ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో ముందడుగు.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్ గుర్తింపు

ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఇటీవల జరిగిన పుల్వామా దాడితో పాటు దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల్లో ప్రమేయం ఉన్న కీలక సూత్రధారి, పాకిస్థాన్ కు చెందిన మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భద్రతా మండలి విధించే ఆంక్షల జాబితాలో మసూద్ అజార్ పేరు చోటుచేసుకుంటుంది. మసూద్ అజార్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అనేక ఏళ్లుగా భారత్ చేస్తున్న డిమాండ్ ను ఐక్యరాజ్య సమితి భద్రతా...

ఈవీఎం పరికరాల హ్యాకింగ్ సాధ్యం కాదు – ఈ.సీ.ఐ.ఎల్ మాజీ సీఎండీ సుధాకర్

ఈవీఎం పరికరాలను టాంపరింగ్, హ్యాక్ చేసేందుకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదనీ, వాటిలో నిక్షిప్తం చేసిన సాఫ్ట్వేరులో మార్పులు చేయడం అసాధ్యం అని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి పి. సుధాకర్ స్పష్టం చేశారు. ఈవీఎం పరికరాన్ని తెరచి చూసేందుకు ప్రయత్నిస్తే వాటంతట అది పనిచేయడం ఆగిపోతుందని, ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే వాటికవే సరిచేసుకుంటాయని ఆయన వివరించారు. మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం మెకాస్టర్ ఆడిటోరియంలో 'ద ఇనిస్టిటూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజినీర్స్' (IETE) హైదరాబాద్ విభాగం ఆధ్వ్యర్యంలో ఏర్పాటు చేసిన “ఎలక్ట్రాన్ వోటింగ్ మెషిన్స్ ఇన్ ది...

శ్రీలంక పేలుళ్లకు కేరళ మూలాలు? ఎన్.ఐ.ఏ దాడుల్లో పలువురు అరెస్ట్

శ్రీలంకలో ఇటీవల జరిగిన  ఉగ్రవాద పేలుళ్ల తాలూకు మూలాలు కేరళలో లభ్యమవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ కేరళలోని కసర్గడ్, పలాక్కోడ్ ప్రాంతాలలో జరిపిన దాడుల్లో ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సభ్యులను సమకూర్చే వ్యక్తులతో వీరు నిరంతరం సంబంధాలు కలిగివున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్  వార్తా కధనం ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి . ఆషిక్, ఇస్మాయిల్, సలావుద్దీన్, జాఫర్ సాధిక్, షాహుల్ హమీద్, షంషుద్దీన్. వీరంతా కోజికోడ్...

26th Annual Day-Silver Jubilee Celebrations of Vaidehi Ashram

`Vaidehi ashram’ – a girls’ home, a project of the service organization Seva Bharathi, had it’s 26th anniversary celebration, and completion of 25 years Silver Jubilee on 28th April 2019 in the ashram premises at Saidabad, Hyderabad. Vaidehi Ashram the home for 150 girls who were either orphaned or destitute. The ashram takes care of the education of the...

‘వైదేహి ఆశ్రమం’ 26 వ వార్షికోత్సవం

భాగ్యనగర్: సేవా భారతి ప్రకల్పం ఆధ్వర్యంలో సైదాబాద్ లో  నడుస్తున్న ‘వైదేహి ఆశ్రమం’ 26 వ వార్షికోత్సవం 28-ఏప్రిల్ ఆశ్రమ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. సాయంత్రం 6 గం||లకు ప్రారంభమైన కార్యక్రమాన్ని తిలకించడానికి భాగ్యనగర్ నలుమూలల నుండి అనేక మంది పురప్రముఖులు వచ్చారు. వైదేహి ఆశ్రమము ప్రారంభమయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా  కార్యక్రమంగా జరిగిన ఈ కార్యక్రమములో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. వేదికనలంకరించిన విశిష్ట అతిథులు అందరూ మహిళలు కావడం ఒక విశేషం. కార్యక్రమంలో శ్రీమతి. M. బాలాలత గారు IAS (డిప్యూటి డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్,...

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల పై ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థుల సంతాప సభ

తెలంగాణ ఇంటర్మీడియట్  ఫలితాలలో జరిగిన అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకున్న  విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఏప్రిల్ 27 నాడు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో విద్యార్థుల సంతాప ర్యాలీ,  శ్రద్ధాంజలి సభ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆశిష్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహన్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంటర్ ఫలితాలు అవకతవకల వల్ల 19 మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం...

“Islamic Terrorism is a global challenge, India & Israel can come together to counter it” – Mukunda CR

Bengaluru: Symbol of Bharat-Israel cultural ties, Narada Muni’s (Itamar Oren), punyatithi was observed at his samadhi sthal at Gonikoppa in Kodagu, Karnataka, in a unique way by organizing a day long Bharat-Israel symposium. Narada Muni’s samadhi sthal is located on a land donated by Kuppanada Raja and Chhayaa Nanjappa for the cause. The symposium was attended by a gala...

హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసు నిందితుడి అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా ఆరెస్సెస్, ఇతర సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసులో పురోగతి లభించింది. ఈ హత్యలకు సంబంధించి కీలక నిందితుడు అహ్మద్ షరీఫ్ అలియాస్ లష్కర్ మొహల్లాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం మైసూరులో అరెస్ట్ చేశారు. 2016 మైసూరు సమీపంలోని క్యాతమరణహళ్లిలో రాజు అనే హిందూ కార్యకర్త హత్యకు సంబంధించి పోలీసులు చేస్తున్న విచారణ సందర్భంగా మిగిలిన హత్య ఘటనల్లో కూడా నిందితుడు అహ్మద్ షరీఫ్ పాత్ర ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. లష్కర్ మొహల్లా ప్రాంతానికి చెందిన  అహ్మద్ షరీఫ్...

శోభాయాత్రపై దాడి ఘటన: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయపై చర్యలు తీసుకోవాలి – వి.హెచ్.పి

నిజామాబాద్ లో ఈ నెల 19న జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్ర పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన నగర పోలీస్ కమీషనర్ కార్తీకేయను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూపరిషద్ డిమాండ్ చేసింది. ఈ ఘటన పై నేడు (26-ఏప్రిల్) హైదరాబాద్ లో జరిగిన పత్రిక విలేఖరుల సమావేశంలో వి.హెచ్.పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు, అధికార ప్రతినిది శ్రీ శశిధర్, మాట్లాడుతూ.. హనుమాన్ శోభాయత్రపై ముష్కరులు దాడికి పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు...

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేస్తాం.. ఆత్మహత్యలు చేసుకోవద్దు – ఏబీవీపీ వినతిపత్రంపై గవర్నర్ స్పందన

ఇటీవల ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల పరిశీలనతో చోటుచేసుకున్న అవకతవకలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బృందం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జవాబు పత్రాల పరిశీలనలో వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక మంది విద్యార్థుల మార్కులు గల్లంతయ్యాయి. సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష రాయగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయినట్టు ఫలితాలు వచ్చాయి. ఈ తప్పిదం కారణంగా 22 మంది పరీక్ష రాసిన...