మరో 21 రోజులు ఇల్లు అనే లక్ష్మణ రేఖ దాటి రావద్దు – ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరం పాటించడం, అందరూ ఇళ్లకే పరిమితం కావడానికి మించి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకనే నేటి (24 మార్చ్) అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు (15 ఏప్రిల్ వరకు) దేశం మొత్తంలో మూసివేత (లాక్ డౌన్) అమలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించారు. ప్రజలు తమ ఇల్లనే `లక్ష్మణ రేఖ’ దాటకుండా తమ ప్రాణాలతోపాటు, కుటుంబసభ్యులు, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కరోనా గురించి ప్రధాని మోదీ...

కోవిడ్-19 పరీక్ష అందరికీ ఎందుకు చేయడం లేదు?

కోవిడ్ -19 కేసులను గుర్తించే పరీక్ష కోసం మార్గదర్శకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కింది వ్యక్తులను  పరీక్షించాలి. - తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులందరూ (శ్వాస ఆడకపోవడం, జ్వరంతో పాటు  దగ్గు లక్షణాలను కలిగి ఉన్నవారిని) - వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తితో కలిసిన ఇతరులకు ఐదవ రోజు నుండి 14 వ రోజు మధ్య పరీక్ష అవసరం.

ఎంకౌంటర్లో 17 మంది జవాన్లు మృతి

ఛత్తీస్ఘడ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులు - జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. మార్చి 21 శనివారం నాడు జిల్లాలోని ఎల్మగూడ అటవీ ప్రాంతంలో  ఈ దాడి చోటుచేసుకుంది. మృతి చెందిన జవాన్లలో అధికంగా జిల్లాకు చెందిన రిజర్వ్ గార్డులతో పాటు గతంలో మావోయిస్టులుగా పనిచేసి లొంగిపోయి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా పనిచేస్తున్న యువకులు ఉన్నారు.

ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి ప్రకటన

"సమాజంలో పరిశుభ్రత, ఆరోగ్యం, జాగరూకతల ప్రాధాన్యత గురించి చిన్న చిన్న సమూహాలలో స్వయంసేవకులు చర్చ జరపాలి. అలాగే అవసరమైనవారికి నిత్యవసర వస్తువులు, భోజన సామగ్రి అందించే వ్యవస్థ కూడా చేయాలి.అవసరాలను గుర్తించి స్థానిక పాలన యంత్రాంగం, ప్రజా ప్రతినిధులకు సహకరించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలులో పూర్తి సహాయసహకారాలు అందించాలి."   -- మా. సురేశ్ (భయ్యాజీ) జోషి,సర్ కార్యవాహ,రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్

Fighting Corona – An integrated approach to wellness of health is the best solution

I happened to watch a panel discussion of TV recently on the ways of preventing the spread of Corona virus and the possibility of its cure. The panel consisted of doctors of national repute from different systems of medical treatment — homeopathy, allopathy, medicine and it also had India’s prominent heart specialist Padamshri Dr Naresh Trehan, CMD of Medanta hospital. They all...

చైనా నిర్లక్ష్యం వల్ల ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తోంది – ట్రంప్‌

మహమ్మారి కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శించారు. కరోనా వైరస్‌ పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా మరోసారి చైనా తీరును తప్పుబట్టారు. చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడినట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ఆదిలోనే కట్టడిచేస్తే అది ఆ ప్రాంతానికే పరిమితమయ్యేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమని, ఇదే నిజమని తానుకూడా బలంగా నమ్ముతున్నానని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Satyaniti and Swaraj constitute the historical backbone of the socio-political order of India, through the ages

Society in the lands we know in modern times as India once was a society firmly placed on the twin-pillars of self-governance and voluntaryism. Voluntaryism is a philosophy that posits that all forms of human association should be voluntary. A voluntaryst society is one where people live, socialise, transact and trade without any structures of power and hierarchy, without any coercion or regressive...

నిర్భయ నేరస్తులకు ఉరి అమలు.. ఏడేళ్లపాటు సాగిన న్యాయప్రక్రియ

-- ప్రదక్షిణ   ఏడు సంవత్సరాలకు పైగా దేశాన్ని, ముఖ్యంగా మహిళలని భయోత్పాతానికి గురి చేసిన నిర్భయ సామూహిక మానభంగం-హత్య కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి నేడు 2020 మార్చ్ 20న, సరిగ్గా ఉదయం 5.30గంటలకు  ఢిల్లీ తిహార్ జైల్లో, నిర్భయను అత్యాచారం చేసిన నలుగురిని ఉరి తీశారు.  అతి క్రూరంగా దారుణంగా ఆమెని అత్యాచారం చేసి, హింసించిన ఆరుగురిలో, ఒకరు జైల్లో ఉరివేసుకుని చనిపోగా, ఇంకొకరికి అత్యాచారo చేసిననాటికి మైనారిటీ...

కలిసి కరోనాను కట్టడి చేద్దాం – ప్రధాని నరేంద్ర మోదీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి జాగ్రత్త, అప్రమత్తతలే ప్రధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ నెల 22న అంతా జనతా కర్ఫ్యు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు - మనం ఆరోగ్యంగా ఉంటామని ఇతరులను ఆరోగ్యంగా ఉంచుతామని సంకల్పం తీసుకోవాలి సంయమనం, సామాజిక దూరం పాటించడం అత్యావశ్యకం. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమంటే మనం మనకు, మన కుటుంబానికి ఆపద కలిగిస్తున్నామని గుర్తించాలి. ప్రభుత్వం చేపట్టే అన్నీ కార్యక్రమాలకు మనం పూర్తి...