జాతీయ జెండా గౌర‌వాన్ని నిలిపిన స్వ‌యంసేవ‌క్

డిసెంబర్ 27-28, 1937లో, ఫయిజ్ పూర్ (యావల్ తాలూకా, జలగావ్ జిల్లా, మహారాష్ట్ర ) లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో, 80 అడుగుల ఎత్తు గల స్తంభానికి మన మువ్వన్నెల జాతీయజెండా మార్గమధ్యంలో చుట్టుకొని, చిక్కుపడింది. అక్క‌డున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులు (సమావేశాల అధ్యక్షుడు నెహ్రూతో సహా) కంగారుపడ్డారు. కొందరు కార్యకర్తలు జెండా చిక్కుముడి విప్పేందుకు విఫలయత్నాలు చేశారు. అప్పుడు, రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్వ‌యంసేవ‌క్ అయిన శ్రీ కిషన్ సింగ్ పరదేశి ఎంతో సాహసంతో ఆ జెండా స్తంభాన్ని ఎక్కి, చిక్కుపడ్డ...

VIDEO: చరితార్థుడు ‘భూదాన్’ రామచంద్రారెడ్డి

పేరుకు వెదిరె రామచంద్రరెడ్డి అన్న మాటే కానీ.. వినోబా బావే అడిగిందే తడవుగా భూదానోద్యమం కోసం మొత్తంగా 1,000 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి 'భూదాన్' రామచంద్రారెడ్డిగా చరిత్ర పుటల్లో వారు నిలిచిపోయారు. ‘భూమికోసం యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. కానీ రామచంద్రారెడ్డిగారు మన సమస్యలను అర్థంచేసుకొని.. మొదట 100 ఎకరాల భూమిని దానం ఇవ్వడంతో భూదానోద్యమం ప్రారంభమైంది. మనం చేపడుతున్న భూదానోద్యమానికి మొదటి మహాదాత ఆయనే’ అని పోచంపల్లిలో నిండు సభలో ఉద్ఘాటించారు వినోబా బావే.

సర్‌సంఘచాలక్‌ ‌బాధ్యతకు విరామం

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 2 – డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బొలే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ నినాదం జనాదరణ పొందడానికి కారణం దాంట్లో ఉన్న నిరాడంబరత్వమే. ప్రతి ఒక్కరు వినియోగించే ఒక ఆహార పదార్థం మీద విధించిన పన్నును చూపి అందరిని మేల్కొలిపారు. ఉప్పు పన్ను భారం పడేది సామాన్యల మీదే. సముద్రతీరం లేకపోవడం వల్ల మధ్య పరగణాలు, బెరార్‌లలో ఉప్పు చట్ట అతిక్రమణ వీలుపడలేదు. దీనితో ఇతర శాసనోల్లంఘన కార్యక్రమాలు చేపట్టారు. బెరార్‌లోని పూసద్‌ (‌యావత్‌మాల్‌ ‌జిల్లా)లో జులై 10, 1930న అటవీ సత్యాగ్రహం...

శ్రీ ‌వరలక్ష్మీ నమోస్తుతే…!!

ఆగస్ట్ 5 ‌వరలక్ష్మీ వ్రతం దారిద్య్రం నుంచి ధనం వైపునకు, అజ్ఞాన తిమిరం నుంచి సుజ్ఞానం దిశగా నడిపించే దివ్య తేజోమూర్తి శ్రీమహాలక్ష్మిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. ధనం అంటే కేవలం డబ్బే కాదు. ఆరోగ్యం, ఆయుస్సు, అభయం, ధైర్యం, స్థయిర్యం, విజయం, వీర్యం, శౌర్యం, సాహసం, విద్య వివేకాలు, కీర్తిప్రతిష్ఠలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, పుత్రపౌత్రాదులు… ఇలా అన్నీ సంపదే.ఈ సమస్త సంపదలకు మూలం, వాటికి అధినేత్రి  శ్రీమహాలక్ష్మి. అష్టలక్ష్ముల తత్త్వమే అది. లక్ష్మీనారాయణులది అవిభాజ్య బంధం. ఈ ఆదిదంపతులను అర్చించడం వల్ల మోక్షం...

జాతీయ జెండా గౌరవాన్ని నిలిపిన స్వయంసేవ‌క్‌

1937 నాటి కాంగ్రెస్ ఫైజ్‌పూర్ సెషన్‌లో జెండా ఎగురవేసే కార్యక్రమంలో, త్రివర్ణ పతాకం ఎనభై అడుగుల ఎత్తులో మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడున్న చాలా మంది జెండాను చిక్కు విప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత ఒక ప్రతినిధి శ్రీ కిషన్ సింగ్ ధైర్యంగా స్తంభం పైకి ఎక్కి జెండా ను విడిపించారు. జెండా స్తంభంపై రెపరెపలాడుతుండగా బిగ్గరగా హర్షధ్వానాలు మిన్నంటాయి. కిషన్ సింగ్ ని సత్కరించే ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ సమావేశం ఆమోదించింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయవాద స్ఫూర్తి వల్లే తాను ధైర్యం తెచ్చుకున్నానని...

వినుర భారతీయ వీర చరిత

బాలగంగాధర్ తిలక్ తిలకు ఘనమగు తన కలను జనులలోన రగుల గొల్పి తాను రణము సల్పి జైలు గోడలందు జయగీతి లిఖించె వినుర భారతీయ వీర చరిత ఉత్సవములు జరుపుచుత్తేజపరచుచు జనుల సేకరణను జరిపి తాను సమరమెంతొ తిలకు సలిపె తీవ్రముగను వినుర భారతీయ వీర చరిత భావము భారతదేశం త్వరలో స్వతంత్ర సాధించి తీరుతుందని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కలగన్నారు. తాను కన్న కలను నిజం చేసుకోవడానికి ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. సామూహిక ఉత్సవాల నిర్వహణతో వారిలో ఉత్తేజాన్ని కలిగించారు. స్వాతంత్ర ఉద్యమాన్ని కొనసాగించారు. ఆంగ్లేయులు మండలే జైలులో నిర్బంధించినప్పుడు జైలు గోడల మీద...

RSS initiative in Tamil Nadu makes one crematorium for all castes of the Hindus

The selfless initiative taken by Rashtriya Swayamsevak Sangh (RSS) made a crematorium for all castes of Hindus in Tamil Nadu. The crematorium called Nandavanam was located in between the Lord Sri Kasilingeswarar Temple and River Bhavani at Mettupalayam near Coimbatore city that is similar to the setup of Kasi on the banks of River Ganga. After realising the pathetic condition...

RSS చొర‌వ‌తో ఆధ్యాత్మిక‌,సేవ‌, ఐక్య‌త‌ను చాటుతున్న నంద‌నం స్మ‌శాన వాటిక

సాధార‌ణంగా స్మ‌శాన వాటిక అంటే మ‌న‌కు గుర్తువ‌చ్చేది.. ఎవ‌రైనా చ‌నిపోతే అక్క‌డ‌కు తీసుకెళ్లి అంత్య‌క్రియ‌లు జ‌రుపుతారు అని... కానీ ఇక్క‌డ ఒక స్మ‌శాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల త‌యారీ కేంద్రంగా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి సమీపంలో మెట్టుపాలెయం పట్టణం ఉంది. ఇక్కడ కాశీ వద్ద గంగా నది ప్రవహిస్తున్న తీరుగా పశ్చిమం నుండి తూర్పు వైపున‌కు భవానీ నది ప్రవహిస్తున్న‌ది. భవానీ నది ఒడ్డున ఒక‌ప్పుడు పాత శ్మశానవాటిక ఉండేది. అంత్యక్రియల కోసం చాలా మంది హిందువులు...

వినుర భారతీయ వీర చరిత

నీరా ఆర్య కన్నభూమికొరకు కడతేర్ఛెను పతిని వక్షములను కోయ వణకకుండ నిలిచినట్టి నారి నీరార్యను గనుము వినుర భారతీయ వీర చరిత భావము స్వరాజ్య సమరాజ్ఞి నీరా ఆర్య నేతాజీ రెజిమెంటులొ సైనికాధికారిణిగా పనిచేశారు. ఆమె భర్త బ్రిటిష్ ప్రభుత్వంలో సీఐడీ అధికారిగా ఉండేవారు. నేతాజీ జాడ చెప్పమని భర్త హింసించడంతో, మాతృభూమి కోసం భర్త అని కూడా చూడకుండా ఆమె అతడిని పొడిచి చంపారు. బ్రిటీష్‌వారు ఆమెను కాలాపానీ జైలులో బంధించారు. ఆ సమయంలో నేతాజీ ఎక్కడున్నారని జైలరు నీరా ఆర్యను ప్రశ్నించగా, వారు నా గుండెలో ఉన్నారని ఆమె...

రూపాయి పతనం కాలేదు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

డాలర్ మార‌కంతో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతుంద‌నే ఆందోళన అవసరం లేదని, రూపాయి ప‌త‌నం కాలేద‌ని ఆ పరిస్థితులు కూడా లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాస్తవానికి రూపాయి తన సహజరీతిలోనే ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. మంగళవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్లో రూపాయి విలువ తగ్గడంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై నిర్మలా సీతారామన్ స్పందిచారు. రూపాయి కదలికల పై ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, భారీగా హెచ్చుతగ్గులు ఉంటేనే అవ‌స‌ర‌మున్న‌పుడు ఒడిదుడుకుల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఆర్బీఐ జోక్యం...