కర్తవ్యపథ్‌కు సెప్టెంబర్ 8న శ్రీకారం
రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. రూపురేఖలు మార్చుకున్న ఈ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న సాయంత్రం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీ నగరపాలక సంస్థ (ఎన్ ఎంసీ) ఈ నెల 7న ప్రత్యేకంగా సమావేశమై రాజ్‌పథ్ పేరు మార్పు ప్రతిపాదనపై చర్చించనుంది. బ్రిటిష్ పాలనలో రాజ్‌పథ్ ను కింగ్స్ వే అని పిలిచేవారు. వలసవాద ఆలోచన తీరును ప్రతిబింబించే గుర్తులను చెరిపివేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల...
వేలాదిగా పాఠశాలల అభివృద్ధికి ప్రధాని సంకల్పం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలల అభివృద్ధిగా దిశగా ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 45 మందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పేరిట ఎంపిక చేసే 14,500 పాఠశాలల్లో నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తామన్నారు. కొత్త...
విద్యారంగంలో కృషి జరగాలి : మహానంది క్షేత్ర సమావేశాల్లో విద్యాభారతి పిలుపు
కరోనా కారణంగా విద్యా వ్యవస్థ కాస్త వెనుకబడిందని... తిరిగి దానిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణ అభిప్రాయ పడ్డారు. ఈ దిశగా విద్యారంగంలో కృషి జరగాలని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ విద్యాలయాలు నడుపుతున్న స్వచ్ఛంద విద్యా వ్యవస్థల సమూహం గా విద్యాభారతి వినుతి కెక్కిన విషయం తెలిసిందే. విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర (ఏపీ, తెలంగాణ, కర్నాటక) రెండు రోజుల క్షేత్రీయ సమావేశాలు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో జరిగాయి. విలువలతో...
వినుర భారతీయ వీర చరిత
పంజాబు పంచనదులు పారె పరమ పావనభూమి సింహ విక్రములగు సిక్కు భూమి కర్మ వీరులున్న ధర్మ పంజాబిది వినుర భారతీయ వీరచరిత భావము జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, సింధు అనే ఐదు నదులు ప్రవహించే పుణ్యభూమి. ధర్మరక్షణ కోసం సింహ విక్రములైన సిక్కు వీరులు ఉన్న భూమి. ధర్మ భూమి అయిన పంజాబ్ వీర చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్
ఖైరతాబాద్ వినాయకునికి ఆర్.ఎస్.ఎస్ స్వరార్చన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) భాగ్యనగర్ సంభాగ్ (హైదరాబాద్ - సికింద్రాబాద్) ఆధ్వర్యంలో సోమవారం (05-సెప్టెంబర్) హైదరాబాదులోని అతిపెద్ద వినాయక ప్రతిమైన ఖైరతాబాద్ వినాయకుని సమక్షంలో ఘోష్ నాదంతో స్వయంసేవకులు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో 140 మంది ఆర్.ఎస్.ఎస్ ఘోష్ స్వయంసేవకులు పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు సాగిన ఘోష్ వాదనను ఆలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఘోష్ వాదన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ ప్రాంత, విభాగ్ అధికారులు పాల్గొన్నారు.
రాయ్‌పుర్ లో సెప్టెంబర్ 10నుంచి ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారులతో మూడు రోజుల పాటు జరిగే సమన్వయ సమావేశాలు సెప్టెంబర్ 10నుంచి 12వరకు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరగనున్నాయని ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ జీ అంబేకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ తో పాటు ఐదుగురు సహ సర్ కార్యవాహలు, ఇతర సంఘ ముఖ్య అధికారులు...
ఆర్థిక అవస్తల్లో చైనా : రెండవ భాగం
వికటించిన రుణాల పరపతి విధానం: చైనా బ్యాంకులపై వసూలు కాని బాకీల వలన,అధికమవుతున్న వత్తిడి ‘బ్ల్లూమ్ బెర్గ్’విశ్లేషణ ప్రకారం, ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా, చిన్నవ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా లేవు, ఎందుకంటే, ఆయా చిన్నసంస్థలకు, రుణాలకు సరిపడాహామీ ఇచ్చేందుకు స్థిరాస్తులేవీ లేవు, సరైన ధృవీకరణ గల పరపతి రికార్డులు (credit records)కూడా లేవు. ఆన్హుయి (Anhui) లో ఒక విద్యుత్ వాహనాల పరికరాల తయారీదారు, ఈ వార్తాసంస్థతో మాట్లాడుతూ, రుణాలుతిరిగి చెల్లించేసామర్థ్యం తక్కువగా ఉండటం చేత,వాళ్ళసంస్థకు మంజూరైన బ్యాంకు రుణాలలో, కేవలం 60% మాత్రమే చేతికి...
ఆర్థిక అవస్తల్లో చైనా : మొదటి భాగం
- దిబాకర్ దత్తా పాతాళానికి పడిపోతున్న స్థిరాస్తుల విలువలు, నానాటికి పెరిగిపోతున్న ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య నడుమ ఆర్థిక మందగమనపు సెగ చైనా దేశానికి తాకడం మొదలైంది. చైనాలో ఎవరూ స్వాధీనం చేసుకోని అపార్ట్‌మెంట్లు 5 కోట్లకు మించి ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. అసంపూర్తిగా ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు, ఆస్తులు తనఖా పెట్టినవాళ్ళు ప్రాజెక్టులు అభివృద్ధి చేసేవారికి(డెవలపర్లు) తిరిగి చెల్లింపులు చేయలేని అశక్తత చైనా సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తోంది. నిరుద్యోగానికి సంబంధించిన లెక్కలు నిరాశాజనకంగా, నిస్తేజంగాఉన్నాయి. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం, నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికావ్యయం ఈ...
వినుర భారతీయ వీర చరిత
పుశ్యమిత్రుడు వారి దేశమునకు పారిరి గ్రీకులు పుశ్యమిత్ర ఖడ్గపు రుచి జూసి శుంగ వంశమందు శృంగ సముడితడు వినుర భారతీయ వీర చరిత భావము గ్రీకు దురాక్రమణదారుడు డెమిట్రియస్ నేతృత్వంలో గ్రీకు సేనలు భారతదేశంలో అయోధ్య వరకు చొచ్చుకొని వచ్చాయి. అయినా కానీ పట్టించుకోని మౌర్య చక్రవర్తి బృహద్రథుని దేశ రక్షణ కోసం అతడి మంత్రి పుశ్యమిత్రుడు అంతమొందించారు. డెమిట్రియస్‌కు ఎదురొడ్డి నిలిచారు. పుశ్యమిత్రుని ఖడ్గ ధాటికి తాళలేక గ్రీకు సేన వారి దేశానికి పారిపోయింది. శుంగ వంశములో శృంగ(శిఖర) సమానుడైన పుశ్యమిత్రుని వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా! -రాంనరేష్
‘యువతకు చరిత్రపై అవగాహన కోసం నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు’
చరిత్ర పట్ల తెలంగాణ యువతకు సంపూర్ణ అవగాహన కలిగించడం లక్ష్యంగా ఏడాది పాటు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను నిర్వహిస్తున్నట్టు నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి గారు తెలిపారు. భాగ్యనగరంలో శనివారం (సెప్టెంబర్ 3న) ఏర్పాటు విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా, ప్రజల భాగస్వామ్యంతో, ఎలాంటి డిమాండ్లు లేకుండా, చరిత్ర పట్ల యువతను జాగృతపరచడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇదే సందర్భంగా 28 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కమిటీలో గౌరవ అధ్యక్షులుగా...