RSS Swayamsevak lynched to death by CPM goons in Kannur
Kannur: An RSS Swayamsevak, who was seriously injured in an attack by CPM goons, succumbed to injuries today. Jimnesh, an RSS Swayasevak was attacked in Panunda, in Kannur’s Kuthuparamba. A group of CPM goons brutally lynched Jimnesh and other Swayasevaks, who were on their way back home after attending the Gurudakshina programme organised by the Rashtriya Swayamsevak Sangh. Among the...
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. అంతకుముందు ద్రౌపది ముర్ము.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి పార్లమెంటు సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆదివాసీ...
VIDEO: బాలకృష్ణునికి ‘బురదోత్సవం’
బాలకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేలా, వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఆషాడ మాసపు 11వ రోజున గోవాలో హిందువులు, ఆనందోత్సాహాలతో ఆచరించే వినూత్నమైన ఉత్సవం.. 'బురదోత్సవం'. అక్కడివారు ఈ వేడుకను చికల్ కొలా అని అంటారు. గోవాలోని మర్సెలా గ్రామంలో దేవకీ కృష్ణ దేవస్థానం సమీపంలో ప్రతి యేటా జరిగే ఈ 'బురదోత్సవం'లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ పాల్గొంటారు. చివరగా రావి చెట్టుపైన దహి-హండీని ఛేదించడంతో 'బురదోత్సవం 'ముగుస్తుంది.
గోవాలో బాలకృష్ణునికి భక్తుల వేడుక: ఆటపాటలతో ‘బురదోత్సవం’
బాలకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేలా, వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఆషాడ మాసపు 11వ రోజున గోవాలో హిందువులు, ఆనందోత్సాహాలతో ఆచరించే వినూత్నమైన ఉత్సవం.. 'బురదోత్సవం'. అక్కడివారు ఈ వేడుకను.. 'చికల్ కొలా' అని అంటారు. గోవాలోని మర్సెలా గ్రామంలో, దేవకీ కృష్ణ దేవస్థానం సమీపంలో ప్రతి యేటా జరిగే ఈ 'బురదోత్సవం'లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఆబాలగోపాలమూ ఆ బాలగోపాలుని ఆటలను బురదలో ఆడుతారు. దేహాలకు నూనెను పట్టించిన తర్వాత దేవస్థానంలో మూల విరాట్టును దర్శించుకుంటారు. దేవస్థానంలో జ్యోతి చుట్టూ ప్రదక్షిణం...
నీట చిక్కిన వారిని కాపాడిన సేవాభారతి స్వయంసేవకులు
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు గేట్లు అన్ని తెరిచి నీటిని క్రిందికి వదిలివేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ధర్మపురి, దండెపల్లి, కోటపల్లి, చెన్నూరు మంచిర్యాల పట్టణాలలోకి నీళ్ళు వచ్చాయి. NTR నగర్, పద్మశాలి నగర, గణేశ్ నగర్, సంజీవ నగర్, రెడ్డి కాలనీ, వికాస్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు వచ్చి NTRనగర్ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. ప్రజలు కట్టుబట్టలతో బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు ఒక బృందంగా ఏర్పడి...
వినుర భారతీయ వీర చరిత
ప్రీతిలతా వడ్డేదార్ తెల్ల వాని పైన గుళ్ళ వర్షముతోడ ప్రీతి లతిట చెలగె భీకరముగ చిట్టగాంగునందు చిరుత తీరు గనుము వినుర భారతీయ వీర చరిత భావము భారతీయులను కుక్కలు అని అవమానించిన బ్రిటిషు వారిని తుదముట్టించేందుకు స్వాతంత్ర్ర్ర్య సమరయోధురాలు ప్రీతిలతా వడ్డేదార్ తన బృందంతో కలిసి బ్రిటిషు వాని క్లబ్బుపై దాడి చేసి గుళ్ళ వర్షం కురిపిస్తే తెల్లవాడు తెల్లబోయాడు. చిట్టగాంగునందు చిరుత వోలె చెలగిన వీరవనిత చరిత విను ఓ భారతీయుడా! చరిత్ర 1932 లో తూర్పు బెంగాల్‌లో స్వాతంత్ర్య ఉద్యమం తారాస్థాయిని చేరుకుంది. అప్పటికే ఆంగ్ల పాలకులు వందేమాతరం దెబ్బతగిలి...
‘అమ్మ’కు బోనాలు.. జగతికి భాగ్యాలు…
భాగ్యనగరితో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఆషాడ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లు సీదాసాదాగా జరుపుకున్న సంబరాలను ఈ ఏడాది అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. ఈ నెల (జూలై) మొదటి ఆదివారం గోల్కొండ జగదంబిక ఆలయంలో ప్రారంభమైన బోనాలు, రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, మూడవ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నాలుగవ ఆదివారం పాతబస్తీ లాల్ దర్వా మహంకాళి అమ్మవారి సన్నిధిలో సంబరాలతో బోనాలు ముగుస్తాయి. పల్లెలలో మఖ కార్తెలో బోనాలు జరుపుకుంటారు. తెలంగాణ...
వినుర భారతీయ వీర చరిత
ఖుదీరాం బోస్ మాతృ స్వేచ్చ కొరకు మరి మరి సిద్దమై ఉరిని ముద్దిడుచును యువకు నిల్చె హృదినిగెల్చినట్టి ఖుదిరాము డితడేను వినుర భారతీయ వీర చరిత బాలుడైనగాని బాంబువేసెను జూడు ఉరినివేయ తాను మురిసిపోయె హృదిని గెల్చినట్టి ఖుదిరాము డితడేను వినుర భారతీయ వీరచరిత భావము తల్లి భారతి స్వేచ్చ కోసం మళ్ళీ మళ్ళీ ఉరికి సిద్ధమే అంటూ ముందుకు వచ్చి ఉరిని ముద్దాడి మన హృదయాలను గెలుచుకున్న యువ కిశోరం ఖుదీరాం బోస్ ఇతడే. ఈ వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా! -రాంనరేష్
వినుర భారతీయ వీర చరిత
అశ్ఫాకుల్లా ఖాన్ కాకొరినిట దోచె కరపత్రములొదిలి దేశ స్వేచ్చ కొరకు దేహ మిచ్చె అల్ప వయసు నందు అశ్ఫాకు కదిలెను వినుర భారతీయ వీర చరిత భావము దేశమాత స్వేచ్ఛ కొరకు 23 ఏళ్ళ చిన్నవయసులో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకారు. బ్రిటిషువారిని బెదరగొట్టడానికి కరపత్రాలను పంచారు. రాంప్రసాదు బిస్మిల్‌తో కలిసి విప్లవోద్యమానికి ధనసేకరణ కోసం కాకోరీ రైలు దోపిడీ చేశారు. మూడు సంవత్సరాల అనంతరం మిత్ర ద్రోహం కారణంగా బ్రిటిషువారికి దొరికిపోయారు. 27 ఏళ్ళ చిరు ప్రాయంలో ఉరికంబమునెక్కారు. దేశామాత స్వేచ్ఛ కొరకు దేహమిచ్చిన అశ్ఫాకుల్లా ఖాన్ వీర చరిత విను...
VIDEO: తెల్లదొరతనంపై గరిమెళ్ళ సమర గీతం
తెల్లదొరలను వణికించిన `మాకొద్దీ తెల్లదొరతనము` గీతం అపూర్వ దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. స్వతంత్ర సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణకు పర్యాయపదం. బ్రిటీష్‌వారు తనను నిర్బంధించినప్పడు "ధర్మనిర్వహణలో భాగంగా జైలుకు వెళుతున్నాను. నా శరీరం నిర్బంధానికి గురైనప్పటికీ సాహిత్యం ద్వారా నా ఆత్మను దేశం మీదకి వదిలేశాను. ఈ దుర్బల శరీరం కంటే నా పాట శక్తిమంతమైనది. దానిని ఆంగ్లేయులు తమ ఉనికికే ప్రమాదమని భావించి నన్ను బంధించినా నా పాట ద్వారా ప్రజల మధ్య ఉంటాను` అని గరిమెళ్ళ సత్యనారాయణ చాటి చెప్పారు.