ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హుత్నూర్ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మంది విద్యార్థులను వారి వసతి గృహం నుండి ఎలాంటి అనుమతి లేకుండా స్కూల్ ప్రిన్సిపాల్ లావణ్య ఆదివారం నాడు (14-జూలై) నాడు స్థానిక చర్చిలోని ప్రార్ధనకు తీసుకొని వెళ్ళింది.
ఈ విషయాన్నీ తెలుసుకున్న గ్రామస్తులు చర్చి వద్దకు వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహార శైలిని, అమాయక పిల్లల చేత క్రైస్తవ మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న ఆమెను కలిసి నిలదీసారు.
ఈ విషయం తెలుసుకున్న వి హెచ్ పి, భజరంగ్ దళ్ , బి జే పి కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు. వసతి గృహం నుండి నియమాలకు విరుద్ధంగా విద్యార్థులను గత మూడు అదివారముల నుండి చర్చ్ కి తీసుకొని వెళ్లి అక్కడ మత మార్పిడికి ప్రయత్నం చేస్తున్న ప్రిన్సిపాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటనపై బజార్ హుత్నూర్ గ్రామస్తులు డి ఎస్ప్ నరసింహ రెడ్డి , డి ఈ ఓ జనార్ధన్ రావు కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు చర్చ్ వద్దకు చేరుకొని విచారణ జరిపారు.
గ్రామస్తులు, ప్రిన్సిపాల్ కి మద్య జరిగిన వాగ్వివాదం తరువాత పోలీసులు, విద్య శాఖా అధికారులు ఈ విషయం పై సమగ్ర దర్యాప్తు చేసి పై అధికారులకు వివరిస్తామని తెలియచేసారు.
ఈ విషయం పై అధికారులు విచారణ చేసిన తరువాత ప్రిన్సిపాల్ లావణ్య ను కలెక్టర్ ఆమెను విధుల నుంచి తొలగించారు.