లో చెప్పారు. హైద‌రాబాద్ ఆర్య‌స‌మాజ్ నాయ‌కులు వినాయ‌క రావు కోర‌ట్‌క‌ర్ గారి నాయ‌క‌త్వంలో 1200 మంది కార్య‌క‌ర్త‌లు జూలై 22 న స‌త్యాగ్ర‌హానికి సిద్ద‌మ‌య్యారు. నిజాం వ్య‌తిరేక ఆందోళ‌న‌లు స్థానిక వ్య‌క్తులుకాక బ‌య‌ట వ్య‌క్తులు చేస్తున్నార‌ని, వారికి స్థానిక వ్య‌క్తుల మ‌ద్ద‌తు లేద‌ని చేప్పే నిజాం ప్ర‌భుత్వానికి ఇది ఒక చెంప పెట్టు లాంటి ప‌రిస్థితి అది. అందుకే స‌త్యాగ్ర‌హానికి ముందుగానే జూలై 17న అయిష్టంగా రాజీకి సిద్ధపడింది నిజాం ప్రభుత్వం.

నిజాంను స‌ర్వ‌స‌త్తాధికారిగా ఉంచ‌డం,   ఇత‌ర రాష్ట్రాల‌తో సంబంధాలు, సైన్యం వంటి  ఇత‌ర విష‌యాలు వారి ప‌రిధిలోనే ఉండాలని ఒక నియ‌మావ‌ళి ఉండేది. హైద‌రాబాద్ ప్ర‌స్తావించిన మంత్రి మండ‌లిలో 85 మంది స‌భ్యులు ఉండాల‌ని అందులో 42 మందిని ప్ర‌జ‌లు ఎన్నుకోవాల‌ని, 43 మందిని ప్ర‌భుత్వం నియమించాలి.  ప్ర‌తినిధి స‌భలో హిందూ, ముస్లింలు స‌రి స‌మానంగా ఉండాలి. మ‌త స్వాతంత్య్రం లాంటి వివాదాస్ప‌ద ప్ర‌శ్న‌ల‌పై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి హిందూ ముస్లింలు స‌మానంగా ఉండే ప్ర‌తినిధి సంఘం, హైద‌రాబాద్ రాజ్యంలోని అధికారుల‌ను నియ‌మించ‌డానికి స్వ‌తంత్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌, బ్రిటిష్ ఇండియా స‌మాచార చ‌ట్టంపై ఆధార‌ప‌డి ఉన్న ముద్ర‌ణా నియామ‌కం కొర‌కు కొత్తం చ‌ట్టం, సంఘ స్వాతంత్య్రం, అధికారుల‌కు సూచ‌న‌ల‌ను ఇవ్వ‌డానికి స‌భకు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వ‌డానికి ఒప్పుకోవ‌డం జరిగింది. (కేస‌రి, 21 జూలై 1939).

జూలై 19 ఉద‌యం నిజాం ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణ చ‌ట్టం గురించి ప్ర‌క‌టించింది. ఈ చిన్న చిన్న మార్పుల‌పై స్థానిక ముస్లింల ప్ర‌తిక్రియ ఏమిటి? సంస్క‌ర‌ణ‌లు ప్ర‌క‌టించ‌గానే ముస్లింలు త‌మ త‌మ దుకాణాల‌ను స్వ‌చ్చందంగా మూసివేశారు. ఈ ధ‌ర్నా ఎంత పకడ్బందీగా ఉందంటే, ఇది పూర్తిగా పూర్వాలోచిత కార్య‌క్ర‌మం అని అంద‌రికీ స్ప‌ష్టంగా తెలిసిపోయింది. ధ‌ర్నా ముగియ‌గానే సాయుధ ముస్లింలు గుంపులు గుంపులుగా సైకిళ్ల‌పై కోడ్ల‌పై వ‌చ్చే స‌రికి ర‌వాణా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్త‌మ‌యింది. ముస్లిం యువ‌కులు న‌ల్ల జెండాలు భుజాల‌కు న‌ల్ల‌టి చిహ్న‌ల‌తో ప్ర‌తి చోట చేరి ఇస్లాహ్ ముర్దాబాద్ (సంస్క‌ర‌ణ‌లు వ‌ద్దు) లాంటి నినాదాలు చేస్తూ రోడ్ల‌పైకి వ‌చ్చేవారు. కొంత‌మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేష‌న్ కు త‌ర‌లించారు. పోలీసు స్టేష‌న్ ఎదుట కొన్న‌వేల మంది ముస్లిం య‌వ‌కులు గుమిగూడారు. మ‌ధ్యాహ్నం త‌రువాత సాయుధ ముస్లింల భ‌యం వ‌ల్ల హిందువులు త‌మ దుకాణాల‌ను మూసివేసుకున్నారు. “మేము పోలీసు మంత్రిని క‌ల‌వాలి” , “మేము ఆర్థిక మంత్రిని క‌ల‌వాలి” అని బోర్డు త‌గిలించిన గాడిద‌ల‌ను రోడ్డు మీద వ‌దిలేశారు. (కేస‌రి 25, జూలై 1939)

జూలై 19న  ఆర్య‌స‌మాజ్ త‌మ ఉద్య‌మాన్ని ఆపివేసింది. 10శాతం ఉన్న ముస్లింల‌కు 90 శాతం ఉన్న హిందువుల‌పై రాజ‌నీతి స్థాయిని ఇచ్చింది అనే మ‌ర‌క ఉన్న‌ప్ప‌టికీ, సంస్క‌ర‌ణ‌లను హిందూ మ‌హాస‌భ మండ‌లి స్వాగ‌తించింది. 1939  జూలై 30న ఒక ప్ర‌తిపాద‌న ద్వారా త‌మ ఉద్య‌మాన్ని ఆపేసింది. 17 ఆగ‌స్టు 1939 నుంచి వారం రోజుల‌లో అంద‌రూ రాజ‌కీయ ఖైదీల‌ను మెల్ల‌మెల్ల‌గా వ‌దిలి వేశారు. వారి దారి ఖ‌ర్చుల‌కు నిజాం ప్ర‌భుత్వ‌మే సుమారు ఒక ల‌క్ష రూపాయ‌లు వెచ్చించింది. భాగ్య‌న‌గ‌రంలో నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న ఈ విధంగా ముగిసింది.

ఇందులో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్, స్వ‌యంసేవ‌కుల పాత్ర ఏమిటి ? అనే విషయాలు త‌రువాతి వ్యాసంలో చూద్దాం..

Read Also : హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: మొద‌టి భాగం

హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: రెండవ భాగం

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – మూడ‌వ‌ భాగం