దేశంలో సమరసతా సాధన కోసం మరింత కృషి చేయాలి: శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ

స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ ప్రయాణం అత్యంత రోమాంతమైనది. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ మన దేశం సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లు అన్నీ మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే విభజించబడింది. వెనువెంటనే... ఆ విభజన కారణంగా జరిగిన హింసాకాండను ఎదుర్కొంది. ఆ తర్వాత వెంటనే సరిహద్దు దాడులను ఎదుర్కొంది. అయితే...

వినుర భారతీయ వీర చరిత

జలియన్‌ వాలాబాగ్ గాంది తోడ సమర గానము చేయగ జలియవాల బాగు జనుల నిండె డయ్యరదియె గాంచి దయ్యమై చెలరేగె వినుర భారతీయ వీర చరిత భావము స్వతంత్ర ఉద్యమకారులంతా కలిసి జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, డయ్యర్ అనే నరరూపరాక్షసుడు విచక్షణారహితంగా కాల్పులు జరపాలని బ్రిటీషు సైనికులను ఆదేశించడంతో వందలాదిగా భారతీయులు అసువులు బాశారు. తల్లి భారతి స్వేచ్ఛ కోసం అమరులైన వీరుల చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్

Exposing fabricated narratives against RSS

When selfish, anti-social elements cannot compete with the genuine work of a patriot or organisation working for a better society and nation, their only option is to tarnish the image of such an individual or organisation. RSS (Rashtriya Swayamsevak Sangh) has been maligned on social media platforms with a fabricated narrative. I've given three fictitious narratives to demonstrate how...

మన కర్తవ్యం, సంకల్పాల సాకారానికి కటిబద్దులము కావాలి: శ్రీ మోహన్ భాగవత్ జీ

ఈ ఆగ‌స్టు 15నాటికి భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగుతాయి కూడా. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఈ చక్రం ఇలా సాగుతూనే ఉంటుంది. సమస్యలెన్ని ఉన్నా అమృత మహోత్సవంలో ఆనందాన్ని పొందడం అత్యంత సహజమైనది. 1947 ఆగస్ట్, 15న అనేక ఏళ్ల తరువాత...

VIDEO: నిజాం పాలకుల పాలిట సింహస్వప్నం బద్దం ఎల్లారెడ్డి

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో బద్దం ఎల్లారెడ్డి ఒకరు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, 1938నాటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన అరెస్టయ్యారు. జైలు శిక్ష అనుభవించారు. ఆయన నాయకత్వంలో ఒక ఉదారవాద సంస్థగా మొదలై నిజాం వ్యతిరేక ఐక్య ఫ్రంట్‌గా తీవ్రరూపం దాల్చిన ఆంధ్ర మహాసభకు ప్రధాన కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి సేవలను అందించారు.

‘ది సటానిక్ వెర్సెస్’ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో దాడి

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై శుక్రవారం న్యూయార్క్‌లో దాడి జరిగింది. 'ది సటానిక్ వెర్సెస్' నవలతో ప్రసిద్ధి చెందిన సల్మాన్ రష్దీపై ఒక ఆగంతుకుడు దాడి చేశాడు. ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కత్తితో అనేకసార్లు పొడిచాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం న్యూయార్క్‌లోని షిటాక్వాలో షిటాక్వా ఇనిస్టిట్యూషన్‌లో ప్రసంగించడానికి రష్దీ వచ్చారు. ఆయన ప్రసంగించడానికి ముందుకు కార్యక్రమ నిర్వాహకులు సభికులకు రష్దీని పరిచయం చేస్తుండగా హఠాత్తుగా ఆగంతుకుడు వేదికపైకి దూసుకువచ్చాడు. రష్దీపైకి విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో రష్దీ కిందపడిపోయారు. అక్కడ ఉన్నవారు ఆగంతుకుని...

RSSపై దుష్ప్రచారంతో కూడిన కథనాలు.. ఇవీ అసలు వాస్తవాలు

-పంకజ్ జగన్నాథ్ జేస్వాల్ ఒక దేశభక్తుడు లేదా మెరుగైన సమాజం, మెరుగైన దేశం కోసం అంకితమైపోయిన ఒక సామాజిక సేవా సంస్థ చేపట్టిన పవిత్రమైన కార్యంతో స్వార్థపూరితమైన, సంఘ వ్యతిరేక శక్తులు పోటీపడలేవు. అలాంటి వ్యక్తి లేదా సంస్థను అప్రతిష్ఠ పాల్జేయడమే వారి ముందున్న ఏకైక ఐచ్ఛికం. ఒక కల్పితమైన కథనంతో సోషల్ మీడియా వేదికలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)కు అపకీర్తి కలిగిస్తున్నారు. దాదాపు 14,000 వేలకుపైగా సేవా ప్రాజెక్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం, దేశం ఔన్నత్యాన్ని అభివృద్ధి చేయడానికి అంకితమైన ఒక సంస్థను...

వినుర భారతీయ వీర చరిత

శ్రీ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జీ (డాక్టర్జీ) సీ. జాతి జెండ నిలప జాకుదించదలచె గుప్త నామమునను గుబులు రేపె పూర్ణ స్వేచ్ఛ కొరకు పూరించె శంఖంబు కానలందునను తా కర్ర విరిచి ధిక్కరించెన్ జూడు నొక్క శాసనమును యురి గూడ తనకును మురిపెమనుచు ననుభవించెను ఖైదు తను పలుమారలు ఖేదములను దీర్చె కేశవుండు అ.వె. వందెమాతరమని వచియించె బాల్యాన యువకుడయ్యి నడిపె యుద్యమములు సంఘశక్తితోడ సంఘటనను జూపె వినుర భారతీయ వీర చరిత భావము బాల్యంలో యూనియన్ జాక్ దించేసి జాతీయ జెండా ఎగురవేయాలని తన మిత్రులతో పథకం వేశారు. కొకైన్ అనే రహస్యనామంతో విప్లవ కార్యమాలు చేసి బ్రిటిషు వారికి గుబులురేపారు....

జాతిజనులను ‘కట్టి’ ఉంచే బంధం

– బూర్ల దక్షిణామూర్తి భారత్‌కు సుదీర్ఘ చరిత్ర, ప్రాచీన సంస్కృతి, శ్రేష్ఠమైన వారసత్వం వచ్చాయి. అందులో భాగమైన ఉత్సవాలు మన జాతీయ జీవనానికి గుర్తులు. ఈ ఉత్సవాలు సమాజంలో స్నేహం, సంఘటన, నూతనోత్సాహం, ఆహ్లాదకర వాతావరణాన్ని నిర్మిస్తు దేశభక్తిని పెంపొందిస్తాయి. మూస జీవితంతో విసుగు, అలసట కనిపించడం మానవ స్వభావం. మనం నిర్వహించుకునే ఉత్సవాలతో అవి దూరమవుతాయి. విలువలతో కూడిన జీవితం గడపాలనే కోరిక పెరిగి, మరింత ముందుకు వెళ్లేందుకు ప్రేరణ లభిస్తుంది. సమాజంలో ఆత్మీయత, ఏకాత్మత,  సమరసత నిర్మాణమై దేశాన్ని సుదృఢం చేసే కార్యం...

రక్షాబంధనంతో సమాజ బంధనం

- హో.వె.శేషాద్రి మ‌న ఉత్త‌ర భార‌తంలో రాఖీ బ‌హు సుంద‌ర‌మైన సంకేతానికి ప్ర‌తీకం. ఏ స్త్రీ అయినా ఒక‌ పురుషుడు, అప‌రిచితుడైనా కూడా అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి అత‌డికి “రాఖీ” క‌డితే ఆ క్ష‌ణం నుంచి అత‌డు ఆ స్త్రీకి సోద‌రుడు, ర‌క్ష‌కుడ‌వుతాడు. అంతేగాక ఏ స్త్రీకైనా ఆప‌ద వాటిల్లిన‌పుడు ఆ స్త్రీ ప‌ర‌క్ర‌మ‌వంతుడైన పురుషునికి ‘రాఖీ’ క‌డుతుంది. ఆ పురుషుడు ఆమెను ఆప‌ద నుంచి కాపాడ‌డానికి ప్రాణాన్నైనా ధార‌పోయ‌డానికి సిద్ద‌మ‌వుతాడు. అందుకోసం అత‌డు ప‌రుగెడ‌తాడు. మ‌న చ‌రిత్ర‌త‌లో ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో ఉన్నాయి. మ‌న...