ఆఫ్ఘనిస్తాన్: విశ్వవిద్యాలయాల్లోకి మహిళా విద్యార్థులను నిషేధించిన తాలిబన్లు… కొనసాగుతున్న నిరసనలు
తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా మహిళా విద్యార్థులను విశ్వవిద్యాలయాల రాకుండా తాలిబన్లు వారికి నిషేధం విధించారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. జలాలాబాద్‌లోని నంగర్‌హర్ విశ్వవిద్యాలయం, ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ విశ్వవిద్యాలయంలో అనేక మంది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేసి మహిళలకు సంఘీభావం తెలిపారు. బాలికల విద్యపై తాలిబాన్ నిషేధాన్ని నిరసిస్తూ విద్యార్థినులకు సంఘీభావం తెలుపుతూ యూనివర్సిటీలోని విద్యార్థులు తమ పరీక్షకు దూరంగా వెళ్తున్నారని నంగర్‌హర్ యూనివర్సిటీలో నిరసనల వీడియోను జర్నలిస్టు అబ్దుల్‌హాక్...
పాకిస్థాన్ లో పెరిగిన పేదరికం
35.7% పెరిగిన పేదరికం రేటు అంతర్జాతీయ పేదరిక సూచికలోని 116 దేశాలలో 92వ స్థానం పాకిస్థాన్‌లో పేదరికం రేటు 35.7 శాతం పెరిగిందని, తినుబండారాల ధరలు 20 నుంచి 31 శాతం మేర పెరిగాయని పాక్ ప్రాంతీయ మీడియా, ఇంతేఖాబ్ డైలీ నివేదించింది. అంతర్జాతీయ పేదరిక సూచిక జాబితాలోని 116 దేశాలలో పాకిస్థాన్ 92వ స్థానంలో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని పాకిస్థాన్‌కు సూచించినట్లు ఒక...
రైతు సంక్షేమమే ధ్వేయంగా BKS పోరాటం
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో BKS ఆధ్వర్యంలో రైతుల ర్యాలీ రాకేష్ టికాయత్ ఒక మోసగాడు: రైతుల రైతు సమస్యల పరిష్కారం కోసం, రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఆధ్వర్యంలో సోమవారం సెంట్రల్ ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 50,000 మంది రైతులు సమావేశమయ్యారు. సుమారు 700 నుండి 800 బస్సులు, 3,500 నుండి 4,000 ప్రైవేట్ వాహనాల్లో రైతులు మైదానానికి చేరుకున్నారు. నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని...
కాశ్మీర్: జమాతే ఇస్లామీకి చెందిన వంద కోట్ల ఉగ్రవాద నిధుల స్వాధీనం
తీవ్రవాద నిధులకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) శనివారం చేపట్టిన సోదాల్లో బారాముల్లా, బండిపోరా, గందర్‌బల్, కుప్వారాతో సహా పలు జిల్లాల్లో నిషేధిత జమాతే ఇస్లామీకి చెందిన వంద కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 8, కేంద్ర హోం శాఖ 28-ఫిబ్రవరి-2019 తేదీ నాటి నోటిఫికేషన్ నెం. 14017/7/2019 ప్రకారం ఉగ్రవాద నిధులను సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌లు గుర్తించిన తర్వాత ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంగణాల్లో ప్రవేశించడానికి, లేదా...
గోవా చరిత్ర
-ప్రదక్షిణ పురాతన ఇతిహాసం – రాజవంశాల చరిత్ర గోవా కొంకణ ప్రాంతం, ఇది హిందూ పురాణాల ప్రకారం `పరశురామ క్షేత్రం’ గా పిలవబడుతుంది. శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు, కన్యాకుమారి నుంచి సప్తకొంకణ వరకు గల భూమిని, సముద్రం నుంచి వెలికితీసాడని సహ్యాద్రిఖండం పురాణగాథ, అందుకే ఇది పరశురామభూమిగా ప్రసిద్ధి పొందింది. దాదాపు 12౦౦౦ సంవత్సరాల క్రితం, భూమి టెక్టానిక్ కదలికల మూలంగా సముద్రంనుంచే భారత పశ్చిమ తీరం, దక్ఖన్ పీఠభూమి ఏర్పడ్డాయని భూగర్భ శాస్త్రం...
వనవాసీ గూడెంలల్లో సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్న సార్మడీలకు, పటేల్లకు సత్కారం
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల లోని 200 గ్రామాలకు చెందిన సార్మడీలకు, పటేల్లకు డిసెంబర్ 15,17 తేదీల్లో ఉట్నూర్ లో చందుపల్లిలో ఘనంగా సత్కరించారు. వనవాసీలలో గోండులు, పరధానులు, కొలాములు, నాయకపోడులు, ఆంధ్ లు, తోటిలు.. మొదలైన తెగల పెద్దలు ఎటువంటి భేదభావాలు లేకుండా, కలిసి ఐక్యంగా పాల్గొనటం విశేషం. ఉట్నూర్ ఎంపిటిసి జైవంతరావు, బేలా సార్మడి సోన్ రావుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది వనవాసీలు తరలివచ్చారు. గోండులలో జన్మించిన మహనీయులైన కొమరంభీమ్, రాంజీగోండు,...
మరోసారి పాక్ కు బుద్ధి చెప్పిన భారత్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనాగరికంగా వ్యక్తిగత విమర్శలకు దిగిన తీరును భారత్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. న్యూయార్క్ వేదికగా బిలావల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిది ఆరిందమ్ బాగ్ని గట్టిగా తిప్పికొట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాక్ ' ఉగ్రవాద కేంద్రం'గా మారిందంటూ గురువారం న్యూయార్క్ లోని ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పరోక్షంగా ఎండగట్టారు. ప్రపంచమంతా పాకిస్థాన్ ను...
తవాంగ్ ఘర్షణ: దీర్ఘకాలం తిష్ట వేసేందుకు డ్రాగన్ కుట్ర… తిప్పికొట్టిన భారత సైన్యం
సామగ్రిని అక్కడే విడిచివెళ్లిన చైనా సైన్యం తవాంగ్ సెక్టార్‌కు సమీపంలోని యాంగ్‌స్టే ప్రాంతంలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత, తమను తాము కాపాడుకోవడం కోసం చైనా ఆ ప్రాంతం నుండి వైదొలిగి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) అవతలి వైపునకు వెళ్లినప్పుడు చైనా దళాలు వదిలిపెట్టిన స్లీపింగ్ బ్యాగ్‌లు, ఇతర పరికరాలను భారత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నివేదికల ప్రకారం, చైనా సైన్యం వదిలిపెట్టిన స్లీపింగ్ బ్యాగ్‌లు బహిరంగ ప్రదేశాలలో విపరీతమైన చల్లని ఉష్ణోగ్రతలలో జీవించడానికి సహాయపడతాయి....
మారుపేరుతో లవ్ జిహాద్… పెళ్లికి ఒక రోజు ముందు అరెస్టయిన హసీన్ సైఫ్
మారుపేరుతో యువతిని మోసం చేసి లవ్‌జీహాద్ కు పాల్పడ్డ 23 ఏళ్ల యువకుడిని పెళ్లికి ఒక రోజు ముందు పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రీకి చెందిన హసీన్ సైఫీ అనే వ్యక్తి ఆశిష్ ఠాకూర్ అనే మారుపేరుతో ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ మహిళ ఉద్యోగం మానేయడంతో నిందితుడు దాన్ని అవకాశంగా తీసుకుని ఆమెకు...
ఘర్‌వాపసీ: సనాతన ధర్మంలోకి 80 మంది ముస్లింలు
12 సంవత్సరాల క్రితం బలవంతంగా మతంమార్చిన SP నాయకుడు ఆజాం ఖాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లోని 12 కుటుంబాలకు చెందిన 80 మంది ప్రజలు ఇస్లాంను విడిచిపెట్టి, బాగ్రాలోని యోగ్ సాధనా ఆశ్రమంలో మహంత్ స్వామి యశ్వీర్ మహరాజ్ సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 80 మంది సభ్యులు తాము ఇంతకు ముందు హిందువులమేనని, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేత ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేసి బలవంతంగా మతం మార్పిడి చేశాడని వారు...