ఇస్లాంను కించపరచినందుకు పాకిస్తాన్ లో ఓ క్రైస్తవుడుకి ఉరిశిక్ష 

ఇస్లాంను కించపరుస్తూ తన పై అధికారికి మెసేజీలు చేసినందుకు పాకిస్తాన్ లోని ఒక క్రైస్తవునికి లాహోర్ సెషన్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆసిఫ్ ఫైర్వెజ్ మాసిహ్ (37) అనే క్రైస్తవుడు లాహోర్ లోని ఒక కర్మాగారంలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా కర్మాగారంలో పని చేసే ఒక అధికారి, క్రైస్తవుడైన మాసిహ్ ను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడు. మాసిహ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పైగా ఇస్లాంను అవమానిస్తూ సదరు అధికారి సెల్ ఫోన్ కు సందేశాలు పంపాడు. దీంతో దైవదూషణ...

బీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

బీమా కోరేగావ్ ఎల్గర్ పరిషత్ సంబంధించిన కేసులో  ఓ మహిళ తో సహా ముగ్గురు వ్యక్తులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. సాగర్ తత్యారామ్ గొర్ఖే(32), రమేష్ మురళీధర్ గై చోర్ (36) లను సోమవారం అరెస్టు చేయగా, జ్యోతి రాగోబా జగాప్త్(33) ను  మంగళవారం అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. అరెస్టయిన ముగ్గురు పూణే కు  చెందినవారు. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ, సిపిఐ( ఎం) అనుబంధ సంస్థ అయిన కబీర్ కాలా మంచ్ సభ్యులు.      ఈ కేసు  2017...

“మిషన్ విశ్వాస్” చేపట్టి కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న స్వయం సేవకులు

మహారాష్ట్రలోని నాగపూర్ లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయించాలని  నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నందున వారిని పర్యవేక్షించడం తో పాటు విస్తృత స్థాయిలో పరీక్షలు చేయడానికి సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సామాజిక సంస్థల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పిలుపు మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోక కళ్యాణ్...

హైపర్ సోనిక్ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత్ 

అత్యాధునిక సాంకేతిక సాధనలో భారత్ అసాధారణ విజయం సాధించింది. అగ్రరాజ్యాలకి సొంతమైన హైపర్ శానిక్ టెక్నాలజీ(శబ్దం కంటే వేగంగా ప్రయాణించే వాహనాన్ని రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం)ని ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా సొంత గానే అభివృద్ధి చేసి తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ)  హైపర్ సానిక్ టెస్ట్ డేమోనిస్ట్రేషన్ వెహికిల్ (HSTDV) (స్క్రామ్ జెట్) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని బాలాసోర్ లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ వాహనం శబ్దంకంటే ఆరు రేట్ల వేగంతో దూసుకుపోయింది....

సేవాభారతి ఆధ్వర్యంలో ప్లాస్మా దానం

సేవాభారతి కర్నూలు ఆధ్వర్యంలో సంఘమిత్ర మార్గదర్శనంలోకర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు ప్రాణ దానం నిమిత్తం నంద్యాల సంఘమిత్ర నుండి ఈ రోజున  నలుగురు ప్లాస్మా దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. సురేష్, నాగ సుధాకర్, రఘు, సూర్యతేజ అనే వ్యక్తులు కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడు నిమిత్తం ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు వచ్చారు. డా. లక్ష్మయ్య, డా. నేట్ల మహేశ్వర రెడ్డి ల పర్యవేక్షణలో ఈ ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం జరిగినది. సంఘమిత్ర...

ఫ్రాన్సులో ప్రవక్త కార్టూనుకి పాకిస్తాన్ లో నిరసనలు

2015 లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడికి కారణమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ తిరిగి ముద్రించనున్నట్లు చార్లీ హెబ్దో ప్రకటించింది. దీంతో  పాకిస్థాన్ లో వేలాది మంది ముస్లింలు నిరసన చేపట్టారు. ఫ్రాన్స్ కు మరణమే అంటూ, ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ  నినాదాలు చేశారు. దేశంలో ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. ప్రవక్తను అగౌరవపరిస్తే సహించేది లేదని ఫ్రెంచ్ కు బలమైన సమాధానం చెప్పాలని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 జనవరి 8న ప్యారిస్ లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి...

నిబంధనలు అతిక్రమించిన క్రైస్తవ సంస్థల విదేశీ విరాళాల సేకరణ లైసెన్సులు రద్దు 

చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఆరు స్వచ్ఛందం సంస్థలపై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విదేశీ విరాళాల సేకరణ (సవరణ) చట్టం ప్రకారం ఆ సంస్థలకున్న లైసెన్సులు రద్దు చేసింది. వీటిలో నాలుగు క్రైస్తవ సంస్థలు ఉండటం గమనార్హం. అంతే కాకుండా అమెరికా నుండి విరాళాలు పొందుతున్న మరో రెండు సంస్థలపై నిఘా ఉంచినట్టు కేంద్ర హోంశాఖ ముఖ్య అధికారిని ఉటంకిస్తూ  ది హిందూ కథనం ప్రచురించింది. ఆ కధనం ప్రకారం లైసెన్సులు రద్దైన క్రైస్తవ సంస్థల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థలు.. ఎక్రియోసోక్యులిస్ నార్త్-వెస్ట్రన్ గాస్నార్ ఎవాంజలికల్ అసోసియేషన్, నార్తరన్...

బెంగళూరు అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక.. బయటపడ్డ ఆందోళన కలిగించే వాస్తవాలు

ఆగస్టు, 11, 2020 న ఫేస్ బుక్ వివాదంతో చెలరేగిన అల్లర్లకు సంబంధించి వాస్తవ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప కు సమర్పించింది. కమిటీ సభ్యులు ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి స్థానికులతో, బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ నివేదికలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం ఎడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి, డిజిపి, పోలీస్ కమిషనర్ లతో సమావేశం ఏర్పాటు...

రాజ్యాంగ మౌలిక  స్వరూపం  ఏర్పాటు కేసులో కీలక పాత్ర పోషించిన స్వామి కేశవానంద భారతి శివైక్యం 

రాజ్యాంగ మౌలిక స్వరూపం  ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక కేసులో ప్రధాన పిటిషనర్, ఆధ్యాత్మిక గురువు స్వామి శ్రీ కేశవానంద భారతి శివైక్యం చెందారు.  ఆయన వయస్సు 79 సంవత్సరాలు. శ్రీ కేశవానంద భారతి కేరళలోని ఎడనీర్ మఠంలో తన పార్థివ దేహాన్ని విడిచిపెట్టారు. మంజాతాయా శ్రీధర్ భట్, పద్మావతి దంపతులకు జన్మించిన శ్రీ కేశవానంద భారతి తన 19వ ఏట సన్యసించి, అనంతరం 1960లో ఎడనీర్ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల శిష్యపరంపరలో ముఖ్యులైన శ్రీ తోటకాచార్యుల వారు ఏర్పాటు చేసిన ఈ మఠానికి 1200 ఏళ్ల చరిత్ర ఉంది.    కేరళ భూసంస్కరణల...

చైనా సరిహద్దు ప్రాంతంలోని కీలక ప్రదేశాలు తిరిగి స్వాధీనం చేసుకున్న భారత్ 

భారత్-చైనా రక్షణ రేఖ వెంబడి ఇంతకాలం చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతాలను భారత్ కు చెందిన ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ దళాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఏ.ఎన్.ఐ వార్తాసంస్థను ఉటంకిస్తూ OpIndia ప్రచురించిన కధనం ఈ విధంగా ఉంది. రక్షణ రేఖ వెంబడి చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతమైన ఫుర్చుఖ్ లోకి చొచ్చుకుపోయిన భారత్ దళాలు అక్కడి స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి. యుద్ధపరంగా ఇది ఇరు దేశాలకు ఎంతో కీలకమైన ప్రాంతం. భారత్ కు చెందిన ఈ ప్రాంతం అనేక ఏళ్లుగా చైనా ఆక్రమణలో ఉంది. తాజాగా ఈ మధ్య కాలంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు...