Home News చర్చ్ పాపాలు

చర్చ్ పాపాలు

0
SHARE

చర్చ్ తనపై వచ్చే విమర్శలు, వివాదాలను పట్టించుకోకుండా, వాటిని తక్కువ చేసే ప్రయత్నం చేయడం ఇటీవల మనం చూస్తున్నదే! నన్ పై అత్యాచారం అందుకు ఒక ఉదాహరణ. కేరళలో ఇలాంటి ఎన్నో కేసులలో బాధితుల నోళ్ళు మూయించింది చర్చ్.

రాష్ట్ర, దేశ కార్యకలాపాల్లో, వ్యవహారాల్లో చర్చ్ జోక్యం కొత్త కాదు. అసలు సెక్యూలర్ మరియు థియోక్రాటిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. థియోక్రాటిక్ అంటే దైవ సంబంధమైన పరిపాలన. క్లుప్తంగా చర్చి ప్రకారం చెప్పవలసివస్తే,  చర్చి పెద్దల ద్వారా పరిపాలన సాగడం. సెక్యూలర్ అంటే ఆ చర్చి జోక్యం లేకపోవడం. చర్చి స్వామ్యంలో నడిచే విధానానికి వ్యతిరేకంగా పోరాడిన దేశాలు సెక్యూలర్ దేశాలయ్యాయి. కాలక్రమేణా ప్రజాస్వామ్యం వ్యాపించింది. సెమెటిక్ భావజాలం మళ్ళీ ప్రభుత్వాల మీద ప్రభావం చూపించడం మొదలైంది. ఆర్థికబలంతో చర్చ్ ప్రజల పై ప్రభావం చూపి, దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. మరే ఇతర సంప్రదాయాలను, భావజాలాలను భరించే గుణం లేని ఈ సెమెటిక్ భావజాలాలు, గతంలో ఎన్నడూ ఇతర సంప్రదాయాలను ఒప్పుకున్న దాఖలాలు లేవు. చర్చివారు తమ పథకాల ద్వారా, తమ అనుచరులను అదుపు చేసి, ప్రభుత్వ దైనిక కార్యకలాపాలను అదుపు చేయగలిగారు. దీనివలన అత్యాచారం, మానభంగం లాంటి నేరాలు వెలుగులోకి రాకపోవడమో, వచ్చినా న్యాయస్థానంలో ఫిర్యాదు, విచారణ జరగకుండానే సమసిపోయేలా చేయడమో జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో బాధితులకు డబ్బు ఆశ చూపి నోరుమూయించే  ప్రయత్నాలు కూడా జరిగాయి.

చర్చి గురించి వెలుగులోకి రాని కొన్ని విషయాలు:

ఐర్లాండులో “బాలబాలికలపై అత్యాచారం” అనే విషయంపై 2600 పేజీల నివేదిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తొమ్మిది సంవత్సరాల దర్యాప్తు ద్వారా దశాబ్దాల పాటు బాలబాలికలపై అత్యాచారాల్లో, కొన్ని వందల చర్చి పెద్దలు, నన్ లు పాత్ర వహించినట్టు ఉంది. క్రైస్తవ బ్రదర్స్ నడిపే బాలుర సంక్షేమ గృహాలు, నన్ లు నడిపే బాలికల గృహాలలో ఈ దారుణాలు జరిగినట్టు కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వస్తే, చర్చి వారు, ఆ బాధితులను వేరే ప్రాంతాలకు తరలించేవారు. ఈ పధ్ధతి ద్వారా, చర్చి ఆ నిందితులపై విచారణ జరగకుండా రక్షించడమే కాక, వేరే ప్రదేశాల్లో ఉన్న పిల్లలను కూడా ఈ రొంపిలోకి దించే పని చేసేది. విచారణ ఆలస్యం చేయడమో, లేక తెలివైన న్యాయవాదుల ద్వారా కేసు వీగిపోయేట్లు చేయడం, దోషుల పేర్లు దాచిపెట్టడం వంటి అనేక మార్గాలు చర్చ్ అనుసరించింది.

చర్చ్ ఘాతుకాలకు మరో ఉదాహరణ “మాగ్డలీన్ లాండ్రీస్”.  ఇదొక సంస్థలాంటిది. ఇందులో ఆడపిల్లల చేత వెట్టి చాకిరీ చేయించేవారు. పెళ్లి కాకుండా పిల్లల్నికన్న స్త్రీల నుండి ఆ పిల్లలను అపహరించి, అనాధ గృహాల్లో పెట్టేవారు.  వేశ్యలుగా బ్రతికిన స్త్రీల సంక్షేమ గృహాలుగా, ఆ తరువాత  పెళ్ళికాకుండా పిల్లల్నికన్న స్త్రీల సంక్షేమ గృహాలుగా, వీటిని చర్చి నడిపింది. అయితే ఈ విషయాలు ఏవి బయటకు రాకుండా మాగ్దలీన్ లాండ్రీస్ జాగ్రత్తపడింది.  గత  రెండు వేల సంవత్సరాల్లో  చర్చ్ ఇలా దాచిపెట్టిన ఘోరాలు అనేకం. నిజానికి స్పెయిన్ లో అల్వియెర అనే పట్టణంలో చర్చ్ కోసం  చట్టాలే చేసారు కూడా. ఈ తరహా దాపరికాలు ఆ చర్చి పెద్దలను ఇలాంటి విషయాల్లో మరింత ప్రోత్సహించాయి. ఈ విధంగా డయోసీస్ లలో (బిషప్ కేర్ లో ఉన్న ప్రాంతం) బిషప్ లే పాలకులయ్యారు. ఆ బిషప్ లు తమ విషయాలను, నివేదికలను, పొప్ కి మాత్రమే సమర్పిస్తారు. ఇలా అధికారం – పరిపాలన విధానం రెండు వర్గాలుగా – అంటే చర్చి అదుపులో ఉండేది, రాజ్యాంగం అదుపులో ఉండేది (అంటే చర్చి పాలితం కానిది అన్నమాట) గా విడిపోయాయి.

చెప్పుకుంటూ పోతే మరిన్ని దుర్ఘటనలు ఇలాంటివి జరిగాయి

ఆగష్టు 2018 లో, పెన్సిల్వేనియా న్యాయస్థానం, కనీసం 300 పైగా క్లేర్జీలు (క్రైస్తవ పాస్టర్లు ) బాలబాలికలపై అత్యాచారంలో నిందితులుగా పేర్కొంది.

ఆస్ట్రేలియాలో 2018 లో, బిషప్ ఫిలిప్సన్ బాలికపై అత్యాచారం విషయంలో రాజీనామా చేయవలసి వచ్చింది.

జూన్ 2018 లో, వాటికన్ లోక్యవాదికి ఇదే విషయంలో ఐదేళ్లు కారాగారశిక్ష పడింది.

చిలి లో, 34 రోమన్ కాథలిక్ బిషాప్లు బాలికలపై అత్యాచారం వలన రాజీనామా చేయవలసివచ్చింది.

యుఎస్ బిషప్ కాన్ఫరెన్స్ లో చేసిన ఒక అధ్యయనం ద్వారా తెలిసిన విషయం – 1950 నుండి 17000 మైనర్ బాలికలు  ఆరువేల మంది మతాధికారుల చేతిలో  లైంగిక వేధింపులకు గురయ్యారు.

చర్చి  థియోక్రాటిక్ పరిపాలన పై ఒత్తిడి, మరియు ఈ రకమైన దుర్ఘటనలు వలన, వీటిపై దర్యాప్తుకు 2015 లో పొప్ ఒక ధర్మాసనం ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆ రిపోర్ట్ ద్వారా వాటికన్ తెలియజేసినదాన్ని బట్టి 2004 నుండి సుమారు ఎనిమిది వేల చర్చి పెద్దలు ఈ అత్యాచార నేరాల్లో నిందితులుగా తేలడంతో, కొంతమందిని నిర్మూలించడం, కొంతమందికి జరిమానా విధించడం జరిగింది. అయితే వారి వివరాలు మాత్రం బయటకు రాలేదు. 1950 నుండి చర్చి యుఎస్ లోనే కనీసం 250 కోట్ల డాలర్లను కోర్ట్ సెటిల్మెంట్స్ కోసమే వెచ్చించింది. ఇదీ ప్రపంచవ్యాప్తంగా చర్చి ఘోరాలు.  అదే విధంగా ఈ దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా వ్యవహరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు కూడా ఉంది.

-అభిజిత్ శర్మ

అనువాదం : సమవర్తి