యూపీలో మదర్సాల సర్వేను స్వాగతించిన ముస్లిం రాష్ట్రీయ మంచ్

ఉత్తరప్రదేశ్‌లో మదర్సాల సర్వే చేపట్టే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం రాష్ట్రీయ మంచ్ స్వాగతించింది. మదర్సాల సర్వే చేపట్టడంతో ఎలాంటి హాని వాటిల్లదని మంచ్ పేర్కొంది. అదే సందర్భంలో క్రైస్తవులు, బుద్ధిస్ట్, ఆర్య సమాజ్, తదితర ధార్మిక సామాజిక వర్గాలు నిర్వహించే విద్యా సంస్థల్లోనూ ఇదే తరహా సర్వే చేపట్టాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ సభ్యులు మహ్మద్ అఫ్జల్, డాక్టర్ షాహిద్ అఖ్తర్, ఇస్లామ్...

26/11 ఉగ్ర‌దాడి బాధితులకు నివాళుల‌ర్పించ‌నున్న ఐక్య‌రాజ్య‌స‌మితి

భార‌త్‌లో జ‌రిగిన 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులకు ఐక్య‌రాజ్య‌స‌మితి నివాళుల‌ర్పించ‌నుంది. సెప్టెంబరు 8, 9 తేదీల్లో జ‌రుగుతున్న UN గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద బాధితులకు ఐక్యరాజ్యసమితి నివాళులర్పించ‌నుంది. UN వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సభ్య దేశాలు, పౌర సమాజ సంస్థలు చేపట్టే మంచి గురించి తెల‌ప‌డానికి స‌భ్యుల‌కు కాంగ్రెస్ అనుమతిస్తుంది. ఈ సంద‌ర్భంగా బాధితుల స‌మ‌స్య‌ల‌ను స‌మావేశ దృష్టికి వ‌స్తాయి. వారి అనుభవాలు వారి స్వంత దేశాలలో...

భారతీయతకు ప్రతిబింబం “కర్తవ్య మార్గ్”

ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన రాజ్‌ప‌థ్ ఇక‌పై క‌ర్త‌వ్య మార్గ్ అనే పేరుతో వాసికెక్క‌నుంది. ఇంత‌టి అత్యంత విశిష్ట‌త‌ను సంత‌రించుకున్న క‌ర్త‌వ్య‌మార్గ్ లో కీల‌కంగా నిలిచిన అంశాలు: కర్తవ్య మార్గ్‌లో నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మొత్తం అవెన్యూ ప్రాంతం ఉంటుంది. ఈ మార్గం రైసినా హిల్‌లోని రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ ఇండియా గేట్ మీదుగా ఢిల్లీలోని నేషనల్ స్టేడియం వరకు కొనసాగుతుంది.  ఇదే మార్గంలో 16 శాశ్వత నడక మార్గాల వంతెనలను అభివృద్ధి చేశారు. వలసవాద ఆలోచనా...

బంజ‌ర‌గ్ ద‌ళ్ కార్య‌క‌ర్త హర్ష హ‌త్య కేసుపై NIA చార్జిషీట్‌

క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ‌కు చెందిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసుపై 750 పేజీల ఛార్జిషీట్ ను జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీ (NIA) అధికారులు NIA ప్రత్యేక కోర్టుకు దాఖలు చేశారు. మీడియా కథనాల ప్రకారం, హత్యకు మ‌త‌ప‌ర‌మైన ద్వేషమే కారణం అని ఛార్జ్ షీట్ పేర్కొంది. పాత క‌ల‌హాల కార‌ణంగానే బ‌జ‌రంగ్‌ద‌ళ్ కార్యకర్తను హ‌త్య చేశారు. త‌ద్వారా భయాందోళనల‌ను రేకెత్తించాల‌నే ఉద్దేశ్యంతో 15 రోజుల ప‌క్కా ప్ర‌ణాళికతో హర్షను నిందితులు హత్య చేసినట్లు చార్జిషీట్ వెల్ల‌డించింది. హిజాబ్ వివాదంపై ఫెస్‌బుక్ లో హ‌ర్ష ఒక...

వినుర భారతీయ వీర చరిత

శంభాజీ తనువు ముక్క లైన తప్పక ధర్మము స్పూర్తి నింపి దేశ కీర్తి బెంచె వీర శివుని పుత్రు ధీర శంభాజియె వినుర భారతీయ వీర చరిత భావము వీర శివాజీ అనంతరం ధర్మ రక్షణకు శంభాజీ కంకణబద్ధులైనారు. ఔరంగజేబును మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా చేసినారు. శంభాజీ ఆదమరిచి ఉన్న కాలంలో ఔరంగజేబు దొంగ దెబ్బ తీశాడు. శంభాజీని బంధిస్తాడు. మతం మార్చుకుంటే ప్రాణాలతో విడిచిపెడతానని ఔరంగజేబు అంటాడు. స్వధర్మాచరణకు కట్టుబడిన శంభాజీ మతం మార్చుకోవడానికి అంగీకరించరు. అయినను శంభాజీపై ఒత్తిడి తెస్తాడు ఔరంగజేబు. తన దేహంలోని ఒక్కొక్క...

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్ ను అడ్డుకోవాలి”

"క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్ ను అడ్డుకోవాలి" మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్ ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చ‌ర్చిల‌కు చెందిన పాస్ట‌ర్లు క్రైస్త‌వ బాలిక‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ల‌వ్ జిహాద్ ద్వారా క్రైస్తవ కుటుంబాలకు చెందిన బాలికలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పాస్టర్ విజ్ఞ‌ప్తి చేశారు. కేరళలోని ఆర్చ్...

హిందువులపై న‌ర‌మేధానికి అద్దం పట్టే మలయాళ చిత్రానికి అనూహ్యమైన మద్దతు

మ‌లబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జ‌రిపిన‌ న‌ర‌మేధం ఆధారంగా రూపొంది కేర‌ళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోత‌లు ఎదుర్కొన్న మ‌ల‌యాళ చిత్రం "పూజా ముతల్ పుజా వారే" (Puzha Muthal Puzha Vare) కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు చెందిన జె నంద‌కుమార్ జీ మద్దతు తెలిపారు. చిత్ర ద‌ర్శ‌కుడు అలీ అక్బర్‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు. చారిత్రక ఆధారాలున్న చిత్రంలోని స‌న్నివేశాల‌ను తొలగించాల‌ని చిత్రనిర్మాతను కోరడం ఘోరమైన అన్యాయమని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. “సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి...

VIDEO: ఖైరతాబాద్ వినాయకునికి ఆర్ఎస్ఎస్ స్వరార్చన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) భాగ్యనగర్ సంభాగ్ (హైదరాబాద్ – సికింద్రాబాద్) ఆధ్వర్యంలో సోమ‌వారం (05-సెప్టెంబ‌ర్‌) హైదరాబాదులోని అతిపెద్ద వినాయక ప్రతిమైన ఖైరతాబాద్ వినాయకుని సమక్షంలో ఘోష్ నాదంతో స్వయంసేవకులు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో 140 మంది ఆర్.ఎస్.ఎస్ ఘోష్ స్వయంసేవకులు పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు సాగిన ఘోష్ వాదనను ఆలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఘోష్ వాదన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ ప్రాంత, విభాగ్ అధికారులు పాల్గొన్నారు.

VIDEO: ఇందిరా గాంధీ ఇంటి ఎదుట సత్యాగ్రహం

స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ లక్ష్మి నారాయణ గారు విశ్వసించేవారు. స్వతంత్ర భారత్‌లో అనేక మంది వినియోగించుకుంటున్న పెన్షన్ అవకాశం నిజాం పాలిత ప్రాంతాల యోధులకు దక్కడంలేదు. ఈ అంశంపై అప్పటి కేంద్ర ప్రభుత్వంతో లక్ష్మినారాయణ చర్చలు జరిపారు. అయినా పెన్షన్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. అందుకు నిరసనగా "తెలంగాణ సమరయోధుని సత్యాగ్రహం” అని రాసి ఉన్న ఒక అట్టను మెడలో వేసుకుని అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ నివాసం ఎదుట నిరాహార దీక్షకు ఆయన నాంది పలికారు....

RSS ప్రధాన కార్యాలయానికి CISF భ‌ద్ర‌త

నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయానికి భద్రత పెంపు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) భ‌ద్ర‌తా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్ల‌డించింది. RSS ప్రధాన కార్యాలయానికి సుమారు 15 సంవత్సరాలుగా భద్రత కల్పించిన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, నాగ్‌పూర్ పోలీసుల స్థానంలో ఒక CISF ఉన్న‌తాధికారితో పాటు సుమారు 150 మంది సిబ్బంది చేరారు. సీఐఎస్‌ఎఫ్ బృందానికి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని...