Home News అర్ ఎస్ ఎస్ దేశ ప్రజల మద్య సోదర భావం, మాతృభూమి పట్ల ప్రేమ ను...

అర్ ఎస్ ఎస్ దేశ ప్రజల మద్య సోదర భావం, మాతృభూమి పట్ల ప్రేమ ను కోరుకుంటుంది- శ్రీ రతన్ శారద

0
SHARE

అర్ ఎస్ ఎస్ దేశ ప్రజల మద్య సోదర భావం, మాతృభూమి పట్ల నిరుపమానమైన ప్రేమ, సేవాభావం కలిగి ఉండడం, దాంతో పాటు దేశానికి వ్యక్తిగతంగా సామాజికంగా  ఏమి చేయగలను అనే భావం కలిగి ఉండాలని కోరుకుంటుంది అని ప్రముఖ రచయిత, శ్రీ రతన్ శారద గారు తెలిపారు.

శ్రీ రతన్ శారద రచించిన “అర్ ఎస్ ఎస్ 3600 డి మిస్టిఫైంగ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం 4- ఆగస్ట్ నాడు మాదాపూర్ లో చేతన సంస్థ వారు నిర్వహించారు.

శ్రీ రతన్ శారద

అర్ ఎస్ ఎస్ ఏనాడూ కూడా తాను చేసే మాతృభూమి సేవ ను ప్రచార విషయంగా భావించలేదు, అలాంటి దృష్టి కూడా ఏనాడూ ఆ సంస్థకు లేదు. కాని కాలక్రమంలో సంస్థ పై ఉన్న అనేక సంశయాలను దూరం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని అన్నరు.

అర్ ఎస్ ఎస్ ఒక కుటుంబ సంస్థ లాంటిది కాని సామాజిక సంస్థ కాదు. కుటుంబం లాంటి వాత్సల్యం మరియు త్యాగాల ద్వారా ఈ సంస్థ నిర్మితమయింది కాని సిద్ధాంతాల ఆధారంగా కాదన్నారు.

సంస్థ ప్రారంబమైన నాటి నుండి నుండి దేశసమైక్యత, సార్వభౌమత్వం విషయాలలో రాజీ లేని వైఖరినిఅవలంబించింది. ఉదాహరణకు ఆర్జికల్ 35A, 370, మతమార్పిడి, భారతీయభాషలను ప్రత్సాహించడంవంటి విషయాలు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పి. కె. మిశ్రగారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలోనిఅన్ని రంగాలలో సంఘ్ విస్తరించింది. ఈ పుస్తకంద్వార సంఘ ఆలోచనలను సామాన్యులకుఉపయోగపడుతుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Sri BK Mishra

కార్యక్రమంలో పాల్గొన్న అర్ ఎస్ ఎస్ దక్షిణ మధ్య సేవ ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు మాట్లాడూతూ నేడు అర్ ఎస్ ఎస్ భావజాలంసైద్ధాంతిక సంవాదాలకు కేంద్రబిందువుగామారిందన్నారు. ఇలాంటి దశకు చేరుకోవడానికి అనేకమంది నిస్వార్థ,  త్యాగ మరియు పెద్దల ఆశీస్సులతోనే సాధ్యమైందన్నారు. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ నాగపుర్ పర్యటనను 40 దేశాలలోని ప్రజలు ఉత్సుకతతో వీక్షింఛారు.

Sri Aekka Chandrasekhar

ప్రజలలో అర్ ఎస్ ఎస్ పట్ల ఉత్సుకత పెరిగింది అని, సంస్థ కార్యకలాపాలు, నిర్వహణ తీరు పట్ల అవగాహన పెంచుకొని స్ఫూర్తిని పొందాల్సినఅవసరం చాల ఉందన్నారు.  దేశంలో జరుగున్న అనేక సేవ కార్యక్రమాలకు సంఘ్ ఒక ప్రేరణ శక్తి అని తెలిపారు.