ప్రార్ధనల ద్వారా వైద్యం అంటూ యువకుడి మృతికి కారణమైన పాస్టర్ మీద కేసు నమోదు
ప్రార్ధనల ద్వారా వైద్యం చేసి రోగాలు నయం చేస్తామంటూ మోసానికి పాల్పడి యువకుడి మృతికి కారణమైన క్రైస్తవ బోధకుడిపై కేసు నమోదైంది. తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి చెందిన క్రైస్తవ సంస్థ కల్వరి మినిస్ట్రీస్ అధినేతతో పాటు అతడి భార్య షారోన్ మరియు ఇద్దరు సహాయకులపై కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేష్ అనే యువకుడికి ప్రార్ధనల ద్వారా నయం చేస్తానంటూ నమ్మించిన పాస్టర్, అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా అడ్డుకున్నట్టు రాజేష్...
భారత్ ఒక అజేయ శక్తిగా ఎదుగుతుంది – శ్రీ ఉదయ భాస్కర్
"నేడు భారత దేశం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యానం తో ప్రపంచ దేశాలకు దీటుగా ఒక అజేయమైన శక్తిగా ఏదుగుతుందని, వాటికి నిదర్శనమే మన శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రయోగించిన మిషన్ శక్తి ఏ-శాట్ మిస్సైల్, వివిధ మిలిటరీ, కార్టోశాట్ సిరీస్ శాటిలైట్లు అని అన్నారు. అతి తక్కువ పెట్టుబడులతో దేశీయంగా తయారుచేయడం, అందుకు అన్ని విధాల ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం ఒక శుభపరిణామం" అని శ్రీ ఉదయ భాస్కర్ గారు, విశ్రాంత చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, భారత్...
నాగపూర్ లో ప్రారంభమయిన ఆర్.ఎస్.ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ
ఆర్ ఎస్ ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ నాగపూర్ లోని డా. హెడ్గేవార్ స్మృతి భవన్ మహర్షి వ్యాస సభాగృహంలో ఈ రోజు ప్రారంభమయింది. శిక్షావర్గ ఉద్ఘాటన కార్యక్రమంలో మాట్లాడుతూ నిత్య జీవన వ్యవహారంలో సరైన విలువలను అనుసరించడం చాలా ముఖ్యమని సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. ఇది చాలా ముఖ్యమైన కార్యమే అయినా అది అలవాటు చేసుకోవడం కష్టమని ఆయన అన్నారు. ఆ విలువలను జీవితాంతం అనుసరించడానికి కావలసిన స్వచ్ఛత, నిష్ట సంఘ శిక్షావర్గలో అలవరచుకోవచ్చని అన్నారు. దేశం మొత్తం నుంచి 828 మంది శిక్షార్ధులు ఈ సంవత్సరం వర్గలో పాల్గొంటున్నారు. తృతీయ వర్షలో పాల్గొంటున్నవారంతా విద్యార్ధులే కావడం విశేషం. ఇక్కడ వ్యక్తిగతమైన విషయాలను మరచిపోయి మాతృభూమి సంతానమనే విషయాన్నే...
ఎన్నికల ఫలితాలపై భయ్యాజీ జోషి స్పందన
స్థిరమైన ప్రభుత్వాన్ని కలిగిఉండే అదృష్టం కోట్లాదిమంది భారత ప్రజానీకానికి మరోసారి కలిగింది. ఇది జాతీయవాద శక్తుల విజయం. ఈ ప్రజాస్వామ్య విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు. ప్రజాస్వామ్య ఆదర్శం, స్ఫూర్తిని ప్రపంచం మరోసారి దర్శించింది. నూతన ప్రభుత్వం సామాన్య ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని విశ్వసిస్తాము. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన వేళ ప్రతికూల భావాలను పక్కన పెట్టి అంతా ప్రజల తీర్పును వినయపూర్వకంగా స్వాగతించాలి. - భయ్యాజీ జోషి, సర్ కార్యవాహ, ఆర్ ఎస్ ఎస్
Attack on SC Reservation Parirakshana Samiti President in Hyderabad
In a blatant show of arrogance, some miscreants attacked Karne Srisailam, President of the National SC Reservation Parirakshana Samiti while he was addressing a press conference at the Somajiguda Press Club yesterday. Punjagutta police have arrested four persons in connection with the attack and registered a case. The Incident
తెలంగాణ గురుకులాల్లో స్వేరోల అవినీతి స్వైరవిహారం
ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల ఉన్నతి కోసం మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ ఎంతో కృషి చేశారు. వారి కోసం గురుకుల విద్యాలయాలు స్థాపించడానికి ఎంతో శ్రమించారు. ఆ గురుకులాల ద్వారా విద్యార్ధులను తీర్చిదిద్దడానికి చక్కని వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎంతో చొరవ, శ్రద్ధా తీసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆవాస విద్యాలయాల సంస్థ, తెలంగాణ గిరిజన సంక్షేమ ఆవాస విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...
ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి
ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి జరిగింది. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఈ రోజు విలేకరుల సమావేశం జరుగుతుండగా కొందరు దుండగులు హఠాత్తుగా కర్నె శ్రీశైలంపై దాడికి తెగబడ్డారు. ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది?ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలోని స్వేరోస్ సంస్థ నిర్వహణలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల...
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల్లో స్వేరోల పేరుతో ఆధిపత్యం
- గురుకులాలపై స్వేరో పెత్తనమేంధీ - చెప్పేది ఒక్కటి చేసిది ఒక్కటి - వారు చెప్పిందే వేదం - చేసేది శాసనంలా ఉంది - గురుకులాలకు వారు చేసే అభివృద్ధి ఏంటీ? - వారి వారి జేబులు నింపుకోవడం తప్ప - పిల్లల తల్లిదండ్రుల ఆవేదన తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాలో అసలేం జరుగతుందో అర్ధం కాని విధంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. గురుకుల సంస్థ వారి సొత్తుగా భావిస్తున్నారా అనేది అర్ధం కాకుండా ఉంది. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒక కమిటి గా ఏర్పడి గురుకులాలను అభివృద్ధి...
పాత్రికేయులు ప్రశ్నించే గొంతుక కావాలి – కెయు జర్నలిజం శాఖ అధిపతి మల్లేశ్వర్
ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులు సమాజం పక్షాన ప్రశ్నించే గొంతుకలు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డా. శ్రీ సంగని మల్లేశ్వర కోరారు. సమాచార భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం హన్మకొండ బాల సముద్రంలోని సామ జగన్మోహన్ రెడ్డి స్మారక భవనంలో పాత్రికేయ సన్మాన సభ నిర్వహించారు. సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. పానుగంటి విశ్వనాథ అధ్యక్షతన జరిగిన ఈ...
పరంపర దృష్టితో సమకాలిన వాస్తవాలతో ప్రజలను ఏకం చేయాలి – జాగృతి పత్రిక అసోసియేట్ ఎడిటర్ దుర్గారెడ్డి
గత అనుభవాలను, దేశ సామాజిక పరంపరను దృష్టిలో ఉంచుకొని సమకాలిన వాస్తవాలతో పత్రికలు పాత్రికేయులు ప్రజలను ఏకం చేసే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త, జాగృతి వారపత్రిక అసోసియేట్ ఎడిటర్ శ్రీ దుర్గా రెడ్డి అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఫిలిం భవన్ ఆడిటోరియంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన దుర్గారెడ్డి...


















