Home News అక్రమంగా కట్టిన చర్చిని స్వాదీనం చేసుకొని గిరి పుత్రులు 

అక్రమంగా కట్టిన చర్చిని స్వాదీనం చేసుకొని గిరి పుత్రులు 

0
SHARE
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీ సమీపంలోని గార్ఖాటాంగా గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం గిరిజనుల చెందిన స్థలంలో  క్రైస్తవ మిషినరిలు అక్రమంగా  ఒక చర్చ్ నిర్మాణం చేపట్టాయి. దీన్ని సవాలు చేసిన గ్రామస్తులు  కోర్టు లో కేసి వేసి గెలిచారు. తరువాత 100 మందికి పైగా గ్రామస్తులు చర్చ్ వద్దకు చేరి,  చర్చిపై ఉన్న శిలువను  తొలగించి ఆ చర్చికి శరణ భవన్ గా  నామకరణం చేసి చట్టబద్ధంగా స్వాదీన పరుచుకున్నారు.
స్థానిక పత్రిక కధనం ప్రకారం ఈ చర్చి నిర్మించిన స్థలం గిరిజనులకు చెందినది కావడంలో యాజమాన్య హక్కుల కోసం  వారు స్థానిక కోర్టుని ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేసుని విచారించి ఆ భూమి గిరిజనులకు చెందినదే అంటూ తీర్పునిచ్చింది.
ఈ వ్యవహారంలో స్థానిక గిరిజన సంస్థలు ‘ఝార్ఖండ్ ఆదీవాసీ శరణ వికాస్ సమితి’ మరియు ‘కేంద్రీయ యువ శరణ సమితి’ గ్రామస్థులకు అండగా నిలిచాయి.
కేంద్రీయ యువ శరణ సమితి అధ్యక్షులు సోమా ఓరాన్ దీనిపై స్పందిస్తూ “ఈ భూమి ఆక్రమణకు గురై, అక్రమంగా చర్చి నిర్మించే సమయంలోనే ప్రతిఒక్కరూ  ప్రశ్నించారు. కానీ అధికారులు వినిపించుకోవడంతో కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది” అని అన్నారు. బలవంతపు మతమార్పిళ్లు, గిరిజన భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ గిరిజన సంఘాలు క్రైస్తవ మిషనరీలపై తీవ్రమైన విమర్శలు చేశారు.
Source: Swarajyamag