వినుర భారతీయ వీర చరిత

ఝల్కరీబాయి ఝాన్సిరాణి తోడు ఝల్కరీ బాయేను చిన్ననాడె జంపె చిరుతపులిని పులివలెను చెలగెను తొలి స్వేచ్చ సమరాన వినుర భారతీయ వీర చరిత భావము చిన్ననాడు పశువులకు కాపలాగా వెళ్ళి చిరుతపులితో పోరాడి దాని గొంతులో కర్ర దించి చంపింది. 1857 తొలి స్వతంత్ర సంగ్రామంలో ఝాన్సీ రాణి అనుచరురాలిగా ఉండి, బ్రిటిషు వాడిని ఏమార్చడానికి అపర ఝాన్సీలాగ వేషం గట్టి, వీరోచితంగా పోరాడిన ఝల్కరీబాయి వీర చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్

వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా సేవా భార‌తి

గ‌త 10 రోజులుగా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. నీటి ఉదృత అధికమ‌వ‌డంతో అనేక చోట్ల వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇండ్ల‌లోకి నీరు చేరి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. ఖ‌మ్మం జిల్లా పినపాక, కొత్తగం, చెర్ల, భద్రాచలం, బూర్గంపాడుతో పాటు సుమారు 500పై గ్రామాలు 4 ప్రధాన జిల్లాలు ఖమ్మం, ఇండోర్, కరీంనగర్, వరంగల్ తీవ్రంగా ప్రభావితం చేయబడింది. ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నా గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉండడంతో...

అస‌లైన చ‌రిత్ర‌ను బ‌య‌ట‌కు తీసుకురావాలి – “తెలంగాణ అజ్ఞాత వీరులు” సెమినార్ లో వ‌క్త‌ల అభిప్రాయం

ఇతిహాస సంకలన సమితి (భారతీయ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్(ICHR), ఆంధ్ర మహిళా సభ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సభ ఆడిటోరియంలో "తెలంగాణ అజ్ఞాత వీరులు" అనే అంశంపై శ‌నివారం (16.07.2022)  సెమినార్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ వైస్ ఛాన్స్‌ల‌ర్ ప్రొఫెసర్ కెవిఎస్ శర్మ గారు, ఇతిహాస సంకలన సమితి తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ శ్రీ వేముగంటి కిషన్ రావు గారు, ఐసిహెచ్ఆర్ సభ్యులు, ఆంధ్ర మహిళా సభ...

కోవిడ్ డోసులు @200కోట్లు: వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ అరుదైన రికార్డు

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా వ్యాక్సినేష‌న్‌ను భార‌త్ విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. గ‌తేడాది జనవరి 16 ప్రారంభ‌మైన వ్యాక్సిన్ పంపిణీ 18 నెలల్లోనే 200 కోట్ల డోసుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా 200,00,15,631 డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఘనతపై ప్రధాని మోదీ స్పందిస్తూ భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ ఇదెంతో గర్వకారణమన్నారు. కరోనా...

వినుర భారతీయ వీర చరిత

రాణి అవంతి బాయి పొరుగు రాజులనిట పోరుబాట నడుప తెల్లవాని గుండెఝల్లనంగ రణపు చండికయ్యె రణమునను అవంతి వినుర భారతీయ వీర చరిత భావము బ్రిటిషువారి దుర్మార్గపు పాలనను గుడ్డిగా అనుకరించకుండా ధైర్యంగా భరతమాత వీర పుత్రుడు పోరాడాలని పిలుపునిచ్చి, 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో పొరుగు రాజ్యాల రాజులందరిని ఏకం చేసి, ఆంగ్లేయులను బెదరగొట్టి ఓడించింది. యుద్ధములో చండిక వోలె చెలరేగిన రామఘడ్ రాణి అవంతి బాయి వీర చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్

వినుర భారతీయ వీర చరిత

గురు తేజ్ బహదూర్ సింగ్ తలను కోసినింత ధర్మము దప్పక నిలచె జూడు తాను నిశ్చలముగ వీర గురు వితండు ధీర తేజ బహదూర్ వినుర భారతీయ వీర చరిత భావము ఇస్లాంను స్వీకరించండి అని సిక్కులను బెదిరించాడు ఔరంగజేబు. 'నన్ను మార్చిన తర్వాతనే మిగతా వారిని మార్చండి' అని ఔరంగజేబుకు తెలిపారు సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్ సింగ్. సిక్కుల 9వ గురువుతో ఇస్లాం స్వీకరించేలా శతవిధాలుగా ప్రయత్నించి, విఫలమైనాడు ఔరంగజేబు. ఆగ్రహంతో గురు తేజ్ బహదూర్ శిరస్సును ఖండించమని ఆజ్ఞాపిస్తాడు. తన శిరస్సు ఖండిస్తున్నప్పటికీ చిరునవ్వుతో...

వినుర భారతీయ వీర చరిత

ఫతేసింగ్, జొరావర్ సింగ్ ఇటుకలన్ని పేర్చ ఇంచుకన్ కదలక నిల్చినారిరువురు నిబ్బరముగ పరమధీరులేను ఫతెజొరావరసింహ వినుర భారతీయ వీరచరిత భావము సిక్కుల పదవ గురువు గురుగోవిందసింహుని పుత్రులు ఫతేసింహ, జొరావర్ సింహ. వీరిని ఇస్లాం మతం స్వీకరించండి అని ఔరంగజేబు చెబితే తిరస్కరించిన కారణంగా, వీరిని సజీవ సమాధి చేయమని ఆదేశిస్తాడు కరకు ఔరంగజేబు. ఈ పసిబాలురిని ఇద్దరినీ నిలబెట్టి చుట్టూ ఇటుకలు పేర్చి బతికుండగానే సమాధి కడుతుంటే కొంచెం కూడా చలించకుండా నిలబడ్డారే గాని తమ ధర్మాన్ని వీడలేదు. ధర్మ రక్ష కోసం బలియైన వీర పుత్రుల చరిత విను...

VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి సరోజిని

బెంగాల్ విభజనకు కలత చెందిన సరోజినీ నాయుడు 1905లో స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు. స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో 1915-16 సంవత్సరాల్లో దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించారు. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి అన్యాయం జరిగినట్టే, దేశం అనుభవించే బానిసత్వం నీవూ అనుభవించవలసిందే" అంటూ దేశమంతా తిరిగి ప్రజల్లో దేశభక్తిని నూరిపోశారామె.

ఒక్క ఆటోలో అంత మంది ప్రయాణికులా? ఇలాగైతే భారత్ జనసంద్రమే..!

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫతేఫూర్ జిల్లాలో వాహనాల రాకపోకలను నియంత్రించే పనిలో పోలీసులు ఉండగా వారి దృష్టిని అత్యంత వేగంగా పోతున్న ఒక ఆటో ఆకర్షించింది. అప్రమత్తమైన పోలీసులు అడ్డూ అదుపూ లేకుండా పరుగులు తీస్తున్న సదరు ఆటోను వెంబడించారు. ఎట్టకేలకు వాహనాన్ని ఆపారు. ఆటో ఆగిన వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను కిందకు దిగాలని పోలీసులు సూచించారు. చీమలపుట్టను కదలించినట్టుగా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వరుసగా దిగుతున్న ప్రయాణికులను చూసి పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. ఇలా కాదని ఆటో నుంచి దిగుతున్నవారిని...

వినుర భారతీయ వీర చరిత

కనకలతా బారువా రక్షక నిలయమున రణ జెండ నుంచగ గుండు దిగిన పోలె గుండె దిటవు కన్న భూమి బిడ్డ కనకలతా బార్వ వినుర భారతీయ వీర చరిత భావము:  క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. అస్సాంలో కనకలతా బారువా అనే 17సంవత్సరాల యువతి జాతీయ పతాకాన్ని బ్రిటీష్ పోలీస్ స్టేషన్‌పై ఎగురవేయాలని నిర్ణయించింది. ఆ ప్రయత్నంలో తెల్లదొరల తూటాలకు నేలకొరిగింది. పతాకం నేలను తాకకుండా జాతీయ జెండాను తన అనుచరులకు అప్పగించింది. జాతీయ పతాకం కోసం ప్రాణ త్యాగం చేసింది. ఇలా చివరి క్షణంలో సైతం మాతృభూమి...