సంఘం ప్రజాస్వామ్య పద్ధతులలో నిరసన తెలపడం మీదనే విశ్వాసం ఉంచుతుంది – జె .నందకుమార్
కేరళలో సంఘ స్వయంసేవకుల మీద మార్క్సిస్టులు చేస్తున్నదాడులకు వ్యతిరేకంగా మార్చి 1 నుండి 3 వరకు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి . అందులో భాగంగా మార్చి1న ఉజ్జయిన్ లో జనాధికార సమితి నిర్వహించిన ఒక ప్రదర్శనలో డా.కుందన్ చంద్రవత్ గారు ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి గురించి చేసిన వ్యాఖ్యలు సంఘం దృష్టికి వచ్చాయి. అవి సరియైనవి కాదని సంఘము అభిప్రాయపడుతున్నది . దేశవ్యాప్తంగా జరిగే ప్రదర్శనలు అనేక సంస్థలకు చెందిన వక్తలు మాట్లాడుతూ ఉంటారు . అటువంటి వ్యక్తుల అభిప్రాయాలు సంఘపు అధికారిక అభిప్రాయంగా పరిగణించరాదు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రారంభము నుండి వ్యక్తినిర్మాణము, తద్వారా సమాజకళ్యాణము అనే పనిలో నిమగ్నమై ఉంది. హింసలో సంఘానికి ఎటువంటి విశ్వాసము లేదు. ప్రజాస్వామ్య పద్ధతులలో నిరసన తెలపడం పైన విశ్వాసం ఉంచుతుంది . అందువలన డా.చంద్రవత్ గారు క్షణికావేశంలో చేసిన వ్యాఖ్యలను సంఘము ఖండిస్తున్నది.
జే .నందకుమార్
అఖిల భారతీయ సహప్రచార ప్రముఖ్.