ధర్మజాగరణ జ్యేష్ఠ కార్యకర్త శ్రీమన్నారాయణ దాసు జీ అస్తమయం
ధర్మజాగరణ జ్యేష్ఠ కార్యకర్త శ్రీమన్నారాయణ దాసు (భిక్ష్మయ్య) గారు సోమవారం (06.5.2022) రాత్రి గుండెపోటుతో మరణించారు. దాసు గారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం గార్లభాయి గూడెం గ్రామ నివాసి. తెలంగాణ ప్రాంతంలో ధర్మ జాగరణ పని ప్రారంభం నుండి పూర్తి సమయ కార్యకర్తగా పని చేసిన అనుభవం కలిగిన కార్యకర్త. దాసు గారు ధర్మ జాగరణ పని శ్రద్ధ, నిష్ఠతో నిజాయితీగా పని చేశారు. తెలిసో తెలియకో మతం మారిన వేలాది హిందువులను పునరాగమనం చేయించారు. ఈ పని చేస్తున్న సమయంలో...
రాజనాలకు రామ్మోహనరావు స్మారక పురస్కార ప్రదానం
భాగ్యనగరం : సమాచార భారతి (తెలంగాణ) అధ్వర్యంలో (మే 8) ప్రపంచ పాత్రికేయ దినోత్సవం, దేవర్షి నారద జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజనాల బాలకృష్ణ వడ్లమూడి రామ్మోహనరావు స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల నాటి కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. సమాచార భారతి కమిటీ సభ్యులు వేదుల నరసింహం, కోశాధికారి పి. రాఘవేంద్రశర్మ మే 28న బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనను సత్కరించి, పురస్కారం అందజేశారు. రాజనాల గత నలభై సంవత్సరాలుగా పత్రికా రంగంలో...
విద్య, వ్యవహారశైలిలో మిన్నగా వైదేహి ఆశ్రమ బాలికలు
విద్యాబుద్ధులు నేర్చుకోవడంలో, వ్యవహారశైలిలోను వైదేహి సేవా సమితి బాలికలు మిన్నగా రాణిస్తున్నారని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని గారు పేర్కొన్నారు. జూన్ 5వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన వైదేహి ఆశ్రమం 29వ వార్షికోత్సవంలో జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఆశ్రమంలోని బాలికలను నిర్వాహకులు తల్లి, తండ్రి, గురువు, దైవంలా చూసుకుంటున్నారని ప్రశంసించారు. నేటికి సమాజంలో మగపిల్లలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు జడ్జీ తెలిపారు. రాజస్థాన్ లాంటి చోట్ల...
ఆర్.ఎస్.ఎస్ జ్యేష్ఠ ప్రచారకులు శ్రీ అప్పారావు జీ అస్తమయం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్ శ్రీ అప్పారావు (అప్పాజీ) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, దీర్ఘకాలంగా చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని వుడ్లాండ్ ఆస్పత్రిలో ఈ ఆదివారం (జూన్ -5) తుది శ్వాస విడిచారు. అప్పాజీ గారు 1965లో విద్యార్థిగా ఉంటూ విజయవాడలో సంఘ్ ప్రచారక్ గా కార్యాలయం చేరారు. ఆర్.ఎస్.ఎస్ కు ఆనాడు ప్రాంత కేంద్రంగా విజయవాడ ఉండేది. ప్రాంత ప్రచారక్ గా శ్రీ సోమయ్య గారు ఉండేవారు. ఆ సమయంలో ప్రాంత కార్యాలయంలో వీరు పనిచేశారు. 1973 లో భాగ్యనగర్...
చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ దారుణ మారణకాండ : తియనన్మన్ స్క్వేర్
జూన్, 4, 1989.. మాకు ప్రజస్వామ్యం ఇవ్వండి లేదా చంపేయండి అంటూ వేలాదిమంది విధ్యార్ధులు తియనన్ మన్ స్క్వేర్ లో నినదించారు. ఈ విధ్యార్ధులు ప్రాధమిక హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని అడుగుతూ అక్కడ చేరారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం నినాదంలోని రెండవ కోరికైన చావునే వారికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. నిరాయుధులైన ఆ విద్యార్ధులపై ట్యాంకులు, తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది. చూస్తూ ఉండగానే 10వేలమందికి పైగా నెలకొరిగారు.
LESSONS FOR INDIA FROM THE TIANANMEN
–Ananth Seth June 4, 2021 marks the 32nd anniversary of the harsh, iron-fisted military crackdown to end what were ostensibly pro-democracy protests by students, in 1989 at Tiananmen Square in the capital city of China. It resulted in unknown but high number of civilian casualties. Although demonstrations also occurred in other cities, notably in Shanghai, Nanjing, Xi'an, Changsha and Chengdu,...
స్ఫూర్తి మంతంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షావర్గ సార్వజనికోత్సవం
హిందూ అని చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకాడ వద్దని, స్వాభిమానంతో ముందుకు సాగాలని తెలంగాణా ఆబ్కారీ శాఖ విశ్రాంత డిప్యూటీ కమీషనర్ శ్రీ చల్లా వివేకానంద రెడ్డి అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) తెలంగాణా ప్రాంత ప్రథమ, ద్వితీయ సంఘ శిక్షా వర్గల సార్వజనికోత్సవం భాగ్యనగరంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. నాలుగు వేల సంవత్సరాల నాటి విష్ణుపురాణంలో భారత్ ప్రస్తావన ఉందని వారన్నారు. ప్రస్తుతం మన దేశంలో విదేశీ మూలాలు ఉన్నవారు ఎవరూ లేరని విదేశీ...
ధర్మానికి నాలుగు చక్రాలు.. సత్యం, కరుణ, పవిత్రాత్మ, ఆధ్యాత్మిక సాధన: డాక్టర్ మోహన్ భాగవత్ జీ
"సత్యం, కరుణ, పవిత్రాత్మ, ఆధ్యాత్మిక సాధన అనేవి మన ధర్మానికి నాలుగు చక్రాలు. ఇది మన జాతి జీవనానికి మూలాధారమైనది. యావత్ ప్రపంచాన్ని ఉన్నతీకరించడమనే ఒక గొప్ప లక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము" అని రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌జీ గురువారం నాగపూర్‌లో అన్నారు. తృతీయ వర్ష్ సంఘ్ శిక్షా వర్గ్ సమాపన్ సమారోహ్ సందర్భంగా స్వయంసేవకులను ఉద్దేశించి సర్‌సంఘ్‌చాలక్ జీ ప్రసంగించారు. "మనం ఎవ్వర్నీ జయించాల్సిన పని లేదు, మనం అందర్నీ ఏకం చేయాలి. ఎవరినో ఓడించడానికి భారత్...