
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాననీయ ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు) గా శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారిని నేడు ( 7 జనవరి, 2018) ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణాలో జరిగే ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలు వారి అద్వర్యంలో నిర్వహించబడుతాయి. వారు 1978 నుండి స్వయంసేవకులు. గత 9 సంవత్సరాలుగా వారు RSS ప్రాంత బౌదిక్ ప్రముఖ్ గా ఉన్నారు.
శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల, కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా బాద్యతలు నిర్వహించారు. వారు కరీంనగర్ లో నివసిస్తున్నారు.
ఇంతకూ పూర్వం ఉన్న ప్రాంత సంఘచాలక్ గా శ్రీ ప్యాట వెంకటేశ్వర్ రావు గారు 6 సంవత్సరాలుగా ఆ బాద్యతలు నిర్వహించారు. వయస్సు, ఆరోగ్యం దృశ్యా ఆ బాద్యతల నుండి స్వయంగా విరమించుకున్నారు. ఇక మీదట ప్రస్తుతం వారు ప్రాంత కార్యకారిణి సబ్యులుగా ఉంటారు.
