సీఏఏ కింద మొదటి 14 మందికి భారత పౌరసత్వం
పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగిరం చేసింది. ఇందులో భాగంగా తొలిసారిగా 14 మందికి భారత పౌరసత్వాన్ని అందజేసింది. పౌరసత్వానికి సంబంధించిన సర్టిఫికేట్లను ఆ 14 మందికి అందజేశారు. డిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీరికి పౌరసత్వ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా వీరికి అజయ్ భల్లా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో డిల్లీలో 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లను అందజేశామని కేంద్ర...
పాక్ ఆర్ధిక సంక్షోభం… పీఓకేలో అల్లకల్లోలం
పాకిస్థాన్ అతలాకుతలమవుతోంది. ఆ దేశంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ఆక్రమిత కాశ్మీర్ విలవిలలాడుతోంది. ఎటు చూసినా నిరసనలు, ఆందోళనలు, హింసాకాండతో అట్టుడుకుతోంది. గతంలో పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు పీఓకేకి పాకి ఉధృతమయ్యాయి. ఏం చెయ్యాలో అర్థం కాక పాక్ సర్కారు తలపట్టుకోగా గత శుక్రవారం నుంచీ ఇప్పటివరకూ జరిగిన అల్లర్లకు ఒక పోలీస్ అధికారి బలైపోయాడు, వందలాది మంది గాయాలపాలైయ్యారు. ప్రజలపై పాక్ సైన్యం ఏకంగా ఏకే47ల నుంచి తూటాల వర్షం కురిపిస్తోంది. పాక్ సర్కారు...
హిందూధర్మ రక్షకులు శ్రీ విద్యారణ్యులు
ఏకశిలానగరం (నేటి వరంగల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం. మాధవుని తమ్ముళ్ళు సాయణుడు, భోగనాధుడు. భోగనాధుడు మంచి కవిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే మరణించాడు. మాధవ, సాయణులు శృంగేరీపీఠంలో ఆశ్రయంపొందారు. శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు. భారతి కృష్ణ తీర్థ, శంకరానందుల దగ్గర మాధవులు శాస్త్రాభ్యాసం చేశారు. ఆ విధంగా అన్నాతమ్ముళ్ళిద్దరు సన్యాసం స్వీకరించారు...
తెలంగాణలో ప్రశాంతం.. ఏపీలో హింస మధ్య రాత్రి వరకూ..!
లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌లో భాగంగా సోమవారం తెలంగాణలోని 17 స్థానాలకు జరిగిన ఎన్నికలు కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయానికి 61.59 శాతం పోలింగ్ నమోదైందన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసుల సహకారం పూర్తిగా లభించిందన్నారు. పోలింగ్ శాతం విషయానికి వస్తే 2019 కంటే ఐదు నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉండవచ్చని ఈసీ అంచనా వేస్తోంది. వాతావరణం కూడా...
వాడివేడిగా తెలుగు రాష్ట్రాలు సహా లోక్‌సభ 4వ విడత పోలింగ్
దేశవ్యాప్తంగా సోమవారం లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌తో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పర్వం వాడివేడిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఆయా పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా... పాలకుల భవిష్యత్తుని తిరగరాసేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నడుస్తుండగా... ఏపీలో అధికార వైసీపీ ఒకవైపు... బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మరోవైపు హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటn వరకు...
ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు
ఏప్రిల్ 26, వైశాఖ శుక్ల షష్ఠి - శ్రీరామానుజాచార్య జయంతి మనం ఇప్పుడు చెబుతున్న సామాజిక సమరసతకు ఆనాడే బాటలు పరచిన గొప్ప సమరసతా వారధి శ్రీ రామానుజులు. విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగుల్కొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి శ్రీరామానుజులు. శ్రీ రామానుజులు పింగళనామ (కలియుగం శాలివాహనశకం 4118, క్రీ.శ.1017) సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పంచమి రోజున కాంతిమతి కేశవాచార్యు లకు, భూతపురి నేటి శ్రీపెరంబుదూరులో (ఇది చెన్నైకి 25కిమీ దూరం) జన్మించారు. వీరిని ఆదిశేష అవతారం గా భావిస్తారు. ఆధ్యాత్మిక విప్లవం : బాల్యమునుండే...
ఆదిశంకరాచార్యుడి విజయంలో అసలు రహస్యం
--రాంపల్లి మల్లిఖార్జున్ ఒకప్పుడు ప్రపంచానికి దారి చూపిన భారతదేశంలో సైద్ధాంతిక గందరగోళం ఏర్పడిన కాలం అది. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితి. చార్వాక, లోకయాతిక, కపాలిక, శాక్తేయ, సాంఖ్యక, బౌద్ధ, మాధ్యమిక ఇలా అనేక సంప్రదాయాలు పుట్టుకువచ్చాయి. ఇలా కొత్తగా పుట్టుకువచ్చిన సంప్రదాయాల సంఖ్య 72కు పైగా ఉంటుంది. వీటన్నింటి మధ్య విభేదాలు, ఘర్షణలతో దేశం అల్లకల్లోలమయింది. సర్వత్రా మూఢనమ్మకాలు, మౌఢ్యం రాజ్యమేలుతున్నాయి. ఋషులు, మునులు, యోగులతో శాంతిమయంగా, ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిన దేశం తమస్సులోకి జారిపోయింది....
ఆదిశంకరుల వ్యవస్థానైపుణ్యం
- సత్యదేవ దేశరాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, దార్శనికులు, మతప్రచారకులు దేశంలో అశాంతికి కారణమవుతున్నప్పుడు, భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్ఞ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారు, వ్యాఖ్యానించే వారు చాలా తక్కువగా ఉన్నప్పుడు శంకరభగవత్పాదులు జన్మించారు. ప్రజల్లో ధార్మికనిష్టను పెంపొందించడానికి నాలుగు మఠాలను స్థాపించారు.ఆదిశంకరులు దేశం నలుమూలలా స్థాపించిన నాలుగు మఠాలనే చతుర్ధామాలు, మఠామ్నాయాలు అని అంటారు. ఈ చతుర్ధామ స్థాపన ఆదిశంకరుల వ్యవస్థానైపుణ్యానికి, కార్యదక్షతకూ ఉదాహరణ. హిందూధర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి...
ఎస్సీ, ఎస్టీలకు ఎవరు ఏమి చేసారు? ఎవరు తూట్లు పొడిచారు?
ఎస్సీ, ఎస్టీలకు ఎవరు ఏం చేశారన్న చర్చ ఎన్నికల సందర్భంగా విపరీతంగా జరుగుతోంది. కొందరు పనిగట్టుకొని బీజేపీ చేసింది ఏమీ లేదని, అంతా తామే చేశామని, ఆ క్రెడిట్ అంతా తమకే రావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు . కానీ చరిత్ర అంటూ ఒకటి వుంటుంది. ఆ చరిత్ర పుటల్లో ఎవరు ద్రోహులో? ఎవరు సజ్జనులో తేలిపోతుంది.1954 ఉప ఎన్నికల్లో కాంగ్రెసస పార్టీ అంబేద్కర్ ను ఓడించింది నిజం కాదా? అయినా... ప్రతిపక్షాల సహకారంతో అంబేద్కర్ రాజ్యసభ సభ్యులయ్యారు. ఇది మరిచిపోయేంత విషయమా?...
సాంకేతిక విజయాలతో సుసంపన్న భారత్
భారత సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిది. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచే మన దేశాన్ని అణ్వాస్త్ర దేశంగా ప్రకటించడమేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా సంతకం చేశారు. ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్ క్షిపణులు, ఆపరేషన్లు కూడా విజయవంతంగా...