వినుర భారతీయ వీర చరిత
మహాబిరి దేవి మహిళలనిట నడిపె మహబిరిదేవియె సాయుధముగను తొలిసంగరాన తెల్లవారి తలల తెంపిరి తెగువతొ వినుర భారతీయ వీర చరిత భావము 1857లో తొలి స్వరాజ్య సంగ్రామంలో, మీరట్ ప్రాంతంలో 22 మంది మహిళలను ఏకం చేసి, రాళ్ళు, కత్తులు వంటి సాధారణమైన ఆయుధాలతో బ్రిటీష్ వారిపై విరుచుకపడి, వారి తలలను తెంచిన మహాబిరిదేవి చరిత విను ఓ భారతీయుడా! చరిత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ పక్కన ఉన్న ముండ్భర్గా గ్రామానికి చెందిన మహాబిరి దేవి బ్రిటీష్‌వారి మానవ విసర్జితాలను సాటి మానవులు తొలగించరాదంటూ 22 మహిళలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా...
‘హర్ ఘర్ తిరంగా’: పోస్టాఫీసుల్లో అందుబాటులోకి జాతీయ జెండాలు
స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఆగస్గు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా(ప్రతి ఇంటిపై జాతీయజెండా) అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల నుంచి జాతీయ జెండాల విక్రయం ప్రారంభమైంది. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 6214 పోస్టాఫీసులకు 7,50,000 జాతీయ జెండాలు సరఫరా చేయనున్నట్టు పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి...
తమిళనాట రాజరాజేశ్వరి అమ్మవారితో పరమేశ్వరుని చదరంగం: ప్రధాని ప్రసంగంలో విశేషం
ఇటీవల చెన్నయ్‌లో 44వ FIDE చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ చదరంగంతో తమిళనాడుకు గల సంబంధాన్ని వారి ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడులోని ఒక దేవస్థానంలో మహేశ్వరుడు చదరంగం ఆడిన దృష్టాంతం ఉందని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని ప్రస్తావించిన సదరు దేవస్థానంపై ప్రపంచ ప్రజల దృష్టి పడింది. ఆ దేవాలయమే సతురంగ వల్లభనాథర్ దేవస్థానం. తిరువారూరు జిల్లాలోని నీడమంగళానికి సమీపంలో గల తిరుపూవనూరులో సతురంగ వల్లభనాథర్ దేవస్థానం ఉంది. తమిళ భాషలో సతురంగ...
VIDEO: అన్నాప్రగడ తెగువ – సొంత కరెన్సీతో ప్రజాపాలన
స్వరాజ్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అక్కడ జైలుపాలై 1922లో విడుదలై గుంటూరుకు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. సొంత పోస్టాఫీసు, సొంత కరెన్సీతో స్వతంత్ర ప్రజాపాలన చేపట్టారు. 1924లో స్వాతంత్ర వీర సావర్కర్ సలహాపై కరాచీ వెళ్లి కోటంరాజు పున్నయ్య సహకారంతో బెలూచిస్తాన్ చేరారు. అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి బరోడాలోని ప్రొఫెసర్ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో భగత్‌సింగ్,...
ఇందూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన స్వతంత్ర ఉద్యమం
మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్రం కోసం నిప్పు కణికలై ఎగిరి పడ్డారు. అగ్గి బరాటాలై తెల్లవాని వెన్నులో వణుకు పుట్టించారు. ఇలాంటి వీరోచిత పోరాటాలకు ఇందూరు జిల్లా కూడా వేదికగా మారింది అలాంటి వీరులను ఆ సంఘటనలను ఒకసారి స్మరించుకోవడం స్వతంత్ర అమృతోత్సవాల వేళ మన కర్తవ్యం రాజా దీప్ సింగ్ గౌర్ దేశమంతటా 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరుగుతున్న వేళ...
వినుర భారతీయ వీర చరిత
రాణి చెన్నమ్మ రాజ్యరక్ష కొరకు రాణి చెన్నమ్మతా పిలుపునిచ్చి జనుల మేలుకొలిపె జంపె కదనమునను జాను థాక్రేనట వినుర భారతీయ వీర చరిత భావము 1857 లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందు కర్నాటకలో కిట్టూరు రాజ్యాన్ని రాణి చెన్నమ్మ ఏలుతున్నారు. తన రాజ్యాన్ని కబళించడానికి వచ్చిన బ్రిటీష్ అధికారి జానా థ్యాకరేను హతమారుస్తారు. మరణాన్ని సైతం లెక్క చేయకుండా మాతృభూమిని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన రాణి చెన్నమ్మ వీర చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్
నూరు వసంతాలు నిండిన త్రివర్ణ పతాకం
ఆగస్టు 2 పింగళి వెంకయ్య జయంతి, హర్ ఘర్ తిరంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. భారతీయులు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేయడానికి ఇది స్ఫూర్తినిస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించిన 75వ సంవత్సరంలో దేశం సమిష్టిగా జెండాను ఇంటికి తీసుకురావడం దేశ నిర్మాణం పట్ల మన నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రజలకు దేశభ్త, జాతీయ పతాకం గురించిన అవగాహనను మరింత పెంచినట్లవుతుంది. అందుకే మనమందరం ధైర్యంగా… ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా / ఝండా...
అంపశయ్య పైన అమెరికన్ డాలర్
-డాక్టర్ అంకిత్ షా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం అంతర్జాతీయ సమాజ గమనంలో ఒక భారీ కుదుపునకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా నిపుణుల దృష్టిలో అమెరికన్ డాలర్ కరెన్సీ నిల్వల స్థితిగతులు ప్రశ్నార్థకమయ్యాయి. అంతర్జాతీయ సంస్థల అండదండలతో ఆంక్షలు విధించడంలో అమెరికా ప్రభుత్వం సంతరించుకున్న అధికారం, చెల్లింపు వ్యవస్థలు సమీప కాలంలో సవాళ్ళను ఎదుర్కోనున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలను రష్యా, ఇరాన్ వంటి దేశాలు పట్టించుకుంటాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఒకప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా సర్వామోదం పొందిన అమెరికన్ డాలర్...
జనని స్తన్యం.. జన్మధన్యం
ఆగస్ట్ 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అమ్మ అంటే వాత్సల్యం. వాత్సల్యమంటే ప్రేమ, మాలిమి, ఆదరం. ఆదరం అంటే మన్నన. మన్నన చూపడమంటే అక్కున చేర్చుకుని ప్రియత్వాన్ని ప్రసాదించడం. ఇవన్నీ తల్లిపాలలో ఉన్నాయి కాబట్టే అవి అమృత బిందువులు. వాటిని పసిబిడ్డ నోటికి అందించి ప్రాణం నిలబెడుతుంది మాతృమూర్తి. నవ మాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసే ఆమె ప్రత్యక్ష దైవం. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు జననిని, తాను కటాక్షించే క్షీర ప్రాధాన్యాన్ని విపులీకరిస్తూనే ఉన్నాయి. వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యానికి, సామాజిక...
వినుర భారతీయ వీర చరిత
బిపిన్ చంద్రపాల్ వంగ విభజ నొద్దు వందెమాతరమని కారుచిచ్చు లేపె కాంక్ష తోడ బిపినుచంద్ర నిల్చె విప్లవ దర్శిగ వినుర భారతీయ వీర చరిత భావము బెంగాల్ విభజనను స్వరాజ్య సమర యోధులు బిపిన్ చంద్రపాల్ వ్యతిరేకించారు. దేశమంతటా వందేమాతరం ఉద్యమాన్ని కార్చిచ్చులా రగిలించారు. జైలు శిక్ష అనుభవించిన అనంతరం విదేశాల నుంచి విప్లవ వీరులకు మార్గదర్శిగా నిలిచిన బిపిన్ చంద్రపాల్ వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా! -రాంనరేష్