Home News కేరళ లో జరుగుతున్న కమ్మూనిస్టుల హింసోన్మాదినికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన భాగ్యనగర్

కేరళ లో జరుగుతున్న కమ్మూనిస్టుల హింసోన్మాదినికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన భాగ్యనగర్

0
SHARE

కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ లు జాతీయవాదులనే లక్షంగా చేసుకొని చేస్తున్న భౌతిక దాడులు, హత్యలకు వ్యతిరేకేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలలో భాగంగా ఈ రోజు మార్చ్ 3, 2017  నాడు హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బ్యాండ్ ధర్న చౌక్ లో జాగృత భారత్, ఎంఎంఆర్ఐ సంస్థల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు విచ్చేసి తమ నిరసనను తెలియచేస్తూ, కమ్యూనిస్ట్ ల హింసకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ముక్తకంటంతో  ఖండించారు. 5000 వేల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు.

మాజీ పోలీస్ డి.జి.పి. శ్రీ దినేష్ రెడ్డి గారు మాట్లాడుతూ  కమ్మూనిస్టుల హింసాత్మకమైన చరిత్రను వారి తెలియచేసారు. రాష్ట్ర బి జె పి అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు రష్యా , చైనా నుండి ప్రేరణ పొందుతూ ఉంటారు అని ఆరోపించారు.

ప్రజ్ఞ భారతి సంస్థకు చెందిన శ్రీమతి విజయ భారతి మాట్లాడుతూ ఈ.ఎం.ఎస్  నంబూద్రి ప్రసాద్ దేశాన్ని పరిపాలిస్తాడు అని కమ్యూనిస్టులు అనుకున్నారు అని గుర్తు చేసారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడీ ఉన్న విషయాన్ని సైతం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని, ప్రస్తుతం వారి సిద్ధాంతం శూన్యం అని  కమ్యూనిస్టులు వైఖరిని ఎండగట్టారు.
అది జంభవ సంఘం అధ్యక్షుడు శ్రీ వంశ తిలక్ గారు ప్రసింగిస్తూ, డాక్టర్ అంబెడ్కర్ ను బ్రతికి ఉన్న సమయంలో వారిని మోసం చేసి, ఇప్పుడు తిరిగి వాళ్ళే అంబెడ్కర్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు అని వాళ్ళ మోసపూరితమైన విధానాన్ని ప్రజలకు వివరించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాం కుమార్ గారు మాట్లాడుతూ “విద్వేషమే మా సిద్ధాంతం” అని ప్రకటించిన స్టాలిన్ వారసులైన కమ్మ్యూనిష్టులకు తొలినాళ్ళలో దేశంలో కొంచెం ఆదరణ లభించింది అని, దాని ద్వారా కొన్ని రాష్ట్రాల్లో వారు అధికారంలోకి కూడా వచ్చారు. కాని కొన్ని రోజుల్లోనే వారి నిజ స్వరూపం తెలుసుకున్న ప్రజలు ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించారు” అని అన్నారు.

ఆర్ ఎస్ ఎస్ మరియు కమ్మ్యునిజం మనదేశంలో ఒకే సారి ప్రారంభమయ్యాయి. కమ్మ్యూనిజం పేరు మీద ఈనాటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది పైగా అతి కిరాతకంగా హత్యా గావించబడ్డారు. ఆకర్షణీయమైన నినాదాల నడుమ కమ్మ్యూనిజం మొదట్లో ప్రజల దృష్టిని ఆకర్షించింది. కమ్మ్యూనిజం ప్రపంచాన్ని ఎలుతుందని అందరు విశ్వసించారు. కాని వారి బండారం కొన్ని రోజుల్లోనే బయట పడింది. వారి అసత్య ప్రచారాలను ప్రజలు త్వరలోనే గ్రహించారు. ఈ దేశ మూలాలకు , ధర్మానికి కమ్మ్యూనిజం సరిపడదని ప్రజలు తెలుసుకున్నారు. ఫలితంగా ఈనాడు కమ్మ్యూనిష్టులు దేశంలో ఒక చిన్న మూలకి పరిమితం అయిపోయారు.
కాని సంఘం ప్రజల విశ్వాసంతో పెరుగుతూ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది సహించని కమ్మ్యునిష్టులు సంఘంపై భౌతిక దాడులకు తెగబడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు పలికిన కమ్మ్యునిష్టులు దేశభక్త ఆర్ ఎస్ ఎస్ ని నిలువరించడానికి అనేక హేయమైన దుశ్చర్యలకు పాల్పడుతోంది. వీటన్నిటినీ తట్టుకొని సంఘం ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ గ అవతరించింది.

దేశం క్లిష్ట సమయాల్లో ఉన్న ప్రతీసారి కమ్మ్యునిష్టులు శత్రువులకు సహకరించారు. 1962 చైనా యుద్ద సమయంలో చైనా కి మద్దతు తెలిపిన కమ్మ్యునిష్టులు, ఎమర్జెన్సీ సమయంలో ఎమర్జెన్సీ కి మద్దతుగా నిలిచి తమ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. అదే కమ్మ్యునిష్టులు ఈనాడు అఫ్జల్ గురు లాంటి  టేర్రరిష్టులకు వారసులుగా నిలిచి మరోసారి తమ దేశవ్యతిరేకతను చాటుకుంటున్నారు.

ఈనాడు కేరళ లో చాలామంది పాత కమ్మ్యునిష్టులు సంఘంలో చేరుతున్నారు. వారిలో విద్యావంతులు , ఉపాధ్యాయులు, అధికారులు, జడ్జీలు ఉన్నారు. ఇది సహించలేని కమ్మ్యునిష్టులు ఒకనాటి సహచరులన్న కనికరం లేకుండా వారిపై దాడి చేసి హత్య చేస్తున్నారు.
ఇటువంటి దాడులను ఎదుర్కొని తగిన బుద్ధి చెప్పే శక్తి సంఘానికి లేకనో లేక చేతకాకో కాదు. కాని ఆర్ ఎస్ ఎస్ హింసని విశ్వసించదు. సుహృద్భావ శాంతియుత వాతావరణం కొరకు సంఘం నిజాయితీగా నయనార్ , ఈ ఎం నంబూద్రిపాద్ లాంటి వారితో సంప్రదింపులు జరిపింది. కాని వారు వంచించే ప్రయత్నం చేసారు. కాబట్టి, గత్యంతరం లేని పరిస్తుతుల్లోనే ఈనాడు సంఘం దేశవ్యాప్త ఆందోళనకు నడుం కట్టింది.

ఈ నిరసన కార్యక్రమానికి ఏబివిపి, ప్రజ్ఞా భారతి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మాదిగ చమార్ మేధావుల ఫోరమ్, ఉస్మానియా యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ సామజిక చైతన్య వేదిక, జాతీయ విద్యార్ధి బి సి సంఘం, జనం కోసం, ప్రకృతి మిత్ర, అతిధి సహయోగ్, సిఖ్ సంఘటన్, రాష్ట్ర సేవిక సమితి, బార్ కౌన్సిల్ అఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారు సంఘీభావం ప్రకటించారు