Home Telugu మహారాష్ట్ర సతారా జిల్లాలో పుస్తకాల కోసం ఓ గ్రామం అంకితం

మహారాష్ట్ర సతారా జిల్లాలో పుస్తకాల కోసం ఓ గ్రామం అంకితం

0
SHARE

చదవడమే మరిచిపోతున్న జనాలలో పుస్తక ప్రియత్వం క్షీణించిపోతోందన్న దశలో మహారాష్టల్రోని సతారా జిల్లాలోని చిన్ని గ్రామం భిల్లార్- మన దేశంలోనే మొట్టమొదటి ‘పుస్తక నిలయం’ అయిపోయింది- బుక్ విలేజ్ జనాభా పదివేలయితే ఇప్పుడక్కడ పదివేల పుస్తకాల లైబ్రరీ దర్శనమిస్తోంది. ఈ ‘పుస్తకమ్చే గావ్’కి వెళ్ళే దారిపొడుగునా గోడలమీద పిడకలు సినిమా పోస్టర్లు కానరావు- పుస్తకాల నుంచి సూక్తులు, సామెతలు స్వాగతం పలుకుతాయి. ఒక చెయ్యి సెల్‌ఫోనుకే అంకితమైపోయిన ఈ రోజుల్లో రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ సాయంతో ఈ పుస్తకాల పల్లెని ఇరవైయ్ అయిదు అందమైన రీడింగ్ రూములతో పాఠశాలకు కన్నుగీటే రీతి ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చేతిమీదుగా ప్రారంభించారు. బల్లలు కుర్చీలు, ఆరుబయట రీడర్స్ కోసం పెద్ద పెద్ద గొడుగులు వగైరా గవర్నమెంటు ఇవ్వగా, బాలసాహెబ్ భిలారే మరో 25 మంది పుస్తక ప్రియులు వారి నివాస గృహాలనే ఇచ్చారు. రాష్ట్ర మరాఠీ వికాస్ సంస్థ, భాషా వికాస సంస్థలు దీనికి పూనిక వహించేయి. ఇదే ప్రేరణతో యుపిలోను బిహార్‌లోను కూడా పుస్తక గ్రామాలు రెడీ అవుతున్నాయి. రీడింగు అలవాటు తిరిగి పుంజుకుంటే యువతరంలో కొన్ని వ్యసనాలు తగ్గి విజ్ఞానం దానితోపాటు న్యూస్‌పేపర్లు కూడా బ్రతికి బట్టకడతాయన్నది చిన్ని ఆశ!

వీరాజీ

(ఆంధ్రభూమి సౌజన్యం తో)