భారతీయ నౌకాదళానికి శివాజీ మహరాజ్ స్ఫూర్తి.. రూపు మార్చుకున్న పతాకం

భారత నౌకాదళానికి ఛ‌త్ర‌ప‌తి శివాజీ స్ఫూర్తిని నింపే స‌రికొత్త ప‌తాకాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్రారంభించారు. శుక్ర‌వారం కొచ్చిలో ఐఎన్ఎన్ విక్రాంత్ ప్రారంభం త‌ర్వాత ప్ర‌ధాని నౌక‌ద‌ళం ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇప్పటివరకు భారత నావికా దళం జెండా బానిసత్వ చిహ్నాన్ని మోసిందని, దాని స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో కొత్త దానిని తీసుకొచ్చినట్లు తెలిపారు. భారత నావికా దళం నూతన పతాకంలో వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్‌ను తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు...

ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి

‘An Agenda for Unity’ పేరుతో ప్రచురితమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీ ఇంటర్వ్యూ తెలుగు అనువాదం… ప్ర‌శ్న : వెయ్యి సంవత్సరాలకు పైగా అనేక దండయాత్రలను, విభజనను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ తన మౌలిక ఐక్యతను, నాగరికతను, వారసత్వాన్ని నిలుపుకుంది. ఈ ఫలితానికి ఏ ఏ అంశాలు దోహదపడ్డాయని మీరు అనుకుంటున్నారు? జ‌వాబు : మనం భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, ఒక సత్యాన్ని గ్రహిస్తాం. మన దేశంలోని రాజ్యాలు అనేకమంది రాజుల పాలనలో ఉన్నప్పటికీ, ప్రతి రాజ్యమూ ఈ విశాల...

వినుర భారతీయ వీర చరిత

చాణక్య చంద్రగుప్త యవనులనెదిరించి యమపురికి విసర చక్రవర్తిగాను చంద్రగుప్తు మలచి గురువు గాను నిలచె చాణక్యుడు వినుర భారతీయ విమల చరిత భావము భారతదేశంపై దాడికి వచ్చిన యవనులను ఎదిరించడానికి చంద్రగుప్తుడు అనే బాలుని చేరదీసారు. చంద్రగుప్తునికి యుద్ధ విద్యలు నేర్పారు. వీరునిగా నిలిచిన చంద్రగుప్తునితో యవనులను తిప్పి కొట్టినటువంటి వీర గురువు చాణక్యుని చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్

గర్భాశయ క్యాన్సర్ నివార‌ణ‌కు భార‌త్ లో దేశీయ వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం భారతదేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన టీకా సెర్వైక‌ల్‌ష‌(CERVAVAC)ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యాక్సిన్ ను రూపొందించిన DBT, BIRAC లకు ముఖ్యమైన రోజు అని అన్నారు. వ్యాక్సిన్ త‌యారీతో ఆత్మనిర్భర్ భారత్ దిశ‌గా భారత్ మరొక అడుగు వేసింద‌న్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆద‌ర్ సి.పూనవాల‌, ఇతర ప్రముఖ శాస్త్రవేత్తల‌సమక్షంలో క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (qHPV) వ్యాక్సిన్‌ను శాస్త్రీయంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు....

VIDEO: కలమే ఖడ్గం.. నిజాం నిరంకుశత్వంపై పోరాటం షోయబుల్లా ఖాన్

షోయబుల్లా ఖాన్ స్వాతంత్ర్య సమరయోధులు, నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయులు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను రచించారు. తేజ్ పత్రికను నిజాం ప్రభుత్వం నిషేధించింది. అనంతరం కాలంలో స్వీయ నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను షోయబుల్లా ఖాన్ స్థాపించారు. నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడమే సరైన నిర్ణయమని తెలుపుతూ హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు రూపొందించిన ఒక పత్రాన్ని షోయబుల్లా ఖాన్ తన...

భార‌త్ తొలి దేశీయ విమాన వాహక నౌక INS విక్రాంత్ ను ప్రారంభించిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ

భారతదేశం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర‌వారం కేరళ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ INS విక్రాంత్ 'పెద్దది, గొప్పది, విభిన్నమైనది ప్రత్యేకమైనది' అని అభివర్ణించారు. భారతదేశం ఇప్పుడు తమ సొంత విమాన వాహక నౌకలతో ఎలైట్ లీగ్‌లో చేరిందని 'అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మరో అడుగు' వేసిందని అన్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఆటోమేషన్ సౌకర్యాలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఐఎన్ఎస్ విక్రాంత్...

“మతమార్పిడులను అడ్డుకునేందుకు చట్టాలను ఉపయోగించుకోవాలి”

భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల్లు వేదికగా ఇంటర్నెట్ ఆయుధంగా మతమార్పిడిపై పోరాటం చేయాలని కోరారు. సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్(CSIS), లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) సంయుక్త సహకారంతో సంవిత్ ప్రకాశన్, చేతన స్రవంతి ఆధ్వర్యంలో సంవిత్ ప్రకాశన్ ప్రచురించిన 'మతం పేరుతో అక్రమాలు - న్యాయపోరాటానికి మార్గాలు', 'గోవా ఇంక్విజిషన్' పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం...

వినుర భారతీయ వీర చరిత

పురుషోత్తముడు విశ్వజేత ననుచు విశ్వమంత తిరిగి విశ్వగురువు పోర విసిగి జీల మునను పట్టుబడెను మన పురుషోత్తమున్ వినుర భారతీయ వీర చరిత భావము కొన్ని దేశాలను జయించగానే నేనిక విశ్వవిజేతను అవుతాను అంటూ విర్రవీగాడు అలెగ్జాండర్. భారతదేశంపైకి దాడికి బయలుదేరినాడు. అంతటి అలెగ్జాండర్‌ను జీలం అనే చిన్న రాజ్యానికి రాజైనటువంటి పురుషోత్తముడు ఎదిరించాడు. విశ్వవిజేతను అవుతానని విర్రవీగిన అలెగ్జాండర్‌ను ఓడించిన వీరుడు పురుషోత్తముని చరిత విను ఓ భారతీయుడా! -రాం న‌రేష్‌

శీఘ్రగతిన భారత్ పురోగతి: తొలి త్రైమాసికంలో GDP 13.5% వృద్ధి

దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్ జరుపుకుంటున్న వేళ కీలకమైన స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) అంశంలో గణనీయమైన వృద్ధిని భారత్ నమోదు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను 13.5 శాతంగా GDP నమోదైంది. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికానికి GDP 4.1 శాతంగా ఉందని బుధవారం (ఆగస్టు 31) సంయుక్తంగా వెలువరించి డేటాలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇమ్‌ప్లిమెంటేషన్ వెల్లడించాయి. భారతీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ సంవత్సరంలో ఇది...

వినుర భారతీయ వీర చరిత

శ్రీరాముడు తండ్రి మాటనొగ్గి తానడవులకేగె ఒకటె మాట బాణమొకటెయనుచు రావణుని వధించి రాముడు నిలచె వినుర భారతీయ వీర చరిత భావము తండ్రి మాటకు కట్టుబడిన పితృవాక్యపరిపాలకుడు, సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్లిన త్యాగధనుడు, ధర్మ రక్షణకు కంకణధారి అయినవాడు, ఒకటే మాట ఒకటే బాణం అని ఆచరించిన సర్వోత్తముడు, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అన్న ఆర్యోక్తిని అనుసరించి రాక్షసాధముడైన రావణుని వధించిన శ్రీ రాముని చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్