Home News “సేవా ఇంట‌ర్నేష‌న‌ల్‌” సేవ‌ల‌కు అమెరికా అధ్య‌క్షుడి ప్ర‌శంస‌లు

“సేవా ఇంట‌ర్నేష‌న‌ల్‌” సేవ‌ల‌కు అమెరికా అధ్య‌క్షుడి ప్ర‌శంస‌లు

0
SHARE

కోవిడ్ -19 సమయంలో “సేవా ఇంటర్నేషనల్” చేసిన సేవ‌ల‌ను అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్ ప్ర‌శంసించారు. కోవిడ్ స‌మ‌యంలో అనేక మందికి సహకారానికి అందించి, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో పాలు పంచుకుని అంద‌రూ వ్యాక్సిన్ తీసుకోవ‌డంలో స‌హ‌క‌రించిన సేవా ఇంట‌ర్నేష‌న‌ల్ వారిని అభినందిస్తూ అమెరికా అధ్య‌క్షుడు ఒక లేఖలో పేర్కొన్నారు.

“గత సంవత్సరం అమెరికన్ చరిత్రలో అత్యంత బాధాకరమైన సంవత్సరాలలో ఒకటి. కోవిడ్ కారణంగా 6,28,000 కంటే ఎక్కువ మంది అమెరిక‌న్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ స‌మ‌యంలో ఎక్కువ మందికి టీకాలు వేయించ‌డం అతి ముఖ్యమైన పనులలో ఒకటి. ఈ ప‌నిలో “సేవా ఇంట‌ర్నేష‌న‌ల్” చేసిన ప్రయత్నాలు ఎంతో మందికి పున‌ర్జీవ‌నం అందించారు. మీరు అందించిన మద్దతు మాకు మునుపెన్నడూ లేదు. ఒక దేశంగా ఐక్యంగా ఉండి మనం ఈ మహమ్మారిని అధిగమించి ఆరోగ్యకరమైన, మరింత సహాయకరమైన భవిష్యత్తును పొందవచ్చు” అని అమెరికా అధ్యక్షుడు లేఖలో పేర్కొన్నారు. సేవా ఇంటర్నేషనల్ సేవ‌ల‌ను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపూతూ “ప్రెసిడెంట్ జో బిడెన్ మీ మాటలు మా వాలంటీర్లందరికీ స్ఫూర్తిదాయకం, ప్రేరణనిస్తాయి అని సేవా ఇంట‌ర్నేష‌న‌ల్ త‌న ట్వీట్ట‌ర్ లో పోస్టు చేసింది.

కోవిడ్‌-19 మహమ్మారి సమయాల్లో సేవా ఇంటర్నేషనల్ అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. క‌రోనా తో బాధ‌పడుతున్న వారికి మెడికల్ కిట్లు, టీకాలు, పడకలు ఏర్పాటు చేయ‌డం మొదలైన సేవా కార్య‌క్ర‌మాలు వారి దినచర్యలో రోజువారీ భాగంగా మారింది. నాణ్యమైన ఆరోగ్యం, జీవనశైలి గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో సేవా ఇంట‌ర్నేష‌న‌ల్ వాలంటీర్లు నేటికీ నిమ‌గ్న‌మై ఉన్నారు.