వినుర భారతీయ వీర చరిత

బీనాదాస్ బెబ్బులయ్యి గాల్చె బెంగాల్ గవర్నరున్ భీతి వదిలి చెలగె బీనదాసు బోసు బాట నడిచి పోరు సల్పె వనిత వినుర భారతీయ వీర చరిత భావము స్వరాజ్య సమరయోధురాలు బీనాదాస్ 21 సంవత్సరాల వయస్సులో ఆంగ్లేయులపై పులి లాగా చెలరేగారు. 1932లో నాటి బెంగాల్ బ్రిటీష్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా ప్రేరేపితులైనారు. 1940లో మరోసారి జైలు పాలైనారు. అటువంటి వీర వనిత బీనాదాస్ చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్

VIDEO: ఆంధ్రా భగత్ సింగ్ ప్రతివాది భయంకర వెంకటాచారి

బాంబులు పేల్చడంతో ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన స్వరాజ్య సమర యోధులు ప్రతివాది భయంకర వెంకటాచారి. స్వరాజ్యం కోసం పోరాడుతున్న ప్రజలను దారుణంగా హింసిస్తున్న ముస్తాఫ్ అలీఖాన్ లాంటి పోలీసు అధికారుల పని పట్టాలనుకున్నారు. తమ రహస్య కార్యకలాపాలను కప్పిపుచ్చుకోవడానికి CHS చారి అండ్ కంపెనీ అనే ఒక వ్యాపార సంస్థను కాకినాడలో నెలకొల్పారు. ముస్తాఫ్ అలీఖాన్‌ను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ముస్తాఫ్ ఖాన్ ఉప్పుటేరు మీదుగా రాకపోకలు సాగించే బోటులో బాంబు పేల్చడానికి ముహూర్తం పెట్టారు. 1933 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన బోటులో...

Indian Polity

-Nanda Kumar  Some Intellectuals believe that India got Freedom from Colonists, this is NOT true.Therefore, it is important & duty of a every citizen to remember our History, especially the current generation.People who are born after 1947, have not gone through the hardships which our Freedom Fighters have gone through. For that we need to start understanding the true meaning...

UPI సేవలు ఉచితమే: కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలపై భారత ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు విధించదు. UPI లావాదేవీలపై సర్వీస్ ఛార్జి విధించే అవకాశం ఉందంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తోసిపుచ్చింది. UPI సేవలు ఉచితమని ఒక ట్వీట్‌లో పేర్కొంది. "UPI డిజిటల్ రూపేణా ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నది. ప్రజలకు చక్కగా ఉపకరిస్తున్నది. ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదక రాబడులను సమకూరుస్తున్నది. UPI సేవలపై ఏదేని ఛార్జీలు విధించాలనే అంశం ప్రభుత్వ పరిగణనలో లేదు. ఖర్చుల పట్ల సర్వీస్...

మన్యంలో మహోదయం

అల్లూరి ఉద్యమానికి నూరేళ్లు – కల్హణ వలస పాలన లేదా సామ్రాజ్యవాదపు విషపుగోళ్లు ఒక వర్గం ఆత్మ విచ్ఛిత్తితోనే తృప్తిపడవు. అవి ధ్వంసం చేసేది- మొత్తం జాతి ఆత్మను. ఆ జాతి గతం మీద, ఆ గతంలోని వారి ఔన్నత్యం మీద, వారి సృజన పైన, మేధస్సు మీద కూడా ముసుగు కప్పుతుంది. వర్తమానతరాన్ని అంధకారంలో ఉంచుతుంది. వాళ్ల ఆధిపత్యం కోసం నీ మతం, నీ జీవన విధానం, నీ విద్యావిధానం, నీ చింతనాధోరణి, నీవు ఆరాధించే పురాణాలు, నిన్నటి దాకా నిన్ను నడిపించిన చరిత్ర…...

వినుర భారతీయ వీర చరిత

హేమూ కలానీ మరల బుట్టెదనుచు మాత స్వేచ్చ కొరకు యురిని ముద్దిడేను మురిపెముగను హేమమంటిబిడ్డ హేమూకలానియె వినుర భారతీయ వీర చరిత భావము సింధ్ ప్రాంతంలో జన్మించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించారు. బ్రిటిష్ వారి ఆయుధాలు రవాణా చేస్తున్న రైలును పట్టాలు తప్పించడానికి తోటి విప్లవకారులతో కల్సి ఫిష్ ప్లేట్లు తొలగించారు. ఒంటరిగా బ్రిటీషు వారికి చిక్కాడు. హేమూ కలానీని విడిచిపెట్టాలని ఆ ప్రాంత పెద్దలు బ్రిటీషు వారికి విన్నవించుకున్నారు. అందుకు సమ్మతించిన జడ్జి తోటి విప్లవకారుల పేర్లు చెప్పాలని హేమూను అడిగారు. "నాకు ఉరిశిక్ష పడినా పరవాలేదు కానీ...

వినుర భారతీయ వీర చరిత

రాణి అబ్బక్క చౌతా యుధ్ధ నౌక గనుము ఉల్లాలు రాజ్యాన పోరు బాట పట్టి పోర్చుగీసు దెబ్బ కొట్టి నట్టి  అబ్బక్కను గనుము వినుర భారతీయ వీర చరిత భావము 1947కు 300 ఏళ్ళ పూర్వమే అపరిమిత సేన, అత్యాధునిక ఆయుధాలు కలిగిన పోర్చుగీసు సేనను తక్కువ సైన్యంతో పలుమార్లు ఎదురొడ్డి వారిని పరాజితులను చేసిన వీరనారి అబ్బక్క చౌత. కేరళ ప్రాంతంలో ఉల్లాల్ అనే చిన్న రాజ్యానికి చెందిన ఈ వీరనారి పేరును ఒక యుద్ధనౌకకు పెట్టి ఇటీవలే భారత ప్రభుత్వం గౌరవించింది. ఆ వీరనారి చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్

దేశ విభజన జరిగినా ముస్లింలు భారత్‌లోనే ఎందుకు ఉండిపోయారు?

-నూపుర్ జె శర్మ స్వాతంత్ర్యానంతరం చాలామంది ముస్లింలు భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు: హిందువులు అపరాధ భావనతో నలిగిపోయేలా చేసిన ఒక నిరాధారమైన, కల్పనాత్మక,  చిత్రమైన పరిస్థితి: ముస్లింలు భారత్ లోనే ఉండిపోవాలని ఎంచుకోవటం, వాళ్ళ ప్రస్తుత సంతానం, వారసులు భారత్‌లోని సంస్కృతి, సభ్యతలతో, హిందూ అధిక సంఖ్యాకులతో మమేకం అవగలిగితే, ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న ఇస్లాం ఆధారిత ఉగ్రవాదం ఎందుకు పెరిగిందో, తార్కికపరమైన వివరణ ఇవ్వవలసి ఉంటుంది.         ప్రపంచంలోని హిందువులందరూ శ్రీరామజన్మభూమి గురించి 500 ఏళ్లుగా చేస్తున్న వీరోచిత పోరాటాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు భవ్య రామమందిర నిర్మాణం కోసం చేసిన భూమిపూజతో విజయవంతంగా...

VIDEO: నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సర్దార్ జమలాపురం కేశవరావు

అవి దేశవ్యాప్తంగా వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజులు. వందేమాతర గీతాలాపనపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. 'అయినా నిషేధించడానికి వాడెవ్వడు' అంటూ తోటి విద్యార్థులతో తరగతులను బహిష్కరింపజేశారు కేశవరావు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పోలీసుల తుపాకీ తూటాకు ఎదురొడ్డి నిలిచిన దీశాలి కేశవరావు. ఆ తెగింపునకు ప్రజలకు ఆయన్ను సర్దార్ అని అభిమానంతో పిలుచుకున్నారు. అప్పటి నుంచి కేశవరావు సర్దార్ జమలాపురం కేశవరావు అయ్యారు.

వినుర భారతీయ వీర చరిత

రాంజీ గోండు నిర్మలు నగరమున నీచ నిజాముతో రాంజి గోండు నాడు రణమొనర్చ వేయి మంది యురిని వేయబడిరిచట వినుర భారతీయ వీర చరిత భావము ప్రథమ స్వాతంత్ర్య సమరంలో నైజాం సేనను తన అనుచరులతో రాంజీ గోండు భీకరంగా ఎదుర్కొన్నారు. అయితే కపట నీతితో రాంజీ గోండుతో పాటుగా ఆయన అనుచరుల్లో 1,000 మందిని నైజాం సైనికులు, బ్రిటీష్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ నిర్మల్ నగరంలో ఒకే మర్రి చెట్టుకు ఉరి వేశారు. తల్లి భారతి స్వేచ్ఛ కోసం తనువులు అర్పించిన ఆ వీరుల చరిత విను ఓ...