హైదరాబాద్ నారాయణగూడ కేశవమెమోరియల్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సేవా సంగమం రెండవ రోజున ఉపాద్యాయుల సదస్సు జరిగింది. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాంత సేవాసమితి అధ్యక్షులు శ్రీ దుర్గా రెడ్డి, ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్, క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ , వందేమాతరం రవీందర్ ఇతర పెద్దలు మార్గదర్శనం చేశారు.
ఉపాధ్యాయులు – సేవా కార్యక్రమాలు అనే అంశంపై జరిగిన చర్చ ప్రారంభించిన ప్రాంత సేవ ప్రముఖ్ శ్రీ వాసు వివిధ రకాల సేవా కార్యక్రమాలను పరిచయం చేశారు. భారతీయ సంస్కృతిలో ముఖ్య పాత్ర పోషించేది ముగ్గురేనని, వారిని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పూజిస్తామని అన్నారు. విద్యార్థి ఎలా బ్రతకాలో నేర్పించేది గురువు అని, సమాజ నిర్మాణం చేసే వ్యక్తులను అందించేది ఉపాధ్యాయులు మాత్రమేనని తెలిపారు.
శ్రీ ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ మన
హృదయాలలో సంవేదన కలిగి కళ్ళల్లో నీళ్ళు వచ్చిన రోజు సేవ చేయాలనే ఆలోచన కలుగుతుందని అన్నారు.
చివరగా వందేమాతరం రవీందర్ మాట్లాడుతూ
సమాజం పరివర్తనం కోసం ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, ఉపాధ్యాయుడికి సంవేదన
కలిగి, ఉద్యమ కార్యకర్తగా పని చేస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని, భావిభారత పౌరులను తయారుచేసే శక్తి ఉపాధ్యాయులలోనే ఉందన్నారు.
అందుకే అందరం అంకితభావంతో సేవ చేయాలి అని పిలుపునిచ్చారు.