మతపరమైన ఉద్రిక్తతలను అరికట్టేందుకు కృషి చేయాలి – శ్రీ అజిత్ దోవల్ జీ
దేశంలో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలకు అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ జీ అన్నారు. న్యూ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో సూఫీ మతపెద్దలతో ఏర్పాటు చేసిన సర్వమత సామరస్య సమావేశానికి అజిత్ దోవల్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు భారతీయులమైన మనం మూగ ప్రేక్షకులుగా ఉండలేమని అన్నారు. భారతదేశ పురోగమనానికి భంగం కలిగించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా...
UDHAM SINGH: THE AUDACIOUS INDIAN
-Ananth Seth This write-up is not going to be a biographical essay about Balidaani Udham Singh or an Information Capsule on his commendable act. Any internet search engine would let us know that Udham Singh was the great son of Maa Bharti who avenged Jalianwala Bagh massacre by assassinating Michael Francis O’Dwyer, the former Governor of Punjab who had supported...
వినుర భారతీయ వీర చరిత
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెల్లవాని తలను తెగటార్చెనుయ్యాల శిస్తు కట్టనంటు శివమునెత్తి ఉద్యమంబు జేసి ఉరిముద్దిడెజూడు వినుర భారతీయ వీర చరిత భావము రేనాటివీరుడుగా, సైరా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పలనాడు ప్రాంతంలో ఆంగ్లేయుల శిస్తు వసూలుకు వ్యతిరేకంగా స్వరాజ్య సమరం చేశారు. తహసీల్దార్‌ను హతమార్చారు. తెల్లవారికి గుబులుపుట్టించి, స్వేచ్ఛ కొరకు అమరుడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీర చరిత విను ఓ భారతీయుడా! చరిత్ర ఆంగ్లేయులపై దేశంలోనే తొలిసారిగా స్వరాజ్య సమర శంఖారావాన్ని పూరించి, వారి పాలిట సింహ స్వప్నమై, రాయలసీమ ముద్దుబిడ్డగా, రేనాటి వీరుడిగా, సైరా నరసింహారెడ్డిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి పొందారు....
అటవీ సత్యాగ్రహంలో సంఘ్
స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ -1 – డాక్టర్ శ్రీరంగ్ గాడ్బొలే స్వతంత్ర దేశంగా భారత్ 75వ సంవత్స రంలో అడుగు పెడుతున్న వేళ స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ అద్భుత సందర్భానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. అది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవం. స్వాతంత్య్రోద్యమం, ఆర్‌ఎస్‌ఎస్ (సంఘ్) అనే పదాలను కలిసికట్టుగా విన్నప్పుడు తరచు ఒక ప్రశ్న వినబడుతుంది. అది ‘స్వాతంత్య్రోద్యమంలో సంఘ్ పాత్ర ఏమిటి? ఈ వ్యాసం ఆ అంశాన్ని పరిశీలించడానికి ప్రయత్నిం చింది....
వినుర భారతీయ వీర చరిత
రాస్ బిహారీ బోస్ హత్య జేయదలచె హార్డింగునీతండు మారువేషమేసి మాటమార్చె ఆద్యుడయ్యె బోసు ఆజాదుహిందుకు వినుర భారతీయ వీర చరిత భావము ఆంగ్లేయాధికారి లార్డ్ హార్డింగు హత్యకు పథకం వేసి విఫలమైన వీరుడు రాస్ బిహారీ బోస్. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళారు. జపానుకు చేరుకున్నారు. అక్కడ జపానువాసిగా రూపాంతరం చెందారు. జపానులో యుద్ధ ఖైదీలైన భారతీయులతో భారత స్వతంత్ర సేనను స్థాపించారు. కడకు ఆ సేనను నేతాజీకి అప్పగించిన రాస్ బిహారీ బోస్ వీర చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్
సౌదీ అరేబియాలో బైటపడిన 8,000 సంవత్సరాల నాటి దేవాలయం
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు నైరుతి దిక్కున ఉన్న అల్-ఫా లో 8,000 సంవత్సరాల నాటి ఒక పురావస్తు ప్రాంతాన్ని సౌదీ హెరిటేష్ కమిషన్ కనుగొంది. సౌదీ అరేబియా నేతృత్వంలో వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సదరు ప్రాంతంలో ఒక సమగ్రమైన సర్వేను చేపట్టిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) పేర్కొంది. ఆ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాల్లో అత్యంత కీలకమైనదిగా రాతితో నిర్మించిన దేవాలయం తాలూకు అవశేషాలు, హోమ గుండం భాగాలు ఉన్నాయి. ఒకానొక...
జిహాదీ హింసపై వ్యతిరేకతకు హిందూ సమాజం బాధ్యత వహించదు: మిలింద్ పరాండే
జిహాదీ హింసకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి ప్రతిచర్యలకు హిందూ సమాజం బాధ్యత వహించదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జీహాదీల దాడిలో ప్రాణాలు కొల్పొయిన బీజేవైఎం నాయకుడు ప్రవీణ్ నెట్టారు, ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో జిహాదీల కత్తుల దాడిలో ప్రాణాలు విడిచిన కన్హయ్య లాల్ తో పాటు జీహాదీల దాడులకు బలైన బాధితుల కుటుంబాలకు, హిందూ సమాజానికి...
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం.. శ్రావణం
హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. వాటన్నింటిలోనూ విశేషమైంది శ్రావణ మాసం. ఎక్కడైనా ఒకరోజో లేకపోతే వారమో పండుగలను జరుపుకోవడం చూస్తుంటాం. అయితే శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే. ఆ నెలలోని అన్ని తిథుల్లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో ఇది ఐదవది. పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసమని పేరు. మహావిష్ణువు జన్మించింది శ్రవణ నక్షత్రంలోనే కనుక దీన్ని విష్ణుమూర్తి జన్మమాసంగా భావిస్తారు. అందుచేతనే శ్రీమహాలక్ష్మికి...
VIDEO: వనవాసీ స్వరాజ్య సమర యోధుడు మర్రి కామయ్య
వనవాసీలపై ఆంగ్లేయ పాలకుల అరాచకాలను ఎదిరించిన స్వరాజ్య సమర యోధుడు మర్రి కామయ్య. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గరుడాపల్లిలో మర్రి కామయ్య జన్మించారు. స్వాతంత్ర్యం కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుస్తున్న ఉద్యమాలతో ఆయన స్ఫూర్తి చెందారు. వనవాసీల్లో నెలకొన్న అజ్ఞానాన్ని, దారిద్రాన్ని రూపుమాపి వారిలో స్వరాజ్య కాంక్ష రగిలించడానికి మర్రి కామయ్య అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వనవాసీ సంఘాలు ఏర్పాటు చేశారు. వనవాసీల్లో అక్షరాస్యత కోసం పాఠశాలలు నెలకొల్పారు. జీవనోపాధి కల్పన దిశగా కృషి చేశారు.
Hindu society won’t be responsible for any reaction against Jihadi violence – Milind Parande
New Delhi: All cases of recent Jihadi violence and beheadings, including the slaying of Praveen Nettaru in South Kannada district in Karnataka, should be tried in fast-track courts to ensure speedy justice to the victims’ families and the Hindu society. VHP General Secretary Milind Parande said that the Central and the State Governments should immediately consider setting up Fast...